#PresidentMurmu #PrachandHelicopter #IndianAirForce #MakeInIndia #AtmanirbharBharat #DroupadiMurmu #DefenceNews #Jaisalmer #IAF #WomenEmpowerment #NationalPride - Vishvambhara News

యుద్ధ హెలికాఫ్టర్ ‘ప్రచండ్’ లో ద్రౌపది ముర్ము విహారం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారత సర్వసైన్యాధ్యక్షురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సరికొత్త చరిత్ర సృష్టించారు. శుక్రవారం రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించిన ఆమె, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ‘ప్రచండ్’లో ఆకాశ విహారం చేశారు. ప్రత్యేకమైన ఫ్లైయింగ్ సూట్ ధరించి, కో-పైలట్ సీటులో కూర్చున్న రాష్ట్రపతి.. సుమారు 25 నిమిషాల పాటు గగనతలంలో ప్రయాణించారు. ప్రయాణ సమయంలో హెలికాప్టర్ సామర్థ్యాన్ని, పనితీరును పైలట్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాక్‌పిట్ నుంచే దేశ ప్రజలను ఉద్దేశించి "ప్రచండ్ దేశ స్వావలంబనకు చిహ్నం.. జై హింద్, జై భారత్" అంటూ గర్వంగా సందేశాన్ని పంపారు.

సరిహద్దుల్లో భారత ‘ప్రచండ్’ శక్తి
ఎల్‌సీహెచ్ ‘ప్రచండ్’ అనేది భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన మైలురాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా స్వదేశీ సాంకేతికతతో తయారైన తొలి యుద్ధ హెలికాప్టర్ ఇదే కావడం విశేషం. అధునాతన ఏవియానిక్స్, శత్రువుల రాడార్లకు చిక్కని స్టెల్త్ ఫీచర్లు దీని సొంతం. కేవలం పగలే కాకుండా, కటిక చీకటిలోనూ దాడులు చేయగల సామర్థ్యం దీనికి ఉంది. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో, శీతల వాతావరణంలోనూ క్షిపణులు, రాకెట్లు, 20 ఎంఎం గన్‌ల ద్వారా శత్రువులను తుదముట్టించే సత్తా ఈ ‘ప్రచండ్’కు ఉంది.

ఆత్మనిర్భర్ భారత్‌కు నిదర్శనం
యుద్ధ విమానాలు, హెలికాప్టర్లలో రాష్ట్రపతులు ప్రయాణించడం ద్వారా సైన్యంలో మనోధైర్యాన్ని నింపే సంప్రదాయం కొనసాగుతోంది. ద్రౌపది ముర్ము ఈ సాహసం చేయడం ద్వారా స్వదేశీ పరిజ్ఞానానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లయింది. ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంలో భాగంగా రక్షణ రంగంలో సాధిస్తున్న విజయాలకు ఈ సంఘటన ఒక ప్రతీకగా నిలిచింది. యుద్ధ రంగంలో మహిళా సాధికారతకు మరియు దేశ భద్రతలో అత్యున్నత పదవిలో ఉన్న వారు చూపిస్తున్న చొరవకు ఈ ప్రయాణం నిదర్శనమని రక్షణ నిపుణులు కొనియాడుతున్నారు.