yuva sangrama sadassu - Vishvambhara News

యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణ ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే చర్య..
విశ్వంభర,హైదరాబాద్ : సరూర్‌నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సు కు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూమీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంబీపూర్  రాజు మాట్లాడుతూ, యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదస్సు కోసం గత నెలలోనే కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించామని తెలిపారు. కలెక్టర్ లేఖ ఆధారంగా స్పోర్ట్స్ అథారిటీకి కూడా సమాచారం వెళ్లిందని, జూలై 8న సీపీకి కూడా అధికారికంగా లేఖ అందజేశామని చెప్పారు. పోలీసులు సూచించిన విధంగా సీసీ కెమెరాల ఏర్పాటు, డీడీల చెల్లింపులు సహా కోరిన ప్రతి నిబంధనను పాటించినప్పటికీ అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తాను చేసిన ఫోన్ కాల్స్‌కు కూడా సీపీ స్పందించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సభకు అనుమతి ఇవ్వవద్దని పోలీసు అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల సభలకు అనుమతులు ఇచ్చామని, ఇప్పుడు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సభకే అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.నిరుద్యోగులకు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువ సంగ్రామ సదస్సు విజయవంతమవుతుందని, యువత పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. అనుమతి నిరాకరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు వెల్లడించారు.ఎల్బీనగర్ ఎమ్మెల్యే *సుధీర్ రెడ్డి* మాట్లాడుతూ, జూన్ 30న సభకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ జూలై 18 సమీపించినా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. పోలీసులు ఆరు రకాల వివరాలు విడతలవారీగా కోరినా అన్నింటినీ సమర్పించామని చెప్పారు. గత రెండు రోజులుగా సీపీ ఫోన్‌కు కూడా స్పందించడం లేదని, ఏసీపీ ద్వారా మాట్లాడించినా అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సభకు అనుమతి ఇవ్వవద్దని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం ఉందని, భారీగా యువత హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందనే కారణంతో సభను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పించి, ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. వయోపరిమితిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి, ప్రశ్నించిన నిరుద్యోగులను అరెస్టు చేయడం, విద్యార్థులపై దమనకాండ కొనసాగించడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయక విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని అన్నారు.అనుమతి ఇవ్వకపోతే సరూర్‌నగర్ స్టేడియం వద్దకే వచ్చి తమ నిరసనను తెలియజేస్తామని హెచ్చరించారు.ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు బాలమల్లు,చిరుమల రాకేష్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహా గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.