journalist - Vishvambhara News

అక్రిడేషన్ కార్డుకు విలువ లేదా..?.. బల్కంపేట ఘటనపై జర్నలిస్టుల ఆగ్రహం
Balkampet Ellamma Temple: హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్న ఓ జర్నలిస్టు తన అక్రిడేషన్ కార్డును చూపించినప్పటికీ, దానికి విలువ లేదని అక్కడ విధుల్లో పోలీసులు వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జర్నలిస్టు, పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో జర్నలిస్టు తన అక్రిడేషన్ కార్డు గురించి ప్రశ్నించగా, పోలీసులతో మాటామాటా జరిగినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనపై పలువురు జర్నలిస్టులు, మీడియా వర్గాలు స్పందిస్తూ అక్రిడేషన్ కార్డుకు గౌరవం ఇవ్వాలని, జరిగిన ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగానే ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. పోలీసుల వివరణ వెలువడిన తర్వాతే ఘటనపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది.

జర్నలిస్టులను అర్దరాత్రి నేరస్తులా పట్టుకోవడం అత్యుత్సాహమే
విశ్వంభర తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్టుల పర్వం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. అర్ధరాత్రి వేళ జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం "ఎమర్జెన్సీ" పాలనను తలపిస్తోందని, మీడియా స్వేచ్ఛను హరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.పండుగ వేళ ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు

బీఎన్ఎస్ సెక్షన్ 35 ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నా, అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్లి జర్నలిస్టులను నేరస్తుల్లా పట్టుకోవడం అత్యుత్సాహమే అని కేటీఆర్ విమర్శించారు. జర్నలిస్టులను నేరస్తుల్లా వ్యవహరించేందుకు తెలంగాణ డీజీపీ ఎంతగా పట్టుబడుతున్నారో చూడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వారికి నోటీసులు ఇచ్చి, విచారణకు పిలవవచ్చు కదా అని ప్రశ్నించారు. అలా చేయకుండా, అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి అరెస్టులు చేయడం అత్యుత్సాహం, హద్దులు దాటిన చర్య అని విమర్శించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల  చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల చర్యల వల్ల జర్నలిస్టుల కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నాయని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీ చట్టబద్ధమైన విధానాన్ని పాటించాలని, కాంగ్రెస్ పార్టీ, దాని అప్రామాణిక నాయకత్వం చేస్తున్న చెడు రాజకీయాలకు పాల్పడకుండా ఉండాలని తాను కోరుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. కక్ష సాధింపు చర్యలు ఆపాలని.. అసలు సమాచారం 'లీక్' చేసిన వ్యక్తిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ.. మీ 'మొహబ్బత్ కీ దుకాన్' తెలంగాణ శాఖ పౌరుల రాజ్యాంగ హక్కులను ఎలా కాలరాస్తోందో గమనిస్తున్నారని ఆశిస్తున్నాను అంటూ ఎద్దేవా చేశారు.

వివాదం నేపథ్యం ఇదే..
ఇటీవల ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి, ఒక మంత్రికి సంబంధించి సోషల్ మీడియాలో, కొన్ని న్యూస్ ఛానళ్లలో వచ్చిన కథనాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సదరు అధికారిణి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్న ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీవీ  యాజమాన్యం బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ లను పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు.