postpone - Vishvambhara News

రామ్ చరణ్ 'పెద్ది' వాయిదా
విశ్వంభర, సినిమా బ్యూరో: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీ మారింది. తొలుత మార్చి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం, సాంకేతిక కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఈ మేరకు చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించింది. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ఖరారైన కొద్దిసేపటికే ‘పెద్ది’ టీమ్ ఈ ప్రకటన చేయడం విశేషం. మార్చి 26న పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ఏప్రిల్ 30న రామ్ చరణ్ ‘పెద్ది’ థియేటర్లలోకి రానుంది. కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే మెగా హీరోల సినిమాలు వస్తుండటంతో సోషల్ మీడియాలో అభిమానుల కోలాహలం నెలకొంది.

క్రీడా నేపథ్యంలో భారీ తారాగణం

గ్రామీణ నేపథ్యంతో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతున్న షాట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. మార్చి నుంచి మే వరకు మెగా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.