nampally - Vishvambhara News

నాంపల్లి తాజ్ ఐలాండ్ జంక్షన్ వద్ద యువకుడి హల్‌చల్
Hyderabad Traffic Police: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి తాజ్ ఐలాండ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులను దూషించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించాడనే ఆరోపణలపై మహ్మద్ రిజ్వాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మహ్మద్ రిజ్వాన్ హెల్మెట్ లేకుండా బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన విషయాన్ని గుర్తించిన పోలీసులు అతడి వాహనాన్ని ఫొటో తీశారు. అనంతరం బైక్‌ను ఆపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించారు.

ఈ సమయంలో రిజ్వాన్ ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా విధుల్లో ఉన్న సిబ్బందిని దూషిస్తూ, వారి విధులకు ఆటంకం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, అతడు నడుపుతున్న బైక్‌ను సీజ్ చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మహ్మద్ రిజ్వాన్‌ను అరెస్ట్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం మాత్రమే కాకుండా విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి సీబీఐ కోర్టుకు వరుస బాంబు బెదిరింపులు రావడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా అపరిచిత వ్యక్తుల నుంచి వస్తున్న మెయిల్స్‌తో న్యాయస్థాన ప్రాంగణంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. తాజాగా ఇవాళ మరోసారి సీబీఐ కోర్టులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టుకు చేరుకుని అణువణువూ గాలించాయి. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టులోని సిబ్బందిని, న్యాయవాదులను, కక్షిదారులను వెంటనే బయటకు పంపించి ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

అప్రమత్తమైన భద్రతా బలగాలు
రెండ్రోజుల క్రితం కూడా ఇదే తరహాలో బాంబు ఉందంటూ మెయిల్ రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టింది. అయితే అదంతా ఫేక్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో మెయిల్ రావడంతో పోలీసులు విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కోర్టు హాల్స్, రికార్డు రూములు, పార్కింగ్ ఏరియాలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల కారణంగా కోర్టు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతిసారీ ఇది ఫేక్ కాల్ అని తేలుతున్నా, భద్రత విషయంలో ఎలాంటి అజాగ్రత్త వహించకూడదని పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

తమిళనాడు పోలీసుల హస్తం?
ప్రాథమిక విచారణలో ఈ బెదిరింపుల వెనుక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో వచ్చిన బెదిరింపు మెయిల్స్‌కు తమిళనాడుకు చెందిన కొందరు పోలీసు సిబ్బందికి సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తమ శాఖలోని ఉన్నతాధికారుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన వేధింపులను తట్టుకోలేక, ఏం చేయాలో పాలుపోక దృష్టి మళ్లించేందుకే న్యాయస్థానాలను టార్గెట్ చేసుకుని ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. తాజాగా వచ్చిన మెయిల్ కూడా అదే ముఠా పనినా లేక మరెవరైనా ఆకతాయిలు పంపారా అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

నాంపల్లి అగ్నిప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు వ్యక్తుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దుర్ఘటనపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు, ఈ ప్రమాదానికి కారణమైన భవన యజమాని సతీష్ బచాస్‌ను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో దుకాణ యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఐదుగురు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు సిద్ధమవుతున్నారు.

మంత్రుల దిగ్భ్రాంతి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. యజమానుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. GHMC, పోలీస్, రెవెన్యూ, హైడ్రా అధికారులు కలిసి పనిచేసి నగరంలో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రజలకు విజ్ఞప్తి
నగరంలోని ఏ భవనంలోనైనా అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదని గుర్తిస్తే, తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను కోరారు. ప్రాణనష్టం జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.