iran - Vishvambhara News

వార్ త‌ప్ప‌దు.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక..
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు కీలక అంశాలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో చేపట్టనున్న రహదారులు, వంతెనలు, విమానాశ్రయాలు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన డిజైన్లను ఆయన ఆవిష్కరించారు. దేశ అభివృద్ధికి మౌలిక సదుపాయాల బలోపేతం కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇరాన్ అంశంపై స్పందించిన ట్రంప్, అమెరికా దళాలపై దాడి ప్రయత్నాల అనంతరం ఇక ప్రతిస్పందించే సమయం వచ్చిందని అన్నారు. అవసరమైతే మరింత తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. అమెరికా భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

కోవిడ్-19 మరణాల అంశాన్ని ప్రస్తావిస్తూ, తన పాలన కంటే జో బైడెన్ హయాంలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ఆరోపించారు. తన అధ్యక్ష పదవీకాలంలో చేపట్టిన 'ఆపరేషన్ వార్ప్ స్పీడ్' విజయవంతమైందని, వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ వేగవంతం చేయడంలో అది కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

ఇరాన్‌ దిశగా అమెరికా సైన్యం
విశ్వంభర బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్‌ పాలకులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్ చుట్టూ ఇప్పటికే అమెరికా తన భారీ నౌకాదళాన్ని మోహరించిందని, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం ఆ దేశం వైపు కదులుతోందని హెచ్చరించారు. శ్వేతసౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇరాన్ తాజా పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వందలాది మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్షల అంశంపై ట్రంప్‌ స్పందించారు. "నేను రంగంలోకి దిగకపోయి ఉంటే ఇప్పటికే 800 మందికి పైగా నిరసనకారులను ఇరాన్ ఉరితీసేది. వారిని ఉరితీస్తే అమెరికా నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను హెచ్చరించడంతోనే ఇరాన్ పాలకవర్గం వెనక్కి తగ్గింది" అని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్‌కు నష్టం జరగకూడదని తాను భావిస్తున్నప్పటికీ, పరిస్థితులు చేయి దాటితే చర్యలు తప్పవని ట్రంప్ స్పష్టం చేశారు.

పశ్చిమాసియాకు అమెరికా అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ సహా పలు యుద్ధనౌకలు చేరుకుంటున్నాయి. దాడులను తిప్పికొట్టేందుకు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా వైట్‌హౌస్ ఆ ప్రాంతానికి పంపిస్తోంది. ఇరాన్‌ నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ భారీ మోహరింపు జరుగుతోందని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఇరాన్‌ అల్లర్లకు ట్రంపే కారణం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక నిరసనలకు, ప్రాణ నష్టానికి ట్రంప్‌నే ప్రధాన బాధ్యుడిగా పేర్కొంటూ ఆయన్ను ఒక ‘నేరస్థుడిగా’ ఇరాన్ పరిగణిస్తోందని ప్రకటించారు. శనివారం ప్రభుత్వ టెలివిజన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఖమేనీ, దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై తొలిసారి నోరు విప్పారు.

అమెరికా ప్లాన్.. గ్యాంగ్‌స్టర్ల అమలు
ఇరాన్‌ను అణచివేయడానికి, ఇక్కడి వనరులపై ఆధిపత్యం చెలాయించడానికి అమెరికా ఒక పెద్ద కుట్ర పన్నిందని ఖమేనీ ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అమెరికా అధ్యక్షుడే స్వయంగా రంగంలోకి దిగి, నిరసనకారులకు సైనిక మద్దతు ఇస్తామని ప్రకటనలు చేయడం ద్వారా వారిని రెచ్చగొట్టారని మండిపడ్డారు.   నిరసనకారులు విదేశాల నుంచి వచ్చిన మందుగుండు సామగ్రిని వాడారని, విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. వీరంతా అమెరికా కోసం పనిచేస్తున్న ‘కాల్‌బంట్లు’ అని అభివర్ణించారు.

వేలాది మంది మృతి.. తొలిసారి అంగీకారం
ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల్లో భారీగా ప్రాణ నష్టం జరిగిందని ఖమేనీ మొదటిసారి బహిరంగంగా అంగీకరించారు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఈ హింసలో సుమారు 3,000 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. నిరసనల్లో పాల్గొన్న దాదాపు 800 మందికి ఇరాన్ ప్రభుత్వం మరణశిక్షలు అమలు చేయబోతోందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. అయితే, అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ వెనక్కి తగ్గి ఆ శిక్షలను నిలిపివేసినట్లు ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.

నేరస్థులను విడిచిపెట్టం
దేశాన్ని యుద్ధం వైపు తీసుకెళ్లాలనే ఆలోచన తమకు లేదని, కానీ శాంతికి విఘాతం కలిగించిన వారిని వదిలిపెట్టబోమని ఖమేనీ స్పష్టం చేశారు. నిరసనల ముసుగులో దేశాన్ని అస్థిరపరిచిన స్వదేశీ, విదేశీ నేరస్థులెవరినీ విడిచిపెట్టమని.. వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇరాన్ జాతి ఈ కుట్రను విజయవంతంగా అణచివేసిందని అయతొల్లా అలీ ఖమేనీ వెల్లడించారు.

మళ్లీ మొదలైన దౌత్య యుద్ధం
కొద్దిరోజులుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న తరుణంలో ఖమేనీ తాజా వ్యాఖ్యలు పశ్చిమాసియాలో మళ్లీ సెగలు పుట్టిస్తున్నాయి. అగ్రరాజ్యం వేస్తున్న ఆర్థిక అస్త్రాలు (సుంకాలు), ఇరాన్ చేస్తున్న ఆరోపణలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

నెతన్యాహుతో పుతిన్ కీలక చర్చలు
విశ్వంభర బ్యూరో: ఇరాన్‌లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఫోన్ కాల్ అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ వేదికగా సాగుతున్న అంతర్గత అల్లర్లు, ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్తతలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఇరాన్‌తో నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు, అవసరమైతే తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని నెతన్యాహుకు పుతిన్ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి రష్యా తరపున దౌత్యపరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌లో ఉద్రిక్తతలు తగ్గడం ప్రపంచ శాంతికి కీలకమని పుతిన్ అభిప్రాయపడ్డారు.

రక్తసిక్తమవుతున్న ఇరాన్ వీధులు
మరోవైపు, తీవ్ర ఆర్థిక సంక్షోభం ఇరాన్‌ను కుదిపేస్తోంది. గత కొన్ని వారాలుగా నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగంపై అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అయితే, ఈ నిరసనలను అణచివేసేందుకు భద్రతా బలగాలు ప్రయోగించిన బలప్రయోగం తీవ్ర హింసకు దారితీసింది.

అమెరికాకు చెందిన 'హ్యూమన్ రైట్స్ న్యూస్ ఏజెన్సీ' (HRNA) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు దాదాపు 3,000 మందికి పైగా ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని తెలుస్తోంది. వేలాది మంది గాయపడగా, వందల సంఖ్యలో నిరసనకారులను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. రష్యా జోక్యంతోనైనా అక్కడి పరిస్థితులు సద్దుమణుగుతాయా లేదా అనేది వేచి చూడాలి.

ఇరాన్ ‘నో ఫ్లై’ జోన్
విశ్వంభర, బ్యూరో: ఇరాన్‌లో కొనసాగుతున్న హింసాత్మక నిరసనలు, యుద్ధ మేఘాల నేపథ్యంలో ఆ దేశ గగనతలం మూతపడింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ తన వైమానిక మార్గాన్ని వాణిజ్య విమానాల రాకపోకలకు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ పరిణామంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా భారత్ నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇరాన్ పరిణామాల నేపథ్యంలో దేశీయ విమానయాన దిగ్గజాలు ఎయిరిండియా, ఇండిగో తమ ప్రయాణికులకు కీలక అడ్వైజరీ జారీ చేశాయి. ఇరాన్ మీదుగా వెళ్లాల్సిన విమానాలను సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో లేని కొన్ని సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. "ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు మేము అత్యంత ప్రాధాన్యతనిస్తాం. ప్రస్తుత పరిస్థితుల వల్ల కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాం" అని ఎయిరిండియా ఎక్స్ వేదికగా పేర్కొంది. ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో విమాన సమయాల గురించి ఎప్పటికప్పుడు ఆయా సంస్థల వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా అప్‌డేట్స్ తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. రాబోయే 24 గంటల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో భారత్ అప్రమత్తమైంది. ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు తక్షణమే అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా దేశాన్ని వీడాలని విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇరాన్‌కు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

ఇరాన్‌ను వీడాలని భారతీయులకు సూచన
విశ్వంభర, బ్యూరో: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో  భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. భారత విదేశాంగ శాఖ (MEA) ఇరాన్‌లోని భారతీయ పౌరులకు అత్యవసర సూచనలు జారీ చేసింది. ఇరాన్ -ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడైనా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో తక్షణమే భారతీయులు ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు అందుబాటులో ఉన్న విమాన లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి రావాలని ప్రభుత్వం కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు  భారతీయులెవరూ ప్రస్తుతం ఇరాన్‌కు వెళ్లవద్దని, అన్ని రకాల ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని స్పష్టం చేసింది.ఇరాన్‌లో ఉన్నవారు వెంటనే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం లేదా జహేదాన్‌లోని కాన్సులేట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది.

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గగనతల మూసివేత లేదా రవాణా నిలిపివేత వంటి పరిస్థితులు తలెత్తక ముందే సురక్షితంగా బయటపడాలని కేంద్రం భావిస్తోంది. "ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అక్కడ ఉన్న మన పౌరులు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు." అంటూ విదేశాంగ శాఖ ప్రకటన చేసింది.

ప్రస్తుతం ఇరాన్‌లో సుమారు 5,000 నుండి 10,000 మంది వరకు భారతీయులు (ముఖ్యంగా విద్యార్థులు మరియు ఉద్యోగులు) ఉన్నట్లు అంచనా. ఒకవేళ యుద్ధం మొదలైతే వారిని తరలించడం కష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో 'ఆపరేషన్ అజయ్' లేదా 'ఆపరేషన్ కావేరి' తరహాలో పెద్ద ఎత్తున తరలింపు అవసరం కాకుండా, ముందుగానే అప్రమత్తం చేస్తోంది.