Anantapur Crime - Vishvambhara News

రాయదుర్గంలో భారీ చోరీ.. ఇంటికి తాళం వేయాలంటేనే భయపడుతున్న ప్రజలు
Anantapuram News: తాళం వేసి వెళ్లారా..? తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లే. ఇదే ఇప్పుడు అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రజలను వెంటాడుతున్న భయం. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని మాటువేసి గమనిస్తున్న దొంగలు.. తాళాలు పగులగొట్టి నిమిషాల వ్యవధిలోనే బీరువాలు ఖాళీ చేసి విలువైన వస్తువులు, నగదుతో పరారవుతున్నారు. తాజాగా వెంకటేశ్వర కాలనీలో జరిగిన భారీ చోరీ స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో పెరుగుతున్న చోరీలతో పోలీసుల గస్తీపై కూడా స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

బాధితుడు షేక్ రహంతుల్లా తెలిపిన వివరాల ప్రకారం.. తాను ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నానని, తన భార్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇద్దరూ బంధువుల ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న దొంగలు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాను తెరిచి అందులో ఉన్న సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి వస్తువులు, రూ.1.80 లక్షల నగదును అపహరించినట్లు బాధితుడు వాపోయాడు.

సోమవారం ఇంటికి తిరిగి వచ్చిన బాధితుడు ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండటంతో పాటు నగదు, బంగారం, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలను సేకరించి విచారణ చేపట్టారు.

కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడిన దుండగులను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని బాధితుడు కోరగా, వరుస చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నందున రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన ప్రతిసారీ సురక్షితంగా తిరిగి వస్తామా అనే ఆందోళన ప్రజల్లో నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది.