newparty - Vishvambhara News

మే మొదటి వారంలో కవిత నూతన రాజకీయ పార్టీ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. త్వరలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎట్టకేలకు కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన కవిత ఇష్టాగోష్టిలో కీలక వివరాలు వెల్లడించారు. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు. సుమారు 19 ఏళ్లుగా సామాజిక, సాంస్కృతిక సేవలో ఉన్న తెలంగాణ జాగృతి, ఇకపై రాజకీయ క్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని ఆమె హామీ ఇచ్చారు.

'తెలంగాణ' పేరుతోనే ఇంటి పార్టీ
పార్టీ పేరుపై వస్తున్న ఊహాగానాలపై కవిత స్పందిస్తూ.. తాను స్థాపించబోయే పార్టీ పేరులో ఖచ్చితంగా తెలంగాణ అనే పదం ఉంటుందని కవిత ధృవీకరించారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పార్టీల్లో తెలంగాణ అనే పదం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ లేకుండా పోయిందని అన్నారు. అందుకే తెలంగాణ పేరును తన పార్టీలో పెట్టాలనుకుంటున్నానని తెలిపారు. బీఆర్ఎస్ విధానాలతో విభేదించి బయటకు వచ్చిన తాను, ప్రజల ఆత్మగౌరవం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవిత తెలిపారు. శాసనమండలిలో రాజీనామా ఆమోదం పొందే ముందు ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని, ఒక రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, అందుకే కొత్త ప్రత్యామ్నాయం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

సిద్దిపేట నుంచే కవిత పోటీ?
తమ పార్టీ రాబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతుందని, తాను కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని కవిత స్పష్టం చేశారు. అభ్యర్థిగా ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతూనే, తన ప్రాధాన్యతలను వెల్లడించారు. పోటీకి సంబంధించి మొదటి చాయిస్‌గా సిద్దిపేటను, రెండో చాయిస్‌గా బోధన్‌ను ఎంచుకుంటానని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ అంతటా పర్యటించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు ఇప్పటికే జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. కేవలం ఒక కుటుంబం లేదా ఒక వ్యక్తి కనుసన్నల్లో కాకుండా, స్వతంత్రంగా ప్రజల కోసం పనిచేసే రాజకీయ వ్యవస్థను నిర్మిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఏప్రిల్ లేదా మే నాటికి పార్టీ విధివిధానాలు, జెండా, ఎజెండాను పూర్తిస్థాయిలో వెల్లడించనున్నారు.

ఉచిత బస్సు పథకంపై కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కవిత డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి ఉందని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను కర్ణాటకలోని దావణగెరెకు తరలించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో స్వయంగా మహిళలే అసలు ఉచిత బస్సు పథకం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సుల కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కవిత డిమాండ్ చేశారు.

ఈ నెల 24న చలో సెక్రటేరియట్‌కు మద్దతు
బీఆర్ఎస్ హయాంలో కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేస్తే యూనియన్లను రద్దు చేసిన అంశాన్ని గుర్తు చేశారు. కానీ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే యూనియన్లను తిరిగి ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ మాటను నిలబెట్టుకోలేకపోవడం శోచనీయమన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం ఈ నెల 24న తలపెట్టిన చలో సెక్రటేరియట్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని కవిత వెల్లడించారు.

త్వరలో కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటన
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకోనున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచారు. బాగ్ లింగంపల్లిలో నిర్వహించిన 'ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ'లో పాల్గొన్న ఆమె, గత పదేళ్ల పాలనతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు
ఉద్యమకారుల విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై కవిత విమర్శలు గుప్పించారు. పదేళ్ల కాలంలో ఉద్యమకారులకు అన్ని చేదు జ్ఞాపకాలే మిగిలాయని, వారికి సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమవాళ్లే గాయం చేస్తే ఆ నొప్పి ఎక్కువగా ఉంటుందని.. ఉద్యమకారులు బయట ఉండి బాధపడితే, తాను బీఆర్ఎస్‌లో ఉండి బాధపడ్డానని పేర్కొన్నారు. అహంకారం, సహనశీలత లేకపోవడం వల్లే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందని విశ్లేషించారు. మంచితనం, భోళాతనం తెలంగాణ తత్వమని, అవి కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్లేనని స్పష్టం చేశారు.

త్వరలో రాజకీయ పార్టీ.. అస్తిత్వమే ఊపిరి
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు కవిత వెల్లడించారు. ఇది కేవలం ఎన్నికల కోసం పెట్టే ఫక్తు రాజకీయ పార్టీ కాదని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే వేదిక అని వివరించారు. 1995 వరంగల్ డిక్లరేషన్‌తో మొదలైన మలిదశ ఉద్యమంలో మారోజు వీరన్న, గద్దర్ వంటి విప్లవకారుల పాత్రను గుర్తుచేస్తూ, వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

ప్రొఫెసర్ కోదండరామ్‌కు హెచ్చరిక
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యమ సోయి లేదని కవిత విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే రాబోయే బడ్జెట్ తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే తాను రేవంత్ రెడ్డిని కాదని, ప్రొఫెసర్ కోదండరామ్, ఆకునూరి మురళిని హెచ్చరిస్తున్నానని పేర్కొన్నారు. వీరిద్దరూ రేవంత్ రెడ్డితో కలవబట్టే కాంగ్రెస్‌ను నమ్మామని.. కానీ రెండేళ్లుగా వారు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు రేవంత్ రెడ్డిని భవనం నుంచి బయటకు లాగుతారని వ్యాఖ్యానించారు.

20 శాతం రిజర్వేషన్ డిమాండ్
తెలంగాణ బిడ్డలకు ప్రైవేట్ ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక వృద్ధి, రాజకీయ అవకాశాలు కల్పించడంలో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ పై, కేబీఆర్ పార్క్ వద్ద జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకోలేకపోవడం బాధాకరమని, నాడు మున్సిపల్ మంత్రిని కోరినా ఫలితం లేకపోయిందని గుర్తుచేశారు. తెలంగాణ గడ్డ నిత్యం పోరాటాల గడ్డ అని, ఉద్యమకారుల కోసం మరో పోరాటం తప్పదని పిలుపునిచ్చారు.

మూడు నెలల్లో కవిత 'కొత్త పార్టీ'
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే మూడు నెలల్లో పార్టీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సిద్ధమవుతున్నామని, ఇందుకోసం మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నామని స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్.. 'పెద్ద చేప' ఎవరు?
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై కవిత ఘాటుగా స్పందించారు. "ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశించిన అసలు 'పెద్ద చేప'ను వదిలేసి, ప్రణీత్ రావు వంటి చిన్న చేపలను పట్టుకోవడం ఏంటి?" అని సిట్ దర్యాప్తును ప్రశ్నించారు. ఈ కేసును ప్రభుత్వం టీవీ సీరియల్‌లా సాగదీస్తోందని, నిందితులను కేవలం డిమోట్ చేసి వదిలేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ వైఫల్యంపై నిప్పులు
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని కవిత ఆరోపించారు. ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పారు. 2025-26 బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి కేటాయింపులు పెరిగినా, ఆశించిన స్థాయిలో రూ.20 వేల కోట్ల లక్ష్యాన్ని చేరుకోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని, జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు.

కేసీఆర్ చరిత్ర.. రేవంత్ రెడ్డికి సవాల్
తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పాత్ర అజరామరమని, ఆయనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని కవిత వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ విమర్శలు హద్దులు దాటుతున్నాయని, ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదని మండిపడ్డారు. ప్రజలు ప్రశ్నించే గొంతుకలైన స్వతంత్రులకు, సీపీఎం వంటి పార్టీలకు మద్దతు ఇవ్వాలని ఆమె సూచించారు.

12న 'ఆత్మగౌరవ సభ'
తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల కోసం ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో 'తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ' నిర్వహిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఈ సభ ద్వారా తెలంగాణ వాదులందరినీ ఏకం చేసి, భవిష్యత్తు కార్యచరణను ప్రకటించనున్నారు.