SIR - Vishvambhara News

జీడబ్ల్యూఎంసీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
Warangal News: ప్రతి అర్హత కలిగిన ఓటు ప్రజాస్వామ్యానికి బలమని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా కాపాడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను అత్యంత బాధ్యతగా నిర్వహించాలని, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), డివిజన్ ఇన్‌చార్జులు, పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని ఆయన సూచించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థాయి విస్తృత సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, SIR వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జి నాసీర్ అహ్మద్, పార్టీ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్‌చార్జులు, బూత్ ఇన్‌చార్జులు, బీఎల్‌ఏలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గత నెల రోజులుగా ప్రతి డివిజన్, ప్రతి బూత్ పరిధిలో జరిగిన ఓటరు సమగ్ర సవరణ పనుల పురోగతిని ఎమ్మెల్యే సమీక్షించి, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి బీఎల్‌ఏ తప్పనిసరిగా గడపగడపకు వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలవాలని, ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేయించాలని నాయిని రాజేందర్ రెడ్డి సూచించారు.

అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, ఇతర సవరణలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ముఖ్యంగా షిఫ్టెడ్ ఓట్లు, మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ నమోదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎప్పటికప్పుడు SIR ప్రక్రియను పర్యవేక్షిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. ప్రతి అర్హ ఓటును కాపాడేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని, అదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు.

పార్టీలో కష్టపడి పనిచేసే వారికే గుర్తింపు, అవకాశాలు, పదవులు లభిస్తాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సీనియారిటీ పేరుతో పక్కన కూర్చోవడం కంటే ప్రజల మధ్య ఉండి పార్టీ కోసం పనిచేసే వారినే కాంగ్రెస్ గౌరవిస్తుందని అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించాలని సూచించారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అనేక సంక్షేమ పథకాలను అందించిందని నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్‌లో పార్టీని మరింత బలోపేతం చేసి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని సూచించారు. త్వరలోనే డివిజన్ అధ్యక్షుల నియామకాలు చేపడతామని, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే వారికి తగిన గుర్తింపు, బాధ్యతలు తప్పకుండా లభిస్తాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ.వి. శ్రీనివాస్ రావు, డివిజన్ అధ్యక్షులు, ఇన్‌చార్జులు, మాజీ కార్పొరేటర్లు, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.