Prabhas - Vishvambhara News

ప్రభాస్ ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
విశ్వంభర, సినిమా బ్యూరో:  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ విడుదల తేదీ ఖరారు అయ్యింది. సంక్రాంతి పండుగ కానుకగా చిత్ర యూనిట్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను 2027, మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాలో ప్రభాస్ అకాడమీ టాపర్ అయిన ఒక పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ‘సౌండ్ స్టోరీ’ ఆడియో టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఒక పోలీసు అధికారి రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లడం, అక్కడ జైలర్ ప్రకాష్ రాజ్‌తో జరిగే సంభాషణలు సినిమాలోని డ్రామాను హైలైట్ చేస్తున్నాయి. ఇప్పటివరకు చూడని ఒక ‘సరికొత్త’ కోపంలో ప్రభాస్‌ను సందీప్ వంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో పోలీసు కథతో పాటు అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యం కూడా ఉండబోతోంది. ముఖ్యంగా సినిమా ద్వితీయార్ధంలో వచ్చే సీన్లు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని, ఆ మలుపులే సినిమాకు ప్రాణమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 9 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నూతన సంవత్సరం లుక్ తర్వాత, ఇప్పుడు విడుదల తేదీ కూడా రావడంతో సోషల్ మీడియాలో 'స్పిరిట్' ట్రెండింగ్ మొదలైంది. ప్రభాస్ మార్క్ మాస్ యాక్షన్, సందీప్ వంగా స్టైల్ ఇంటెన్సిటీ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఇల్లు తీసుకున్నా ప్టార్ హీరోయిన్
ప్రేక్షకులంతా "రాజా సాబ్" సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ తో వర్క్ చేయడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చిందని హీరోయిన్ నిధి అగర్వాల్ అన్నారు రాజాసాబ్ హిట్ తర్వాత ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "రాజా సాబ్" ముందు సినిమా హరి హర వీరమల్లులో నేను రాకుమారి పాత్రలో నటించాను. ఈ సినిమాలో ఏంజెల్ గా కనిపించాను. ఈ రోల్ లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. నా క్యారెక్టర్ వరకు కాకుండా మొత్తం కథ విన్నాను. కథ విన్నప్పుడే ఇది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని అర్థమైంది. అన్ని తాంత్రిక విద్యలు, సైకలాజికల్ గేమ్స్ ఆడే ఓ దుష్టశక్తిని దైవికంగా ఎదుర్కోవడాన్ని కొత్తగా దర్శకుడు మారుతి గారు చూపించారు. ఆ పాయింట్ యూనిక్ గా అనిపించింది.  నేను హరి హర వీరమల్లుతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా చేశా. రెండు సినిమాల షూటింగ్స్ కోసం ట్రావెల్, నిద్ర కూడా ఉండకపోయేది. ఆ టైమ్ లో రాజా సాబ్ మేకర్స్ బాగా సపోర్ట్ చేశారు. నన్ను సెట్ లో బాగా చూసుకునేవారు. అందుకే ప్రభాస్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు నిధి అగర్వాల్ అంటే సెట్ లో అందరికీ ఇష్టమని. ఈ కెరీర్ అంటే నాకు ప్యాషన్ కాబట్టి ఇలా కష్టపడటం ఇబ్బందిగా అనిపించలేదు. పవన్ కల్యాణ్ గారితో హరి హర వీరమల్లులో నటించినప్పుడు ఆయనను పవర్ స్టార్ అని ఎందుకు అంటారో అర్థమైంది. చాలా ధైర్యంగా ఉంటారు. ప్రభాస్ గారితో వర్క్ చేసినప్పుడు ఎంత ఎదిగినా వినయంగా ఎలా ఉండాలో అర్థమైంది. ఈ జర్నీలో ఎంతో నేర్చుకున్నా. ప్రస్తుతం తెలుగులో మూడు చిత్రాల్లో నటిస్తున్నా. హిందీలో రెండు మూవీస్ చేస్తున్నా. తెలుగులో బిజీగా ఉండటం వల్ల హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నా. ఇక్కడికి షిప్ట్ అవుతున్నా. నా బాల్యం నుంచే హీరోయిన్ కావాలని కలగన్నా. నేను కలగన్న కెరీర్ నే కొనసాగిస్తున్నా కాబట్టి కొత్తగా నేను కోరేది ఏమీ లేదు. హీరోయిన్ గా మంచి పర్పస్ ఫుల్ ప్రాజెక్ట్స్ చేయాలని ఆశిస్తున్నా అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

కల్కి సినిమాపై రాజమౌళి సంచలన కామెంట్లు
కల్కి సినిమా ఈ రోజు ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయింది. ఎంతో కాలంగా సైన్స్ ఫిక్షన్ మూవీగా ఊరిస్తున్న ఈ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. పైగా ప్రభాస్ తో పాటు అమితాబ్, కమల్ హాసన్ ఉండటంతో హైప్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే నేడు థియేటర్లోకి వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది.

దాంతో ఈ సినిమాలో నటించిన దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా మూవీపై కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సినిమా చూస్తున్నంత సేపు అద్భుతంగా ఉందని చెప్పారు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ నటనకు ఫిదా అయినట్టు చెప్పారు. నాగ్ అశ్విన్ ఇంత గొప్ప సినిమాను తీయడం అభినందనీయం అని తెలిపారు. వైజయంతి మూవీస్ వారు ఇంత పెద్ద సాహసం  చేయడం గొప్ప విషయం అని ప్రశంసలు కురిపించారు.

కల్కి సినిమా రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఓకే.. ఎంతంటే..?
ఇండియా, అమెరికా అని అసలే బేధాలు లేవు. ఇప్పుడు ప్రపంచం అంతటా 'కల్కి 2898 ఏడీ' ఫీవర్ నెలకొంది. గురువారం ఉదయం మొదటి ఆటకు వెళ్లాలని ప్రభాస్ ఫ్యాన్స్, సామాన్య ప్రజలు అందరూ ఆసక్తిగా వున్నారు. ఓవర్సీస్, అమెరికాతో పాటు తెలంగాణలో కూడా  'కల్కి 2898 ఏడీ' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు.

కానీ ఏపీలో ఇంకా కాలేదు. ఇవాళ బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా టికెట్స్ రేట్లను పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో 75... మల్టీప్లెక్స్‌లలో 125 వరకు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఐదో ఆటకు  పచ్చజెండా ఊపింది. రెండు వారాలు... అంటే 14 రోజుల పాటు ఈ వెసులుబాటు ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం  సింగిల్ స్క్రీన్లలో రూ. 75 పెంచింది. ఇది  8 రోజుల వరకు మాత్రమే. మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 100 రూపాయలు పెంచింది.

'కల్కి' సినిమా టికెట్ ధరల పెంపు.. సర్కార్ గ్రీన్‌సిగ్నల్
ప్రభాస్ హీరోగా నాన్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇటీవల టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకుంది.

ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 'కల్కి 2898 ఏడీ' చిత్ర టికెట్‌పై గరిష్ఠంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 75, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 100 వరకు పెంచుకోవచ్చని తెలిపింది. దీంతో పాటు ఈ నెల 27న ఉదయం 5.30 గంటల షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభాస్ ‘కల్కి ఏడీ 2898‘ ఫస్ట్ సింగిల్ విడుదల
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘కల్కి ఏడీ 2898’.  ప్రభాస్తోపాటు దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఈనెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు.

ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్‌ను విడుదల చేయగా యూట్యూబ్‌లో ఆ రెండు వీడియోలు మిలియన్‌ వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు. ఫస్ట్ సింగిల్ ‘భైరవ యాంథెమ్’ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్లిత్ దోసంత్ పాడారు. సంతోశ్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ లెబెల్ అయిన సరిగమ సొంతం చేసుకుంది.

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘కల్కి’ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్
పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 AD’ ఒక‌టి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదల కానుంది. వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీపికా ప‌దుకొనే, దిశా ప‌టానీ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రభాస్ అభిమానులు ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ‘కల్కి 2898AD’ ట్రైలర్‌ను జూన్ 10వ తేదీన విడుద‌ల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పనిలో పనిగా దీపికా ప‌దుకొనే కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేవిధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేయ‌నున్నారు.

𝐓𝐡𝐞 𝐡𝐨𝐩𝐞 𝐛𝐞𝐠𝐢𝐧𝐬 𝐰𝐢𝐭𝐡 𝐡𝐞𝐫.#Kalki2898AD Trailer out Tomorrow.@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani #Kalki2898ADonJune27 pic.twitter.com/rNq0Hy4Npy

— Suresh PRO (@SureshPRO_) June 9, 2024

రీరిలీజ్‌కు సిద్ధమైన ప్రభాస్ ‘చక్రం’ సినిమా
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. హీరోల జన్మదిన వేడుకలు లేదా సినిమా వార్షికోత్సవాల సందర్భంగా ఇదివరకు సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలను విడుదల చేస్తున్నారు. దీంతో థియేటర్లలో అభిమానుల సందడి అంతాఇంతా కాదు. ఇదిలా ఉంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన వర్షం, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలు ఇప్పటికే రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే.

తాజాగా ప్రభాస్ నటించిన క్లాసికల్ మూవీ ‘చక్రం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 8వ తేదీన గ్రాండ్‌గా రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మిశ్రమ ఫలితాలను అందుకుంది. అయినప్పటికీ చాలా మంది గుండెల్లో ఈ సినిమా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

టీవీల్లో ఈ సినిమా ప్రసారమయ్యాక ప్రేక్షకాదరణ పెరిగింది. అయితే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రి అందించిన పాటలు హైలెట్ అని చెప్పాలి. ఇప్పటికీ చాలా మంది తమ ప్లేలిస్ట్‌లో ఈ సినిమా పాటలు వింటుంటారంటే అతిశయోక్తికాదు. ఈ క్లాసికల్ సినిమాలో ఛార్మి, ఆసిన్‌లు హీరోయిన్లుగా నటించారు. అదేవిధంగా ప్రకాష్‌రాజ్ హీరో తండ్రి పాత్రలో నటించి మెప్పించారు.

వాళ్ళను బాధ పెట్టడం ఇష్టంలేకే పెళ్లి చేసుకోవడం లేదు: ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్ళికి రెడీ అయినట్లు గత ఏడాది నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ పెద్దమ్మ కూడా ఆ మధ్య ఇదే చెప్పారు. దీంతో డార్లింగ్ మ్యారేజ్‌కు సంబంధించి ఎప్పుడెప్పుడు గుడ్‌న్యూస్ వస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

అయితే, బుధవారం జరిగిన ‘కల్కి’ స్పెషల్ ఈవెంట్‌లో యాంకర్ సుమ ప్రభాస్‌ను ఆటపట్టించింది. మొన్నెప్పుడో స్పెషల్ వ్యక్తి వస్తుందని అనగానే.. ఎంత మంది అమ్మాయిల గుండెలు పగిలిపోయాయో తెలుసా? అని సుమ అనగానే.. ప్రభాస్, ఆ అమ్మాయిల కోసమే పెళ్లి చేసుకోలేదని చెప్పాడు. అమ్మాయిలందరినీ బాధ పెట్టడం ఇష్టం లేకే పెళ్లి చేసుకోవడం లేదని సుమకు ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. కాగా, ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.