transport - Vishvambhara News

రోడ్డు ప్రమాదాల నివారణకు కొత్త బాట
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాత్రి సమయాల్లో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, రవాణా శాఖ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈనెల 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రవాణా వాహనాలకు క్యూఆర్ కోడ్ ఆధారిత రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధన పాటించని వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేయబోమని అధికారులు స్పష్టం చేశారు.

నకిలీలకు చెక్.. QR కోడ్ విధానం
ఇప్పటి వరకు వాహనాలకు వాడుతున్న సాధారణ రిఫ్లెక్టివ్ టేపుల్లో నాణ్యత లోపం, నకిలీ టేపుల వాడకం వల్ల ఆశించిన ఫలితాలు రాలేదు. దీనిని గుర్తించిన ప్రభుత్వం, 1989 కేంద్ర మోటారు వాహనాల నిబంధనల ప్రకారం, కొత్తగా QR ఆధారిత మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS)ను ప్రవేశపెట్టింది. ఈ టేపులపై తెలంగాణ రవాణా శాఖ లోగో, హోలోగ్రామ్ ఉంటాయి. ప్రతి టేపుపై ఉండే ప్రత్యేక సీరియల్ నంబర్‌తో కూడిన QR కోడ్‌ను అధికారులు స్కాన్ చేసి, అది అసలైనదా కాదా అని వెంటనే గుర్తించగలరు.

అనుమతి పొందిన సంస్థలు
కేవలం ఐదు ప్రముఖ కంపెనీలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎం ఇండియా లిమిటెడ్, ఒరఫఫోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అవెరి డెన్నిసన్ ఇండియా, గ్లోడియన్ రిఫ్లెక్టివ్, డోమింగ్ రిఫ్లెక్టివ్ మెటీరియల్స్ సంస్థలు వాటి అధీకృత డీలర్ల వద్ద మాత్రమే వాహనదారులు తమ వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు వేయించుకోవాల్సి ఉంటుంది. వాహన యజమానుల నుంచి అదనపు వసూళ్లు జరగకుండా ప్రభుత్వం ధరలను ఖరారు చేసింది.

ఇందులో అఫిక్సేషన్, సర్టిఫికేట్ ఛార్జీలు కూడా కలిసి ఉంటాయి. CT 20MM మీటరుకు రూ.79.80 నుంచి రూ.85, CT 50MM మీటరుకు రూ.145 నుంచి రూ.51.80, C3/C4 ప్లేట్లు జతకు రూ.2,500 నుంచి రూ.2,900 వరకు, రిఫ్లెక్టర్లకు (40MM/80MM)కు రూ.35 నుంచి రూ.60 వరకు చార్జ్ చేస్తారు. అయితే, వాహనాలకు టేపులు అమర్చిన తర్వాత డీలర్లు కనీసం రెండేళ్ల వారంటీతో కూడిన అఫిక్సేషన్ సర్టిఫికేట్ ఇస్తారు.

తనిఖీలు -చర్యలు
రోడ్డుపై తనిఖీల సమయంలో రవాణా అధికారులు QR కోడ్‌ను స్కాన్ చేసి ధృవీకరిస్తారు. నకిలీవని తేలితే సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. కంపెనీ ఫిట్టెడ్ టేపులు ఉన్న కొత్త వాహనాలకు ఈ వెరిఫికేషన్ అవసరం లేదు. గడువులోపు వాహన యజమానులు రిఫ్లెక్టివ్ టేపులను అమర్చుకోవాలని రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది.