ministerponguleti - Vishvambhara News

పేదల సొంతింటి కలపై కేంద్రానికి విన్నపం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, రాష్ట్రానికి రావాల్సిన ఇండ్లను మంజూరు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్ లో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. పేదల సంక్షేమాన్ని విస్మరించిన గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో కేంద్రం నుండి ఒక్క ఇల్లు కూడా సాధించలేకపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలకు ఇళ్లు కేటాయించాలని గత రెండు సంవత్సరాలుగా కేంద్రాన్ని పదేపదే కోరుతున్నట్లు వివరించారు.

5 లక్షల ఇళ్లపై దృష్టి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రాష్ట్రం అధికారికంగా పీఎంఏవై-జి పథకంలో చేరిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత 12 ఏళ్లలో పెరిగిన డిమాండ్ దృష్ట్యా ఈ ఏడాది 3 లక్షల ఇళ్లు, వచ్చే ఏడాది మరో 2 లక్షల ఇళ్లను ప్రత్యేకంగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇప్పటికే ఇంటింటికీ విస్తృత సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, దీనికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అర్హుల గుర్తింపు పూర్తి
కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆవాస్+2024 మొబైల్ యాప్ ద్వారా మరోసారి సర్వే నిర్వహించి మొత్తం 11.57 లక్షల అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించినట్లు పొంగులేటి కేంద్ర మంత్రికి వివరించారు. డేటాబేస్ పక్కాగా ఉందని, ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్రం తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, గ్రామీణ గృహ నిర్మాణ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

ధరణి వెనుక భారీ కుట్ర: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని భూముల రక్షణ కోసం నిర్మించాల్సిన ధరణి పోర్టల్‌ను గత ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డదారిలో వాడుకున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి కమిటీతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ధరణిలోని లోపాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణిలో జరిగినవి కేవలం సాంకేతిక లోపాలు కావని, కావాలని వ్యవస్థాగతంగా సృష్టించిన లోపాలని ఆయన స్పష్టం చేశారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కొల్లగొట్టారని, దీనిపై లోతైన విచారణ సాగుతోందని తెలిపారు.

టెర్రాసిస్ బాధ్యతారాహిత్యం.. మాయమైన లాగిన్ వివరాలు
ధరణి పోర్టల్ నిర్వహణను 'టెర్రాసిస్' అనే విదేశీ సంస్థకు అప్పగించడం వల్లే ప్రధాన సమస్యలు తలెత్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తించారు. సెక్యూరిటీ ఆడిట్ సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దకుండానే అన్నీ సవ్యంగా ఉన్నట్లు గతంలో తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన లాగిన్ వివరాలు మాయమవ్వడం, అనుమానాస్పద లావాదేవీల సమాచారం దొరక్కుండా లాగిన్లనే డిలీట్ చేయడం వంటి అంశాలు విచారణలో బహిర్గతమయ్యాయి. ఫోరెన్సిక్ ఆడిట్‌లో 'కోడ్ ఆడిట్' నిర్వహించలేదన్న విషయం వెలుగులోకి రావడంతో, తక్షణమే పూర్తిస్థాయి కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

భూభారతితో కొత్త శకం.. అక్రమార్కులకు హెచ్చరిక
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ధరణి ముసుగులో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికితీస్తామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసాను వసూలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అధికారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఉండేలా ‘భూభారతి’ పోర్టల్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల తరహాలోనే మిగిలిన అన్ని జిల్లాల్లోనూ త్వరలోనే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల భూములకు పూర్తి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు.