danam nagender - Vishvambhara News

దానం నాగేందర్ సంచలన వివరణ.. నేను ఇంకా బీఆర్ఎస్ సభ్యుడినే
Danam Nagender: తాను ఏ రాజకీయ పార్టీలోనూ లేనని, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు వివరించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో స్పీకర్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా దానం నాగేందర్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఎక్కడా ప్రకటించలేదని, బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నారని కోర్టుకు తెలిపారు.

ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మరో రాజకీయ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయకూడదని ఎక్కడా నిబంధన లేదని దానం నాగేందర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దానం నాగేందర్ విషయంలో న్యాయ నిబంధనల ప్రకారమే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని వాదించారు. స్పీకర్ నిర్ణయంలో తప్పు ఉన్నట్లు స్పష్టంగా కనిపించినప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోవాలని, ప్రస్తుత కేసులో స్పీకర్ తీర్పులో తప్పు లేదని, అందువల్ల కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు.

ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించిన అనర్హత పిటిషన్‌పై హైకోర్టు విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్నది. దానం నాగేందర్ రాజకీయ పార్టీ మార్పు, ఆయన సభ్యత్వం, ఎన్నికల్లో పోటీ చేసిన అంశాలపై కోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ కేసులో తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. దీంతో తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

దానం భవితవ్యంపై ఉత్కంఠ!
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా వేడి పుట్టిస్తున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో విచారించారు.  బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనాసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ విచారణకు స్వీకరించారు. విచారణకు పిటిషనర్ పాడి కౌశిక్ రెడ్డి తన న్యాయవాదులతో కలిసి రాగా, దానం నాగేందర్ కూడా తన న్యాయబృందంతో హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉన్నందున విచారణను వాయిదా వేయాలని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరడంతో, స్పీకర్ తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు.

సుప్రీంకోర్టు డెడ్ లైన్.. స్పీకర్ వేగం
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు విధించిన గడువు రేపటితో ముగియనుండటంతో స్పీకర్ విచారణను వేగవంతం చేశారు. గతంలో కూడా పలువురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించిన నేపథ్యంలో, ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో ఏ అడుగు వేస్తారనేది మిగిలిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఒక సంకేతంగా మారనుంది. ఒకవేళ దానంపై అనర్హత వేటు పడితే, అది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం. అటు బీఆర్ఎస్ తమ నైతిక విజయం కోసం పోరాడుతుండగా, ఇటు అధికార కాంగ్రెస్ న్యాయపరమైన రక్షణ కోసం ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 18న జరిగే విచారణలో దానం నాగేందర్ సభ్యత్వంపై తుది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.