Anantapur News - Vishvambhara News

అపిలేపల్లిలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు.. ఖాళీ బిందెలతో నిరసన
Anantapur News: అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామంలో తాగునీటి సమస్యపై మహిళలు ఆందోళనకు దిగారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతూ ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నా అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి అవసరాలకు సరిపడా నీరు అందక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఎన్నిసార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపడం లేదని ఆరోపించారు. దీంతో చేసేదేమీ లేక రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు.మహిళలు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బస్సులు నిలిచిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అపిలేపల్లి గ్రామంలోని తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

పది రోజులుగా కరెంట్ క‌ట్.. హాంపాపురంలో కరెంట్ కోసం అర్ధరాత్రి రోడ్డెక్కిన రైతులు
Anantapur News: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హాంపాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి రైతులు ఆందోళనకు దిగారు. పొలాలకు నీరు పెట్టుకోవాల్సిన సమయంలో వ్యవసాయ విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు నీరు అందించేందుకు విద్యుత్ కోసం అర్ధరాత్రి సబ్‌స్టేషన్ గేట్ల వద్దకు వచ్చి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.

గత పది రోజులుగా వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతోందని రైతులు ఆరోపించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కరెంట్ కోసం ఎదురుచూస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి పంటలు సాగు చేస్తుంటే.. బోర్లు పనిచేయక నీరు అందక పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కీలకమైన పంట దశలో విద్యుత్ సమస్యల కారణంగా నష్టపోయామని, ఇప్పుడు కూడా అధికారులు స్పందించకపోతే మరోసారి తీవ్ర నష్టం తప్పదని అన్నారు.

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఉద్యాన పంటలకు ప్రాణాధారమైన విద్యుత్‌ను సక్రమంగా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రైతులు పేర్కొన్నారు. రైతు పంటకు నీరు కావాలి.. నీటికి కరెంట్ కావాలని, కరెంట్ కోసం రైతు అర్ధరాత్రి సబ్‌స్టేషన్‌కు రావాల్సి వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలని, పంటలు ఎండిపోయిన తర్వాత పరిహారం కోసం పరుగులు పెట్టించే పరిస్థితి కాకుండా పంట ఎండిపోకముందే విద్యుత్ అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

నష్టపరిహారం ఇవ్వకుండానే హైటెన్షన్‌ లైన్లు.. అనంతపురంలో రైతు ఆవేదన
Anantapur News: అనంతపురం జిల్లా కూడేరు మండలం కమూరు గ్రామంలో రైతు శ్రీధర్‌ చౌదరి తన భూమిలో నష్టపరిహారం చెల్లించకుండా హైటెన్షన్‌ లైన్లు ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌ ప్రొటెక్షన్‌తో ఎమ్మార్వో మోహన్‌కుమార్‌ తన పొలానికి ఉన్న గేటు తాళం పగలగొట్టి అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించి హైటెన్షన్‌ లైన్లు వేస్తున్నారని రైతు ఆరోపించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే రైతులకు న్యాయం చేయకుండా, నష్టపరిహారం చెల్లించకుండా తమ భూముల్లో విద్యుత్‌ టవర్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

తన భూమిలో ఎలాంటి సంతకాలు తీసుకోకుండా హైటెన్షన్‌ టవర్లు ఏర్పాటు చేస్తున్నారని శ్రీధర్‌ చౌదరి తెలిపారు. నష్టపరిహారం చెల్లింపుల్లో కూడా రైతులందరికీ ఒకే విధంగా కాకుండా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా చెల్లిస్తున్నారని ఆరోపించారు. హైటెన్షన్‌ టవర్లు ఏర్పాటు చేసిన తర్వాత భూమి విలువ తగ్గడంతో పాటు వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. చదువుకున్న తనకే అధికారుల నుంచి అన్యాయం జరుగుతుంటే, చదువుకోని రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల సమస్యలపై అధికారులు స్పందించి నష్టపరిహారం విషయంలో స్పష్టత ఇవ్వాలని, నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని రైతు కోరారు. ఇదే సమయంలో సమస్యపై కవరేజ్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులను ప్రాజెక్ట్‌ మేనేజర్లు వినోద్‌, మహేష్‌ అవహేళన చేశారని పేర్కొంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. రైతులకు న్యాయం చేయాల్సిన అధికారులు, ప్రాజెక్టు సిబ్బంది సమస్యను పరిష్కరించకుండా మీడియాపై వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు అంటున్నారు.

రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పే ప్రభుత్వాల మధ్య క్షేత్రస్థాయిలో రైతులు తమ భూముల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛభారత్‌ వంటి కార్యక్రమాలతో పాటు రైతు సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. కమూరు గ్రామంలోని రైతు శ్రీధర్‌ చౌదరి సమస్యపై జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని, నష్టపరిహారం చెల్లింపులు, హైటెన్షన్‌ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలు పరిశీలించి రైతుకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి
Ketireddy Peddareddy: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాడిపత్రిలో జరుగుతున్న అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. గోవా లిక్కర్‌ అక్రమ సరఫరా, అక్రమ మద్యం, గంజాయి, పేకాట వంటి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలతో కమిటీ వేయాలని జేసీ ప్రభాకర్‌ రెడ్డి కోరుతున్నారని, అయితే మంత్రులు పయ్యావుల కేశవ్‌, టీజీ భరత్‌తో కమిటీ వేసి విచారణ చేయించాలని కేతిరెడ్డి సూచించారు.

తాడిపత్రిలో అక్రమ మద్యం, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని కేతిరెడ్డి ఆరోపించారు. కొన్ని పోలీస్‌ స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తాడిపత్రిలోని పోలీస్‌ స్టేషన్లకు ‘జేసీ స్టేషన్‌’ అని పేరు పెట్టుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా తరహాలో అన్నింటికీ జేసీ ప్రభాకర్‌ రెడ్డి పేరు పెడితే సరిపోతుందని అన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌ రెడ్డి తన తండ్రి జేసీ ప్రభాకర్‌ రెడ్డిని గ్యాంగ్‌స్టర్‌లా తయారు చేశారని కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 24 మంది వైఎస్సార్‌సీపీ నేతలను అంతం చేస్తామని ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌ రెడ్డి, జేసీ ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సాక్షాత్తూ ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. తాడిపత్రిలో చోటుచేసుకుంటున్న ఆరోపణలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, ప్రజలకు భద్రత కల్పించాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్‌ చేశారు.

సెట్టూరు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థి మృతి..ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
Anantapur Settur SC Hostel: అనంతపురం జిల్లా సెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతిగృహంలో పహరీ గోడ కూలి ఓ విద్యార్థి మృతి చెందడం, మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందా అనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని దళిత, గిరిజన ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. హాస్టళ్లలోని సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న భవనాలు, పహరీ గోడలను ముందుగానే గుర్తించి మరమ్మతులు చేపట్టి ఉంటే ఈ విషాదం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సెట్టూరు ఘటన ఒక్క హాస్టల్‌కు పరిమితమైన సమస్య కాదని, అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు ఎస్సీ వసతిగృహాలు, విద్యార్థుల హాస్టళ్లు, పాఠశాల భవనాలు, పహరీ గోడలు శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సెట్టూరు ఘటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతిగృహాలు, హాస్టళ్లు, పాఠశాల భవనాలు, పహరీ గోడలపై తక్షణ భద్రతా తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న నిర్మాణాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, అవసరమైతే విద్యార్థులను సురక్షితమైన ప్రత్యామ్నాయ వసతులకు తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరోవైపు కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి బాటలో ఉందంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పాఠశాలలు, రహదారులు, గ్రామాల మౌలిక వసతుల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పత్రికల్లో అభివృద్ధికి సంబంధించిన కథనాలు వస్తున్నా, విద్యార్థుల హాస్టళ్ల దుస్థితి, గ్రామీణ ప్రాంతాల సమస్యలు మాత్రం ఎందుకు ప్రధానంగా చర్చకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. సెట్టూరు ఎస్సీ బాలుర వసతిగృహంలో పహరీ గోడ కూలి విద్యార్థి మృతి చెందిన ఘటనపై పత్రికల్లో కథనాలు వెలువడుతున్నా నియోజకవర్గ ఎమ్మెల్యే ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి జరుగుతోందని చెప్పుకోవడం మాత్రమే కాకుండా విద్యార్థుల భద్రత, పాఠశాలలు, హాస్టళ్ల పరిస్థితిపై కూడా ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

పహరీ గోడ కూలి విద్యార్థి మృతి చెందడం, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడటానికి కారణమైన పరిస్థితులపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గతంలో హాస్టళ్ల దుస్థితిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? వాటిపై అధికారులు ఏ చర్యలు తీసుకున్నారు? ఎప్పుడు తనిఖీలు నిర్వహించారు? ప్రమాదకర నిర్మాణాలను గుర్తించినా ఎందుకు మరమ్మతులు చేపట్టలేదు? అనే అంశాలను విచారణలో తేల్చాలని కోరుతున్నారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి అండగా నిలవాలని, గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు ఎవరి నిర్లక్ష్యం ఉన్నా బాధ్యతను నిర్ధారించి కఠినమైన శాఖాపరమైన, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థుల ప్రాణాలు అధికారుల నిర్లక్ష్యానికి బలికాకుండా జిల్లా యంత్రాంగం, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి అన్ని హాస్టళ్లలో భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

జంతర్ మంతర్ ఘటనను ఖండిస్తూ అనంతపురంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిరసన
Anantapur News: అనంతపురం నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సాకే గురుమూర్తి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసన సందర్భంగా జరిగినట్లు ఆరోపిస్తున్న పోలీసు చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాకే గురుమూర్తి, విద్యార్థులపై బలప్రయోగానికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలను అణచివేయడం కాకుండా వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు తెలిపే హక్కును ప్రతి ఒక్కరికీ కల్పించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అనంతపురంలో ఉద్రిక్తత.. బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur BJP: అనంతపురం జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా బీజేపీ అధ్యక్షుడి నాయకత్వంలో కార్యకర్తలు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరారు. అయితే కాంగ్రెస్ కార్యాలయం వద్దకు చేరకముందే పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పరిస్థితి అదుపులో ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కొండపై ఇరుక్కుపోయిన ఎలుగుబంటి.. క్వారీల్లో తవ్వకాలకు తాత్కాలిక బ్రేక్
Rayadurgam News:అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్లు కొండల్లో ఓ ఎలుగుబంటి సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. ఆహారం కోసం కొండపైకి ఎక్కిన ఎలుగుబంటి తిరిగి దిగేందుకు మార్గం లేక శిఖరంపై ఇరుక్కుపోయినట్లు సమాచారం. క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు ఎలుగుబంటిని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి, బీట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎలుగుబంటి భయాందోళనలకు గురికాకుండా సురక్షితంగా సహజ ఆవాసంలోకి వెళ్లేలా చర్యలు చేపట్టడంతో పాటు కొండ ప్రాంతంలోని క్వారీల్లో కంకర తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎలుగుబంటికి ఎలాంటి హాని జరగకుండా అడవిలోకి పంపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అలాగే అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలు, క్వారీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, ఎలుగుబంటి కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో యువతి ఆత్మహత్యాయత్నం
Anantapuram News: అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో యువతి ఆత్మహత్యాయత్నం వివరలోకి వెళ్తే సోమలదొడ్డి సి పి ఐ కాలనీ నివాసం ఉంటున్నటువంటి యువతి ని మాజీ విద్యార్థి సంఘం నాయకుడు  కుల్లాయప్ప  ప్రేమ పేరుతో మోసం చేసి వాడుకోవడంతో ఆ యువతి సోమవారం ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేయగా ఆ కంప్లైంట్ ను రూరల్ పోలీస్ స్టేషన్ కి ఫార్వర్డ్ చేస్తారు. మంగళవారం ఆ యువతి రూరల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లగా అక్కడ కుల్లాయప్ప నేను నిన్ను పెళ్లి చేసుకోనని కళాఖండిగా చెప్పడంతో మనస్థాపన చెందిన యువతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. అనంతరం ఆ యువతిని అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించినట్లు సిఐ శ్రీకాంత్ మీడియాకు వెల్లడించారు.