Voter List Revision - Vishvambhara News

ఏపీలో SIR గడువు పొడిగింపు.. ఓటర్లకు మరో అవకాశం
Andhra Pradesh SIR: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ గడువును పొడిగిస్తూ నిర్ణయించింది. ఇప్పటివరకు కొనసాగుతున్న SIR ప్రక్రియను ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు తెలిపింది. దీంతో ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన ప్రక్రియకు మరింత సమయం లభించనుంది.

SIR ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి అందే క్లెయిమ్స్, అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించేందుకు కూడా ఎస్ఈసీ అదనపు గడువు ఇచ్చింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నా.. లేదా మార్పులు, చేర్పులు అవసరమైనా సంబంధిత ప్రక్రియలో వాటిని తెలియజేసే అవకాశం ఉంటుంది.

SIR ప్రక్రియ, క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిశీలన పూర్తైన అనంతరం అక్టోబర్ 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. గడువు పొడిగింపుతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు మరింత సమయం లభించనుంది. తుది జాబితా విడుదలకు ముందు తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని, అవసరమైన మార్పులు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఓటరు జాబితాలో ఒక్క తప్పు ఉండొద్దు: బీఎల్‌ఏలకు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి దిశానిర్దేశం
: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి బూత్‌లో ఓటరు జాబితా తప్పులు, డూప్లికేట్ పేర్లు, అనర్హుల నమోదు లేకుండా పూర్తి పారదర్శకంగా సవరణ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ఆగస్టు 3వ తేదీ వరకు ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో ఉండి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి ఎన్యూమరేషన్ ఫారాలను అందించాలని ఆదేశించారు. తుక్కుగూడలోని పార్టీ కార్యాలయంలో 17 మంది ఇన్‌చార్జులు, నలుగురు అబ్జర్వర్లు, బీఎల్‌ఏలు, పార్టీ నాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.

టీ‌పీసీసీ అబ్జర్వర్ జగదీష్, ఎస్‌ఐఆర్ నియోజకవర్గ ఇన్‌చార్జి దేప భాస్కర్‌రెడ్డితో కలిసి సమావేశమైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి... ప్రతి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకోవాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు చేయాలని, ప్రజలకు ఎన్యూమరేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి బీఎల్‌ఏ తన పరిధిలోని ఓటర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.

ఈ సందర్భంగా టీ‌పీసీసీ అబ్జర్వర్ జగదీష్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఓటరు జాబితా అత్యంత కీలకమని, అందులో ఎలాంటి తప్పులు, నకిలీ నమోదులు, దొంగ ఓట్లకు తావులేకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఇన్‌చార్జి, అబ్జర్వర్ రోజుకు కనీసం 25 ఇళ్లను సందర్శించి ఓటర్ల సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు.

ముఖ్యమంత్రి సూచనలను సమావేశంలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి వివరించారు. నియోజకవర్గ స్థాయిలో దేప భాస్కర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, పుట్టగళ్ల జగన్, బొక్క జంగారెడ్డిని ఎస్‌ఐఆర్ అబ్జర్వర్లుగా నియమించినట్లు తెలిపారు. వీరితో పాటు 17 మంది డివిజన్ అధ్యక్షులు, 17 మంది అబ్జర్వర్లు, 98 మంది ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జులు, 540 మంది బూత్ స్థాయి బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేసి ప్రతి ఇంటిని చేరుకోవాలని సూచించారు. ఆగస్టు 3 వరకు ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమానికే ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ ప్రక్రియను విజయవంతం చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.