sangareddy - Vishvambhara News

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
విశ్వంభర,సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించడంతో పాటు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సత్వర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఈఎస్ఐ వైద్య సేవలను విస్తరిస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డిస్పెన్సరీని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్‌, జగ్గారెడ్డి లతో కలిసి  మంత్రులు ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా అన్ని మౌలిక వసతులు, వైద్య సదుపాయాలను కల్పిస్తూ ఈఎస్ఐ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే కార్మికులు వైద్య చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అన్ని రకాల వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.రాష్ట్రంలో సుమారు 80 లక్షల కుటుంబాలు ఈఎస్ఐ వైద్య సేవలపై ఆధారపడుతున్నాయని, ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.ఇటీవల ఆర్‌సీ పురం ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా కొన్ని ప్రత్యేక వైద్య సేవలు లేకపోవడంతో రోగులు సనత్‌నగర్‌కు వెళ్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. వచ్చే ఆరు నెలల్లో అక్కడ అన్ని ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, కార్మికులు స్థానికంగానే పూర్తి స్థాయి చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.త్వరలో ఆర్‌సీ పురం ఈఎస్ఐ ఆసుపత్రిలో 20 పడకల డయాలసిస్ యూనిట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే ఏడాదిలో కార్డియాలజి సెంటర్‌ను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. శంషాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక భారం మోసుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ కార్మికులు ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటికే ఏడు ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉండగా, సంగారెడ్డిలో ఎనిమిదో డిస్పెన్సరీని ప్రారంభించడం సంతోషకరమన్నారు.రూ.200 కోట్లతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జహీరాబాద్, నారాయణఖేడ్, సదాశివపేట, ఆందోల్, జోగిపేట ప్రాంతాల ప్రజలకు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఈఎన్‌టీ, క్యాన్సర్ చికిత్స, ట్రామా కేర్, నేత్ర వైద్య సేవలు వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పీజీ సీట్లను కూడా కేటాయించినట్లు వెల్లడించారు.రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని 104 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచుతూ వైద్య సేవలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అన్ని రకాల ఆధునిక వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లాలో కార్మికుల వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ మాట్లాడుతూ, సంగారెడ్డి రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక జిల్లాగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వేలాది మంది కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మరింత వైద్య మౌలిక వసతులను కల్పించాలని కోరారు. ఈఎస్ఐ వైద్య సేవల విస్తరణ కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని నిర్మలా జగ్గారెడ్డి అడిగిన వెంటనే మంజూరు చేసిన మంత్రి వివేక్ వెంకట స్వామి కి, సహకరించిన మంత్రి దామోదర రాజనర్సింహ కు జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ డిస్పెన్సరి అందుబాటులో కి రావడం తో సంగారెడ్డి ప్రాంత కార్మికులకు లాభం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. గౌతమ్ ,  సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌లు వనిత సంతోష్, అంజమ్మ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్,, వైద్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
విశ్వంభర,సంగారెడ్డి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి జగ్గారెడ్డి వినతి మేరకు సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ను అభివృద్ధి చేసేందుకు అరబిందో ఫార్మా మరోసారి ముందుకు వచ్చింది. గతం లో ఆరు కోట్ల తో 1000 మంది విద్యార్థులకు సరిపడా జి ప్లస్ వన్ భవనాన్ని అరబిందో ఫార్మా నిర్మించింది.  సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవలం సంగారెడ్డి నియోజకవర్గ విద్యార్థులే కాకుండా నారాయణ్ ఖెడ్, వికారాబాద్,  బాన్స్ వాడ, పరిగి, జహీరాబాద్ ల నుండి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. ఇంకా డిమాండ్ ఉన్నప్పటికీ   పూర్తి స్థాయి లో సౌకర్యాలు లేకపోవడంతో అడ్మిషన్ లు ఇవ్వలేకపొతున్నారు. ఇదే విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన జగ్గారెడ్డి వెంటనే అరబిందో చైర్మెన్ నిత్యానంద రెడ్డి ని సంప్రదించారు. అవసరమైన సిఎస్సార్ నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. జగ్గారెడ్డి వినతి మేరకు అదనపు తరగతి గదుల తో పాటు ఆడిటోరియం ఏర్పాటు చేసేందుకు అరబిందో ఫార్మా ముందుకు వచ్చింది.

అందులో భాగంగా  జగ్గారెడ్డి, నిర్మల తో కలిసి అరబిందో డైరెక్టర్ సదానంద రెడ్డి  బాలికల జూనియర్ కళాశాల ను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్  సునీత తో సమావేశమయ్యారు. కళాశాల ఆవరణ లో ఉన్న ఖాళీ స్థలం లో మూడు అంతస్తుల్లో అదనపు తరగతి గదులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని, త్వరలో బిల్డింగ్ ప్లాన్, కావాల్సిన అనుమతులు తీసుకుంటామని అరబిందో ప్రతినిధులు వివరించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ 17 తరగతి గదులు అందుబాటులోకి వస్తే మరో వెయ్యి మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వగలమని    కళాశాల ప్రిన్సిపాల్ సునీత సంతోషం వ్యక్తం చేశారు. కళాశాల అభివృద్ధికి తోడ్పడుతున్న జగ్గారెడ్డి, నిర్మల కు, అరబిందో యాజమాన్యానికి ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు, సంతోష్, కిరణ్ గౌడ్, కౌన్సిలర్ లు మహేష్, శ్రీకాంత్ గౌడ్ లు పాల్గొన్నారు.

సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్‌ విందు
విశ్వంభర,సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణంలోని మిలాద్‌ గ్రౌండ్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భారీ స్థాయిలో ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. పెద్దసంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి మీకు, మాకు ఫేవరెట్‌ లీడర్‌ అని ప్రశంసించారు. మంత్రి ఉత్తమ్‌ ప్రసంగిస్తూ.. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే జగ్గారెడ్డి ఆదుకుంటారని, ఆయన మానవత్వం ఉన్న మనిషి అని కొనియాడారు. అనంతరం మంత్రులు ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి, కొడుకు దత్తురెడ్డి పాల్గొన్నారు

నేనో.. పోలీసులో తేలిపోవాలి
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి, పోలీసుల మధ్య హైడ్రామా చోటు చేసుకుంది. 34వ వార్డులో మొదలైన చిన్న వివాదం, మాజీ ఎమ్మెల్యే ఎంట్రీతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

ఘర్షణకు బీజం పడిందిలా
34వ వార్డు పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సీఐ శివకుమార్‌ కు, అభ్యర్థికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటి, అభ్యర్థి ఏకంగా సీఐ కాలర్ పట్టుకోవడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పోలీసులు అభ్యర్థిని పక్కకు నెట్టివేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

రంగంలోకి జగ్గారెడ్డి.. బూత్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం!
తమ అభ్యర్థిపై పోలీసులు చేయి చేసుకున్నారని వార్త తెలియగానే జగ్గారెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ స్పాట్‌కు చేరుకున్నారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి, పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. "రిగ్గింగ్‌ను అడ్డుకోలేరు గానీ, మా వాళ్లపై ప్రతాపం చూపిస్తారా?" అంటూ పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. పోలింగ్ ఆపేస్తా.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఆయన చేసిన హెచ్చరికలతో అక్కడ వాతావరణం మరింత వేడెక్కింది.

నేనో.. పోలీసులో తేలిపోవాలి: జగ్గారెడ్డి
పోలీసులను ఉద్దేశించి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. “రిగ్గింగ్ చేస్తున్నారని మా అభ్యర్థి చెబితే, సీఐ శివకుమార్ గల్లా పట్టుకుంటాడా? ఆ సీఐ నా ముందుకు రావాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే దానికి కారణం సీఐ, ఈ హోంగార్డులే. నేనో.. పోలీసులో ఈరోజు తేలిపోవాలి!" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జగ్గారెడ్డి పోలీసులకు వేళ్లను చూపిస్తూ, గట్టిగా కేకలు వేస్తూ హెచ్చరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఆయనను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ, "న్యాయం జరిగే వరకు కదిలేది లేదు" అంటూ జగ్గారెడ్డి భీష్మించారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘటన నేపథ్యంలో సంగారెడ్డిలో మున్సిపల్ పోలింగ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగింది. పోలీసులపై దాడికి ప్రయత్నించిన అభ్యర్థిపై, విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సోడా తాగి..రూ.లక్ష సాయం చేసిన జగ్గారెడ్డి
విశ్వంభర, సదాశివపేట:-టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం సదాశివపేట పట్టణంలో పర్యటించారు.ఆయన కారు దిగి వెళ్తుండగా నిమ్మ సోడా అమ్మే బండి కనిపించింది. ఆయన అక్కడ ఆగారు. నిమ్మకాయ సోడా తాగుతూ ఆ బండిని నడుపుతున్న మహిళతో ముచ్చటించారు.*“ఏమ్మా ఎట్లా ఉంది వ్యాపారం.. మంచిగా జరుగుతోందా” అని అడిగారు. “ కొత్త మెషిన్ కొనుక్కుంటే సోడాల గిరాకీ ఎక్కువవుతుంది. ఇప్పుడు చేస్తున్న వ్యాపారంలో ఏమీ మిగలడం లేదు. మీరు ఏదైనా సాయం చేస్తే బండి మంచిగా నడుపుకుంటాం” అంటూ ఆ మహిళ చెప్పింది. “ఎన్ని డబ్బులు ఇస్తే సోడా మిషన్ వస్తుంది? మీరు మంచిగా బతకగలుగుతారు? “ అని జగ్గారెడ్డి అడిగారు.**“లక్ష రూపాయలు పెడితే కొత్త మిషన్ వస్తుంది. ఈ ఎండాకాలంలో రోజుకు మూడు వేల రూపాయల దాకా వ్యాపారం అవుతుంది. మీరు సాయం చేస్తే మంచిగా బతుకుతం” అంటూ ఆ మహిళ బదులిచ్చింది.

వెంటనే జేబులోంచి లక్ష రూపాయలు తీసిన జగ్గారెడ్డి.. “ ఇదిగో ఈ లక్ష రూపాయలు తీసుకో..  ఎండాకాలం వచ్చేలోగా సోడాల మిషన్ కొనుక్కో. రోజుకు మూడు వేలు సంపాదించు” అంటూ ఆమెకు లక్ష రూపాయలు అందించారు.** అప్పటికప్పుడే లక్ష రూపాయలు ఇస్తాడని ఊహించని ఆ మహిళ.. “అయ్యో సార్.. ఇప్పుడే ఇచ్చేస్తున్నారా” అంటూ సంతోషపడ్డది. జగ్గారెడ్డికి నమస్కరించింది.* *ఈ లక్ష రూపాయలతో మీరు బాగుపడాలి మంచిగా వ్యాపారం జరగాలి అంటూ చెప్పి జగ్గారెడ్డి అక్కడి నుంచి ముందుకు వెళ్లారు.* *“దేవుడు ఆదేశించాడు.. నేను ఇట్లా నడుచుకుంటూ వచ్చాను. సోడా అమ్మే నీకు లక్ష సాయం జరగాలని రాసి పెట్టి ఉంది. అందరికీ సాయం చేసే పుట్టుకను నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు” అనే మాటలు ఈ సందర్బంగా జగ్గారెడ్డి నోటి నుంచి వచ్చాయి.*