supremecourt - Vishvambhara News

నటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థరెడ్డికి చుక్కెదురు
విశ్వంభర, నేషనల్ బ్యూరో: రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్‌ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.

పోస్టుమార్టం ప్రక్రియపై సుప్రీం తీవ్ర అసంతృప్తి
ఈ కేసు విచారణ సందర్భంగా పోస్టుమార్టం జరిగిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పోస్టుమార్టం నిర్వహించిన పద్ధతి సరిగా లేదని అభిప్రాయపడింది. నిందితుడు, బాధితురాలి తరఫున దాఖలైన వేర్వేరు అప్పీళ్లను పరిశీలించిన అనంతరం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

ప్రేమ.. విషాదం.. సుదీర్ఘ న్యాయపోరాటం
ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా, సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ విషం తాగిన స్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష ఫిబ్రవరి 24న మృతి చెందగా, చికిత్స అనంతరం సిద్ధార్థరెడ్డి మార్చి 9న డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో తేలింది. ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ప్రకారం.. ఆర్గానోఫాస్ఫేట్‌ కారణంగా ప్రత్యూష మరణించారని, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని తేలింది.

ఐదేళ్ల నుంచి రెండేళ్లకు శిక్ష తగ్గింపు
దర్యాప్తు జరిపిన సీబీఐ.. నిందితుడిపై ఆత్మహత్యకు పురికొల్పడం (సెక్షన్ 306), ఆత్మహత్యకు యత్నించడం (సెక్షన్ 309) కింద ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. 2004 ఫిబ్రవరి 23న హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి సిద్ధార్థరెడ్డికి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. దీనిని సవాల్‌ చేస్తూ సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేయగా, తాజాగా సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది.

ఓడిపోయాక కోర్టును ప్రచార వేదికగా వాడుకుంటారా?
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రజలు తిరస్కరించిన తర్వాత న్యాయస్థానాలను పాపులారిటీ కోసం వాడుకుంటున్నారా అని ధర్మాసనం నిలదీసింది.

అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయే కూటమి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందని జన్ సురాజ్ పార్టీ తన పిటిషన్‌లో ఆరోపించింది. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత సుమారు 35 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేశారని పేర్కొంది. సుమారు రూ.15,600 కోట్ల మేర నిధులను ఎన్నికల ముందు పంచడం వల్ల ఓటర్లు ప్రభావితమయ్యారని, అందుకే ఎన్డీయే గెలుపును రద్దు చేయాలని కోరింది. ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.

"ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పుడు న్యాయస్థానాన్ని పాపులారిటీ కోసం వాడుకుంటున్నారా? అసలు మీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇలాంటి పథకాలనే అమలు చేసేవారు కదా!" అని సీజేఐ ప్రశ్నించారు. ఇలాంటి అంశాలపై రాజకీయ పార్టీలు కాకుండా సామాన్యులు కోర్టుకు వస్తే ఆహ్వానిస్తామని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర స్థాయి ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు నేరుగా ఆదేశాలు ఇవ్వలేదని, ఏవైనా ఫిర్యాదులు ఉంటే పాట్నా హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో జన్ సురాజ్ పార్టీ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌కు మూడు వారాల 'డెడ్ లైన్'
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. గత విచారణల తర్వాత స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను, తాజా పరిణామాలను సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని, మిగిలిన వారి విషయంలో మరికొంత సమయం కావాలని కోరారు.

మున్సిపల్ ఎన్నికల సాకు
ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో, ఈ పిటిషన్లపై విచారణను మార్చి మధ్య వరకు వాయిదా వేయాలని అభిషేక్ సింఘ్వీ కోర్టును అభ్యర్థించారు. అయితే, బీఆర్ఎస్ తరఫు న్యాయవాది మోహిత్ రావు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. "నాలుగు వారాల్లో పూర్తి చేస్తామని గతంలో చెప్పి, ఇప్పుడు ఎన్నికల సాకుతో కాలయాపన చేస్తున్నారు" అని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఫిరాయింపులకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఒక ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం కూడా చేశారని కోర్టుకు వివరించారు.

సుప్రీంకోర్టు హెచ్చరిక
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌ల ధర్మాసనం స్పీకర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ గౌరవిస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది. మిగిలిన కేసుల్లోనూ మూడు వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది.

ఒకవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో రాష్ట్రం హోరెత్తుతుంటే, మరోవైపు సుప్రీంకోర్టు విధించిన ఈ మూడు వారాల గడువు అధికార కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ లోపే మిగిలిన ఎమ్మెల్యేల భవితవ్యాన్ని తేలుస్తారా? లేక సుప్రీంకోర్టు కఠిన చర్యలకు దిగుతుందా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు సీరియస్
విశ్వంభర, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక విచారణ చేపట్టింది. ఈ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న లోపాలపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

స్పెల్లింగ్ తప్పులకు నోటీసులా?

ఓటర్ల పేర్లలో చిన్నపాటి అక్షర దోషాలు ఉన్నంత మాత్రాన నోటీసులు జారీ చేయడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ప్రాంతీయ యాస కారణంగా పేర్ల ఉచ్ఛారణలో, స్పెల్లింగ్స్‌లో మార్పులు రావడం సహజమని కోర్టు అభిప్రాయపడింది. ప్రముఖ కవి జోయ్ గోస్వామి వంటి మహానుభావులను కూడా 'గుర్తించని వ్యక్తులు'గా పేర్కొనడంపై అధికారుల విచక్షణను ప్రశ్నించింది. బెంగాలీ భాష తెలిసిన అధికారుల సహాయంతో ఈ పొరపాట్లను సరిదిద్దాలని సూచించింది.

కోర్టులో మమతా బెనర్జీ వాదనలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆమె పలు సంచలన అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల వేళ కేవలం బెంగాల్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ ప్రక్రియను వేగంగా చేపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే 58 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని, సుమారు కోటి మందికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. బ్రతికి ఉన్న వ్యక్తులను కూడా చనిపోయినట్లుగా జాబితాలో చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నివాస ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డులను అధికారులు అంగీకరించడం లేదని ఫిర్యాదు చేశారు.

మైక్రో అబ్జర్వర్ల పాత్రపై ప్రశ్నలు

ఎన్నికల సంఘం నియమించిన మైక్రో అబ్జర్వర్లు ఇష్టానుసారంగా పేర్లను తొలగిస్తున్నారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు, ప్రతి పత్రాన్ని బూత్ లెవల్ ఆఫీసర్లు తప్పనిసరిగా ధృవీకరించేలా ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా ఉండాలని, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని స్పష్టం చేసింది.

మెటాకు సుప్రీంకోర్టు వార్నింగ్
విశ్వంభర, నేషనల్ బ్యూరో: వాట్సాప్ ప్రైవసీ పాలసీ వ్యవహారంలో టెక్ దిగ్గజం మెటాకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. భారతీయ పౌరుల సమాచార భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మెటా తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. "మీరు మా దేశ గోప్యతతో ఆడుకోవాలని చూస్తే సహించం. మా డేటాలోని ఒక్క అంకెను కూడా ఇతరులతో పంచుకోవడానికి అనుమతించం" అని హెచ్చరించారు. భారతదేశ చట్టాలకు లోబడి పని చేయడం ఇష్టం లేని పక్షంలో.. ఇక్కడి నుంచి నిష్క్రమించవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.

డేటా దోపిడీపై సొలిసిటర్ జనరల్ వాదన
ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాట్సాప్ వైఖరిని కోర్టు దృష్టికి తెచ్చారు. తమ వ్యాపార లాభాల కోసం వాట్సాప్ యూజర్ల డేటాను మెటాతో పంచుకుంటోందని వివరించారు. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఇలా తరలించడం ముమ్మాటికీ దోపిడీ కిందకే వస్తుందని వాదించారు. మెటా విధానాలు ఎంత క్లిష్టంగా ఉన్నాయో వివరిస్తూ సీజేఐ తన సొంత అనుభవాన్ని పంచుకున్నారు. ఒక వైద్యుడు తనకు వాట్సప్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపితే, వెంటనే దానికి సంబంధించిన ప్రకటనలే తన ఫోన్‌లో ప్రత్యక్షమయ్యాయని గుర్తు చేశారు. ఉన్నత చదువులు చదివిన వారికే ఈ విధానాలు అర్థం కానప్పుడు.. దేశంలోని లక్షలాది మంది పేదలు, చదువు రాని ప్రజలు వీటిని ఎలా గ్రహిస్తారని ప్రశ్నించారు.

ప్రైవసీ పాలసీ వివాదం?
యూజర్ల భద్రతే తమ లక్ష్యమని వాట్సాప్ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తొలుత డేటా షేరింగ్‌ను తిరస్కరించిన వాట్సాప్, ఆ తర్వాత వినియోగదారుల అనుభవాలను ఫేస్‌బుక్‌తో పంచుకుంటున్నట్లు ఒప్పుకుంది. కొత్త పాలసీ ప్రధానంగా వ్యాపార ఖాతాల కోసమేనని సంస్థ వాదిస్తోంది. వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్స్‌ను తాము చూడలేమని, అవి 'ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్' అని వాట్సాప్ స్పష్టం చేస్తోంది.

బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కృష్ణా నది జలాల వాటా, ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన దూకుడు పెంచింది. ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టాలను వివరిస్తూ పక్కా ఆధారాలతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లీగల్ సెల్ నిపుణులు ముసాయిదాను సిద్ధం చేస్తున్నారు. డ్రాఫ్ట్ పూర్తయిన తర్వాత అడ్వకేట్ జనరల్ తో చర్చించి, తుది మెరుగులు దిద్ది సుప్రీంకోర్టులో సూట్ దాఖలు చేయనున్నారు.

పోలవరం - నల్లమల లింకుపై వెనక్కి..
గతంలో పోలవరం-నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అయితే, సాంకేతిక కారణాల వల్ల దాన్ని వెనక్కి తీసుకున్నామని, ఇప్పుడు మరింత సమర్థవంతంగా 'సివిల్ సూట్' రూపంలో మళ్ళీ దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ అడుగులు వేస్తోంది.

సమ్మక్క సాగర్ ఎన్వోసీపై నజర్
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో త్వరలో చర్చలు జరుపుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.  అంతరాష్ట్ర జల వివాదాలను పరిష్కరించుకుంటూనే, మన హక్కుల కోసం సుప్రీంకోర్టులో పోరాడుతామని వెల్లడించారు.

బనకచర్ల వద్ద ఏపీ ప్రభుత్వం నీటిని మళ్లిస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ ఆగ్రహంగా ఉంది. ఈ ప్రాజెక్టుపై న్యాయపరంగా స్టే తీసుకురావడంతో పాటు, తెలంగాణ వాటాను కాపాడుకునేలా గట్టి వాదనలు వినిపించేందుకు ఇరిగేషన్ శాఖ అంతర్గత సమీక్షలను ముమ్మరం చేసింది.