TVK - Vishvambhara News

అభివృద్ధి పనుల పరిశీలనకు రెడ్ కార్పెట్.. విజయ్ పర్యటనపై చర్చ
Tamil Nadu News: టీవీకే (TVK) అధినేత విజయ్ చెన్నైలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్లిన సందర్భంగా చేసిన ఏర్పాట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన పర్యటన కోసం అధికారులు రెడ్ కార్పెట్లు, గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేయడంతో ఆ దృశ్యాలు సినిమా షూటింగ్‌ను తలపించేలా ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ పర్యటనకు సంబంధించిన వీడియోలను టీవీకే వర్గాలు సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో ప్రచారం చేస్తున్నాయి. అయితే ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించాల్సిన పర్యటనలను ప్రచార ఆర్భాటాలుగా మార్చడం సరైన పద్ధతి కాదంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, విజయ్ అభిమానులు మాత్రం అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించడం మంచి పరిణామమని, పర్యటనలో చేసిన ఏర్పాట్లను అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలకు దారితీసింది.

విజయ్ ప్రచార సభలో విషాదం.. గుండెపోటుతో మహారాష్ట్ర వ్యక్తి మృతి
విశ్వంభర, నేషనల్ బ్యూరో: తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో విషాదం చోటుచేసుకుంది. సేలంలో నిర్వహించిన ర్యాలీలో మహారాష్ట్రకు చెందిన 37 ఏళ్ల సూరజ్ అనే వ్యక్తి హఠాత్తుగా స్పృహ కోల్పోయి మృతి చెందాడు. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో జనసమూహంలో నుండి ఒక్కసారిగా కిందపడిపోవడంతో స్థానికులు, పోలీసులు అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతికి కారణం గుండెపోటు అని వైద్యులు పేర్కొన్నారు. ఉపాధి కోసం కుటుంబంతో సహా సేలానికి వలస వచ్చిన సూరజ్, కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అనుమతికి మించి తరలిన జనం
ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కానీ, నిర్వాహకులు అనుమతి పొందిన సంఖ్య కంటే ఎక్కువ మందిని సభకు అనుమతించడంతో వేదిక ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 5వేల మందికి మాత్రమే అనుమతి ఉంది. అయితే దాదాపు 7 వేల మంది జనం రావడంతో తోపులాట వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై పూర్తి విచారణ జరిపి నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

తమిళనాట మోగనున్న 'విజిల్'
విశ్వంభర, నేషనల్ బ్యూరో: తమిళ సినీ స్టార్ హీరో, 'దళపతి' విజయ్ రాజకీయ ప్రయాణంలో మరో కీలక అంకం ఆవిష్కృతమైంది. ఆయన స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తును కేటాయించింది. పార్టీ కోరిక మేరకు 'విజిల్' గుర్తును కేటాయిస్తూ గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. విజయ్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలను నిర్వహించి తన బలాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఎన్నికల గుర్తు కూడా రావడంతో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కానుంది.

ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే దిశగా..
తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీ పెట్టిన కొద్ది కాలంలోనే రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టి, తన సత్తా చాటారు. ఇటీవలే విక్రవాండిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ ద్వారా తన రాజకీయ విధివిధానాలను ప్రకటించిన విజయ్, ఇప్పుడు 'విజిల్' గుర్తుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గుర్తుతోనే అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులు బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కష్టాల్లో ఉన్న వేళ 'తీపి' కబురు
గత కొద్ది రోజులుగా విజయ్ వరుస ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరూర్‌లో నిర్వహించిన పార్టీ కార్యక్రమ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన రాజకీయంగా కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఇప్పటికే రెండు విడతలుగా విజయ్‌ను సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలు కొనసాగుతున్న తరుణంలోనే, ఈసీ నుంచి పార్టీకి గుర్తు కేటాయించడం విజయ్ వర్గానికి పెద్ద ఊరటనిచ్చింది.

విజిల్ వెనుక విశిష్టత!
గతంలో విజయ్ నటించిన పలు సినిమాల్లో 'విజిల్' థీమ్ సాంగ్స్, మ్యానరిజమ్స్ ఆయన అభిమానుల్లో ఎంతో పాపులర్. యువతను, సామాన్య ప్రజలను ఆకట్టుకునే విధంగా ఈ గుర్తు ఉండటంతో ఎన్నికల ప్రచారంలో ఇది కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గుర్తు కేటాయింపుపై పార్టీ నాయకులు స్పందిస్తూ.. "ప్రజల కష్టాలను గుర్తించి ప్రభుత్వంపై విజిల్ వేసే ధైర్యం మా పార్టీకి ఉందని, ఈ గుర్తు గెలుపుకు సంకేతం" అని పేర్కొన్నారు. విజయ్ తన సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి సారించిన వేళ, 'విజిల్' గుర్తుతో ఆయన ప్రచారం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

తొలిరోజు ముగిసిన విజయ్ సీబీఐ విచారణ
విశ్వంభర, నేషనల్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ సోమవారం సీబీఐ అధికారుల ముందు హాజరయ్యారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు విజయ్‌ను పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు.

విచారణ సందర్భంగా తొక్కిసలాట ఘటనకు, తన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని విజయ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట జరిగిన సమయంలో పరిస్థితి చేయి దాటిపోకూడదన్న ఉద్దేశంతోనే తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారు. పార్టీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన అధికారులకు వివరించినట్లు సమాచారం. గతంలో పార్టీ కార్యకర్తలను ప్రశ్నించినప్పుడు కూడా వారు ఇదే తరహా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. తొలిరోజు విచారణ ముగిసినప్పటికీ, విజయ్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని సీబీఐ వర్గాలు తెలిపాయి. అయితే, పండగ నేపథ్యంలో విచారణకు విరామం ఇవ్వాలని విజయ్ కోరడంతో.. పండగ ముగిసిన తర్వాత ఆయన్ను మరోసారి ప్రశ్నించనున్నారు.

అసలేం జరిగింది?
గతేడాది సెప్టెంబరు 27న కరూర్‌లో విజయ్‌ నిర్వహించిన ప్రచార సభలో భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయ్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా రావడం వల్లే అభిమానులు ఒక్కసారిగా మీదకు రావడంతో తొక్కిసలాట జరిగిందని తమిళనాడు పోలీసులు పేర్కొన్నారు. ఇదంతా డీఎంకే ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని, తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విజయ్ గతంలోనే కొట్టిపారేశారు.