bandisanjay - Vishvambhara News

హామీలు గాలికి.. వసూళ్లే లక్ష్యం..రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ ధ్వజం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేవలం తన కుర్చీని కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల అభివృద్ధిపై లేదని విమర్శించారు. ఢిల్లీలోని పెద్దలకు వేల కోట్ల రూపాయలు పంపడంపైనే మంత్రివర్గ సమావేశాల్లో చర్చలు జరుగుతున్నాయని, సామాన్యుల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు నెలకు రూ.2500లు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

నిరుద్యోగులు, విద్యార్థులపై నిర్లక్ష్యం
నిరుద్యోగులకు భృతి, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డులు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ నిలదీశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల వేలాది విద్యా సంస్థలు, లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు పేదలకు వైద్యం అందించడం లేదని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు.

ఆరు గ్యారంటీలే లక్ష్యంగా పోరాటం
కాంగ్రెస్ ప్రకటించిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో, వాటికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారో కేబినెట్ సమావేశంలో చర్చించి స్పష్టమైన తేదీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

భాగ్యలక్ష్మి ఆలయానికి బీజేపీ ప్రజాప్రతినిధులు
మంగళవారం పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ సందర్శనకు బీజేపీ సిద్ధమైంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి బండి సంజయ్, రామచందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం బీజేపీ కార్యాలయం నుంచి బయలుదేరి భాగ్యలక్ష్మి ఆలయం, అనంతరం లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచే యుద్ధం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ విజయాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి అంకితం ఇస్తున్నానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో బీజేపీకి కేవలం 13 సీట్లే వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ వర్గాలు తప్పుడు నివేదిక ఇచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం ఇకనైనా కళ్లు తెరవాలని హితవు పలికారు.

కరీంనగర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటై చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదేనని స్పష్టం చేశారు. మేయర్ పీఠం దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచే యుద్ధం మొదలుపెడతానని హెచ్చరించారు. బీజేపీ సింహం లాంటిదని, సింగిల్ గానే పోటీ చేసి గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. ఈ మూడు పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నానని సెటైర్లు వేశారు. కరీంనగర్‌లో మేయర్ పీఠం కోసం గుంట నక్కలన్నీ ఒక్కటయ్యాయని ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల బండారం కరీంనగర్ వేదికగా బయటపడుతోందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.

కరీంనగర్ కోటపై కాషాయ జెండా.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ కార్పొరేషన్ వేదికగా బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేసి బీజేపీ రికార్డు సృష్టించింది. ఈ విజయంతో కరీంనగర్ నగరం కాషాయమయమైంది. ఫలితాల అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ మాట్లాడారు. ఈ విజయం అవినీతి రహిత పాలనకు, నరేంద్ర మోదీపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా.. ఓటుకు రూ.7 వేలు పంచినా ప్రజలు ధర్మం వైపే నిలబడ్డారని బండి సంజయ్ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగురవేస్తాం
కరీంనగర్ తీర్పు స్పూర్తితో రాబోయే రోజుల్లో హైదరాబాద్‌పై కూడా కాషాయ జెండా ఎగురవేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఒవైసీ బ్రదర్స్ కళ్లలో ఆనందం చూడటానికే రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసి, ఒక ముక్కను మజ్లిస్‌కు రాసిచ్చారని విమర్శించారు. ఈ విభజనే రేవంత్ రెడ్డి పాలిట రాజకీయ మరణశాసనం కాబోతోందని, హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లను కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో సంసారం చేస్తూ బీఆర్ఎస్‌కు కన్ను కొడుతున్న ఎంఐఎంకు ప్రజలు చెంపచెళ్లుమనిపించే తీర్పు ఇచ్చారని, ఆ పార్టీ కార్యాలయం ఉన్న డివిజన్‌లోనే బీజేపీ జెండా పాతామని గుర్తు చేశారు.

రూ.1,500 కోట్లతో అభివృద్ధి
కరీంనగర్ అభివృద్ధి విషయంలో విపక్షాలు చేసిన విమర్శలను బండి సంజయ్ తిప్పికొట్టారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే నగరాభివృద్ధి కోసం రూ.1,500 కోట్లు కేటాయించిందని, కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్క నయాపైసా కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. తాను సామాన్య కార్యకర్తను.. ఎమ్మెల్యేగా ఓడినా, కార్పొరేటర్‌గా, ఎంపీగా తనను గెలిపించి ఈ స్థాయికి తెచ్చిన కరీంనగర్ ప్రజలకు శిరస్సు వంచి వందనం చేస్తున్నానని అన్నారు. ఐదేళ్లలో కరీంనగర్ అభివృద్ధిని చేతల్లో చూపిస్తామని స్పష్టం చేశారు.

అవినీతికి తావులేకుండా కార్పొరేషన్ ప్రక్షాళన చేస్తానని, పాలనను నేరుగా ప్రజల వద్దకే తీసుకువెళ్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. గెలిచిన 33 మంది బీజేపీ అభ్యర్థులతో పాటు, మద్దతు తెలుపుతున్న స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని కలుపుకుని నగరాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ అద్భుత విజయాన్ని తాను నమ్ముకున్న మహాశక్తి అమ్మవారికి అంకితం ఇస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు.