School Education - Vishvambhara News

రూ.2.5 కోట్ల టెండర్ రద్దు చేయాలి.. ప్రభుత్వాన్ని కోరిన టెండర్ ప్రతినిధులు
Hyderabad News: హైదరాబాద్‌లోని 250 ఉచిత ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్, ప్లే మెటీరియల్, పెయింటింగ్ పనుల కోసం విడుదల చేసిన రూ.2.5 కోట్ల టెండర్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. టెండర్ నిబంధనలను ఉల్లంఘించి, అధిక మొత్తంతో బిడ్ దాఖలు చేసిన శాన్వి సేల్స్ కార్పొరేషన్‌కు అధికారులు అక్రమంగా టెండర్ కట్టబెట్టారని పలువురు టెండర్ ప్రతినిధులు ఆరోపించారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, టెండర్ నిబంధనల ప్రకారం సెల్ టాక్స్ సర్టిఫికెట్ సమర్పించడం తప్పనిసరి అయినప్పటికీ, శాన్వి సేల్స్ కార్పొరేషన్ ఆ పత్రాన్ని సమర్పించకుండానే డిప్యూటీ కలెక్టర్ టెండర్‌ను ఖరారు చేశారని విమర్శించారు. అధికారులు కొందరి ప్రోద్బలంతో అర్హతలు లేని సంస్థకు టెండర్ కేటాయించారని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించి నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం కేటాయించిన టెండర్‌ను వెంటనే రద్దు చేసి అర్హత కలిగిన సంస్థకు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు లేదా శాన్వి సేల్స్ కార్పొరేషన్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.