vandematharam - Vishvambhara News

జాతీయ గేయానికి కొత్త గైడ్‌లైన్స్
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశభక్తికి ప్రతీకగా నిలిచే జాతీయ గేయం 'వందేమాతరం' విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బంకిం చంద్ర చటర్జీ ఈ అద్భుత గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, జాతీయ గేయానికి మరింత గౌరవాన్ని కల్పించేలా నూతన మార్గదర్శకాలను ప్రకటించింది. ఇకపై అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో జాతీయ గీతం 'జనగణమన' కంటే ముందే 'వందేమాతరం' ఆలపించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

ఆరు చరణాలు.. 3 నిమిషాల 10 సెకన్ల నిడివి

వందేమాతరం గేయ ఆలాపనలో గతంలో ఉన్న సంప్రదాయానికి కేంద్రం స్వస్తి పలికింది. 1875లో బంకిం చంద్ర చటర్జీ రచించిన అసలైన ఆరు చరణాల గేయాన్ని పూర్తిగా ఆలపించాలని ఆదేశించింది. 1937లో ముస్లిం లీగ్ అభ్యంతరాల మేరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిన నాలుగు చరణాలను తిరిగి చేరుస్తూ, మొత్తం 3 నిమిషాల 10 సెకన్ల నిడివి కలిగిన గేయాన్ని తప్పనిసరి చేసింది. కేవలం రెండు చరణాలకే పరిమితం కాకుండా, సంపూర్ణ గీతాన్ని పాడటం ద్వారా దేశ వారసత్వాన్ని గౌరవించాలని కేంద్రం పేర్కొంది.

ఎక్కడ ఆలపించాలి? మినహాయింపులు ఏమిటి..

కేంద్రం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. పౌర పురస్కారాల ప్రదానోత్సవాలు, రాష్ట్రపతి, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం ఉండాల్సిందే. అలాగే అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఈ గేయాన్ని తప్పనిసరి చేశారు. సినిమా హాళ్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా దీనిని ప్లే చేయాల్సి ఉంటుంది. అయితే, సినిమా హాళ్లలో గేయం వస్తున్న సమయంలో వృద్ధులు, వికలాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిలబడటం నుంచి మినహాయింపునిచ్చారు.

ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష!

జాతీయ చిహ్నాలను, గీతాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేసిన కేంద్రం, కఠిన నిబంధనలను కూడా అమల్లోకి తెచ్చింది. గేయం ఆలపిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించినా, వెక్కిరించినా లేదా అగౌరవపరిచినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. అపచారానికి పాల్పడే వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధించేలా మార్గదర్శకాల్లో నిబంధనలు చేర్చారు.

రాజకీయ వివాదం.. ఆరు చరణాల వెనుక కథ!

వందేమాతరం ఆరు చరణాల పునరుద్ధరణ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. 1937లో కాంగ్రెస్ కేవలం రెండు చరణాలకే పరిమితం చేసి భారతీయ సంస్కృతిని విస్మరించిందని బీజేపీ ఆరోపిస్తుండగా, దీనిని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్‌లోనూ ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు నడిచాయి. నెహ్రూ హయాం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాన్ని కేంద్రం ఇప్పుడు మార్చివేస్తూ, చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దుతున్నామని ప్రకటించింది.

2,500 మంది కళాకారులతో 'వందేమాతరం'.. నాకెంతో గర్వకారణం: కీరవాణి
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మరో అరుదైన మైలురాయిని అందుకోబోతున్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో విప్లవాత్మక స్ఫూర్తిని రగిలించిన ‘వందేమాతరం’ గేయానికి ఆయన స్వరకల్పన చేయడమే కాకుండా, భారీ స్థాయిలో ప్రదర్శించబోతున్నారు. ఐకానిక్ గేయం 'వందేమాతరం' రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న గణతంత్ర వేడుకల్లో ఈ ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన 2,500 మంది కళాకారులతో కలిసి కీరవాణి ఈ గేయాన్ని ఆలపించనున్నారు.

బంకించంద్ర ఛటర్జీ 1885లో రచించిన ఈ గేయం, గతేడాది నవంబర్‌ 7వ తేదీతో 150 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకునే ఈ బృహత్తర ప్రదర్శనను ప్రభుత్వం ప్లాన్ చేసింది. "వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శన ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 2,500 మంది ఆర్టిస్టులతో కలిసి వేదికను పంచుకోవడం గర్వంగా ఉందని ఎం.ఎం.కీరవాణి ఎక్స్‌ వేదికగా తెలిపారు. ప్రస్తుతం కీరవాణి దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న 'వారణాసి' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మహేశ్‌ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌లో కీరవాణి తన ప్రదర్శనతో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు.