#cough - Vishvambhara News

అది దగ్గుమందు కాదు.. విషం!
విశ్వంభర తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రజలకు తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి (DCA) ఒక కీలకమైన, అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. మార్కెట్లో లభ్యమవుతున్న ఒక నిర్దిష్ట దగ్గుమందు (Cough Syrup) ప్రాణాంతకమైన విషపూరిత రసాయనాలను కలిగి ఉందని అధికారులు గుర్తించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా సేకరించిన నమూనాలను పరీక్షించగా.. అల్మాంట్–కిడ్ సిరప్ (Almont-Kid Syrup)ను వాడవద్దని హెచ్చరించారు. అది దగ్గు మందు కాదని, దగ్గుమందు రూపంలో ఉన్న స్లో పాయిజన్ అని తెలిపింది.కాగా, గతేడాది మధ్యప్రదేశ్ లో కోల్డ్ రిఫ్ దగ్గుమందు తాగి 20కి పైగా పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత ఆ దగ్గుమందు తయారీ కంపెనీపై కేంద్రం చర్యలు తీసుకుంది. వాటి ఎగుమతులపై నిషేధం విధించింది. తాజాగా తెలంగాణలోనూ పిల్లల దగ్గుమందుపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ దగ్గుమందులో ఎథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. దీంతో సిరప్ వినియోగాన్ని వెంటనే నిలిపివేయాల్సిందిగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఔషధ ప్రమాద నియంత్రణ సంస్థ (CDSCO) ఈస్ట్ జోన్, కోల్ కతా నుంచి వచ్చిన అలర్ట్ ఆధారంగా రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ శాఖ ప్రకటించింది. సాధారణంగా ఈ రసాయనాలను ఇండస్ట్రియల్ సాల్వెంట్స్‌గా వాడుతుంటారని, ఇవి మానవ శరీరంలోకి చేరితే కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో పాటు మరణం సంభవించే అవకాశం ఉంది.

డీసీఏ కీలక సూచనలు..
ఫార్మసీ యజమానులు ఈ మందు అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని డీఏసీ అధికారులు సూచించారు. నిల్వలను అధికారులకు అప్పగించాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి ఈ కల్తీ మందును విక్రయించే వారిపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీసీఏ డైరెక్టర్ హెచ్చరించారు. దీంతో పాటు ప్రజలు మీ ఇంట్లో ఒకవేళ ఈ బ్రాండ్‌కు చెందిన సిరప్ బాటిల్స్ ఉంటే వెంటనే వాటిని పారేయాలని సూచించారు. దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నప్పుడు సొంతంగా మందులు వాడకుండా, కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే మందులు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏవైనా అనుమానాస్పద మందుల గురించి సమాచారం ఉంటే వెంటనే డీసీఏ టోల్ ఫ్రీ నంబర్‌కు  టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 ఫిర్యాదు చేయాలని కోరారు.