GPO - Vishvambhara News

తెలంగాణలో గ్రామ పరిపాలన బలోపేతం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: గ్రామ స్థాయిలో పరిపాలనను మరింత పటిష్టం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖలో గ్రామ పాలన అధికారి (GPO) వ్యవస్థను పునరుద్ధరిస్తూ, వీరికి సంబంధించిన సేవా నిబంధనలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 'తెలంగాణ గ్రామ పాలన అధికారి సబార్డినేట్ సర్వీస్ రూల్స్-2025' పేరుతో ఈ నిబంధనలను ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ భర్తీ ప్రక్రియ రెండు విధాలుగా జరగనుంది. గతంలో పనిచేసిన గ్రామ రెవెన్యూ అధికారులు (VROs), జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్లలో క్రమబద్ధీకరించబడిన గ్రామ రెవెన్యూ సహాయకులను (VRAs) ఈ పోస్టుల్లోకి తీసుకోనున్నారు. మిగిలిన ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు.

అర్హతలు, వయోపరిమితి
జీపీవో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నిర్దిష్ట అర్హతలు నిర్ణయించారు. నేరుగా నియామకమయ్యే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బదిలీ ద్వారా డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ అర్హతతో పాటు కనీసం ఐదేళ్ల సర్వీసు కలిగి ఉండాలి.  అభ్యర్థుల వయస్సు 18 నుండి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వం ఐదేళ్ల వయోసడలింపు కల్పించింది.

శిక్షణ - బాండ్ నిబంధన
ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. నేరుగా నియమితులైన వారు విధుల్లో చేరిన రెండేళ్ల లోపు పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ GPO, విలేజ్ మాన్యువల్ ఆఫ్ అకౌంట్స్, సర్వే ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. శిక్షణ పూర్తయిన తర్వాత కనీసం మూడేళ్ల పాటు ప్రభుత్వానికి సేవలు అందిస్తామని బాండ్ సమర్పించాలి.

పదోన్నతులు -పర్యవేక్షణ
జీపీవోలుగా పనిచేస్తున్న వారికి భవిష్యత్తులో సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. 60:40 నిష్పత్తిలో పదోన్నతులు కల్పిస్తారు. జిల్లా కలెక్టర్ ఈ పోస్టులకు నియామక, క్రమశిక్షణా అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లాను ఒక యూనిట్‌గా పరిగణించి నియామకాలు, బదిలీలు చేపడతారు. ఈ నిబంధనల అమలును భూపరిపాలన ప్రధాన కమిషనర్ పర్యవేక్షిస్తారు.