Erukala Community - Vishvambhara News

ఎరుకల కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.. కెమసారం తిరుపతి డిమాండ్
Ekalavya Jayanti: ఏకలవ్యుని జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి డిమాండ్ చేశారు. ఎరుకల కుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు సంక్షేమ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను కోరారు.

హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఎరుకల ప్రజాసమితి ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆరు లక్షలకు పైగా ఎరుకల కులస్తులు ఉన్నప్పటికీ వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరుకల కులస్తుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏకలవ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ప్రత్యేక ప్యాకేజీ కింద ఎరుకల కులస్తుల సంక్షేమానికి ప్రతి ఏడాది రూ.10 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో ఏకలవ్య గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రతి ఏడాది ఏకలవ్య జయంతి ఉత్సవాలను ఐదు రోజుల పాటు అధికారికంగా నిర్వహించాలని, ఎరుకల కులస్తులంతా ఐక్యంగా పాల్గొని ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎరుకల ప్రజాసమితి నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని కోరారు.