election commission - Vishvambhara News

విపక్ష ఎంపీల అరెస్టు ప్రజాస్వామ్యానికి మచ్చ..
విశ్వంభర,హైదరాబాద్: దేశ రాజధానిలో ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేయడాన్ని తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్మాస్ ఖాన్ తీవ్రంగా ఖండించారు.దేశంలో జరుగుతున్న ఓట్ల తొలగింపు కర్ణాటకలో 1 లక్ష ఓట్లు, బీహార్‌లో 58 లక్షల ఓట్లు — పై వివరణ కోరిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు విపక్ష ఎంపీలను అరెస్టు చేయడం, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

"ఓటు ప్రజల శక్తి. దానిని దొంగిలించడం అంటే ప్రజాస్వామ్యాన్ని చంపడం" అని అల్మాస్ ఖాన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధ బాధ్యతను వదిలి, కేంద్ర ఒత్తిడికి తలొగ్గి నిశ్శబ్దంగా వ్యవహరించడం అనుమానాస్పదమని అన్నారు. ఎన్నికల సంఘం వెంటనే వివరణ ఇవ్వాలని, పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజల ఓటు హక్కు రక్షణలో నిష్పక్షపాతంగా ఉండాలని డిమాండ్ చేశారు.
ఓట్ల దొంగతనానికి నిరసనగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చారని గుర్తుచేశారు.
"మీ ఓటు మీ భవిష్యత్తు. దాన్ని కాపాడాలంటే మీ గొంతు వినిపించాలి" అని అల్మాస్ ఖాన్ పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికకు వేళాయే.. సిరా గుర్తుపై ఈసీ కీలక నిర్ణయం!
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్దమైంది. రేపు ఉదయం 8.00 గంటల నుంచి పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను రెడీ చేశారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే.. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. దీంతో అప్పుడు ఓటు వేసిన చాలా మంది రేపు ఓటు వేస్తారు. వారికి ఇంకా చూపుడు వేలుకు సిరా చుక్క ఇంకా ఉంటుంది. దీంతో.. ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ఏడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు ఉంటుంది.

రేపటి ఎన్నికల కోసం ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు అంటించాలని పోలింగ్ సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటింగ్ సమయంలో సిరా గుర్తు విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలని తెలిపింది. పొరపాటున కూడా చూపుడు వేలుకు సిరా గుర్తు వేయొద్దని స్పష్టం చేసింది. ఇక ఓటు వేసేవారు బ్యాలెట్ పత్రాలపై ఉండే అభ్యర్థులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది.

నిన్నటితోనే ఈ ఎన్నిక ప్రచారం ముగిసింది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో 4.63 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు వేయనున్నారు. దీని ఫలితం జూన్ 5న రానుంది.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈసీ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జూన్ 2న తొలిసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకులను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి భావించింది. పైగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. దీంతో.. ఈ వేడుకులను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈసీ నుంచి అనుమతి వస్తుందా? రాదా? అనే ఉత్కంఠకు తెరపడింది.

ఆవిర్భావ వేడుకుల నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈసీ అనుమతితో సీఎస్ శాంతకుమారి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు సీఎస్ ప్రకటించారు. ఆ రోజు మొదట సీఎం రేవంత్ రెడ్డి గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పింస్తారు. తర్వాత పరేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సోనియా గాంధీ ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటంతో ప్రతీ చిన్న కార్యక్రమానికి కూడా ఈసీ అనుమతి తప్పని సరి అవుతోంది. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాలకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణలో ప్రమేయం ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఈ వేడుకలో భాగం చేయొద్దని ఈసీ ఆదేశించింది.

9 చోట్ల ఈవీఎంల ధ్వంసం... చర్యలెక్కడని అనిల్ ఫైర్
ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై చర్యలు తీసుకోలేదని వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. టీడీపీ నేతలు సత్య హరిచంద్రులు అన్నట్లు ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. మాచర్ల నియోజకవర్గంలో అధికారులను మార్చిన తరువాత అల్లర్లు జరిగాయని అనిల్ ఆరోపించారు.

అల్లర్లు జరిగే అవకాశం ఉందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందు నుంచి లేఖలు రాస్తూనే ఉన్నారని అన్నారు. అయినా ఈసీ పట్టించుకోలేదని విమర్శించారు. టీడీపీ రిగ్గింగ్ లకు పాల్పడిందని అనిల్ కుమార్ ఆరోపించారు.కర్లగుంట, కేపి గూడెంలో ఇద్దరు డీఎస్పీలను మాత్రమే ఎందుకు పెట్టారని నిలదీశారు. రిగ్గింగ్ జరుగుతుందని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలపై దాడులు జరుగుతున్నాయని ఎస్పీకి ఫోన్ చేసినా పట్టించుకోలేదని అన్నారు.

ఏపీలో ఏకంగా 9 ఈవీఎంలు ధ్వంసమైతే పిన్నెల్లి మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని అనిల్ ప్రశ్నించారు. మిగిలిన 8 ఈవీఎంల పరిస్థితి ఏంటని నిలదీశారు. టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న చోట ఎస్పీ సహకారం అందించాడని ఆరోపించారు. రిగ్గింగ్‌పై ఎస్పీ స్పందించలేదని పిన్నెల్లి వెళ్లి అడ్డుకున్నారని అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు తల పగలకొట్టినా పోలీసుల్లో స్పందన లేదు కానీ.. పిన్నెల్లిని వెంటాడటానికి మాత్రం పోలీసులు ముందున్నారని మండిపడ్డారు. ఒక సామాజిక వర్గం అధికారులను అడ్డం పెట్టుకొని రిగ్గింగ్ చేశారని.. లావు కృష్ణ దేవారాయులు కూడా రిగ్గింగ్ కు పాల్పడ్డాడని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.

ఏపీలో పోలింగ్‌ నాటికి ముందస్తు జాగ్రత్తలు .. 20 మందిపై రౌడీషీట్లు
ఏపీలో పోలింగ్ రోజు నుంచి జరిగిన అల్లర్లతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో గాలింపు చర్యలు వేగవంతం చేశారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై చార్జ్‌షీట్‌లు బుక్ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిపై పీడీ యాక్ట్ అమలు చేశారు.

ఒకరికి నగరం నుంచి బహిష్కరించారు. ఇక 20 మందిపై రౌడీషీట్లు, 55 మందిపై సస్పక్ట్ షీట్లు నమోదు చేశారు. 14 మందిని అరెస్ట్ చేశారు. ఇంకో నలుగురికి సీఆర్‌పీసీ నోటీసుల ఇచ్చారు. అల్లర్లు చేస్తారనే అనుమానం ఉన్నవారిని పోలీసులు బైండోవర్ చేస్తున్నారు. జూన్ 4 కంటే ముందు అల్లర్లను ప్రేరేపించేవాళ్లందరిని సైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఫలితాలు వెల్లడి రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇప్పటి వరకూ 183 వాహనాలు,130 ఫోన్లు, భారిగా మధ్యం స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. రిజల్ట్స్ వచ్చిన రోజు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించారు. మరోవైపు అధికారులు కూడా ఏ పార్టీకి అనుకూల వైఖరి తీసుకోకుండా ఈసీ అప్రమత్తం అయింది. అందులో భాగంగా మాచర్ల ఘటనలో పోలింగ్ సిబ్బందిపై చర్యలు మొదలు పెట్టారు. పాల్వాయి గేట్ పోలింగ్ గేట్ కేంద్రంలో విధులు నిర్వహించిన పీవోపై సస్పెన్షన్ వేటు పడింది.