international - Vishvambhara News

85 శాతం కంటిచూపు కోల్పోయిన మాజీ ప్రధాని
విశ్వంభర, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి జైలులో అత్యంత దారుణంగా తయారైంది. రావల్పిండిలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు అక్కడి సిబ్బంది అమానవీయంగా వ్యవహరిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా జైలు గదిలో ఒంటరిగా ఉంచడంతో, ఇమ్రాన్ ఖాన్ కుడి కంటిచూపు 85 శాతం కోల్పోయినట్లు తెలుస్తోంది.

సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాది జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసి, ఆయన ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి కోర్టుకు నివేదిక సమర్పించారు. మూడు, నాలుగు నెలల క్రితం వరకు చూపు సరిగ్గానే ఉండేదని, ఆ తర్వాత మసకబారడం మొదలైందని ఇమ్రాన్ న్యాయవాదితో పేర్కొన్నారు. ఈ విషయాన్ని జైలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోలేదని, దాంతో పరిస్థితి విషమించిందని ఇమ్రాన్ వివరించారు.

ఏకాంతవాసంతో నరకం
రెండున్నరేళ్లుగా ఇమ్రాన్ ఖాన్‌ను ఒకే గదిలో ఒంటరిగా ఉంచారని నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల ఆయన శారీరక సమస్యలతో పాటు మానసిక ఆందోళనను కూడా ఎదుర్కొంటున్నారు. వైద్య పరీక్షలు సకాలంలో నిర్వహించడం లేదని, కుటుంబ సభ్యులను కూడా కలవకుండా జైలు అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. న్యాయవాది సమర్పించిన నివేదికపై స్పందించిన పాకిస్థాన్ సుప్రీం కోర్టు, ఇమ్రాన్ ఖాన్‌కు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. కంటిచూపు కోల్పోయే పరిస్థితికి దారితీసిన నిర్లక్ష్యంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

మాపై పన్నులు బాదండి.. కుబేరుల వింత డిమాండ్
విశ్వంభర, నేషనల్ బ్యూరో: సాధారణంగా పన్నులు తగ్గిస్తే బాగుంటుందని కార్పొరేట్ దిగ్గజాలు కోరుకోవడం చూస్తుంటాం. కానీ, స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా దీనికి భిన్నమైన, వినూత్నమైన డిమాండ్ వినిపించింది. "మాపై భారీగా పన్నులు విధించండి" అంటూ 24 దేశాలకు చెందిన సుమారు 400 మంది అత్యంత సంపన్నులు ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు బహిరంగ లేఖ రాయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాము ప్రభుత్వాలను స్వాధీనం చేసుకున్నామని..  ఆవిష్కరణలపై పట్టు బిగించామని తెలిపారు. ఇది వ్యవస్థకు మంచిది కాదని.. మార్పు రావాలంటే చట్టసభలు తమపై పన్నుల భారాన్ని పెంచాలని తెలిపారు.

'టైమ్ టు విన్'
సంపన్నులు, సామాన్యుల మధ్య పెరుగుతున్న అగాధాన్ని రూపుమాపాలని కోరుతూ "టైమ్ టు విన్" పేరుతో వీరు సంతకాలు చేసిన లేఖను విడుదల చేశారు. భారీ సంపద కలిగిన కొందరు వ్యక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థలను కొనుగోలు చేస్తున్నారని, ప్రభుత్వాలను తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారని సంపన్నులు ఆవేదన వ్యక్తం చేశారు. సంపద ప్రభావంతో మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారని, ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని హెచ్చరించారు. తమపై అధిక పన్నులు విధించడం వల్ల తమ జీవన ప్రమాణాలు ఏమాత్రం తగ్గవని.. కానీ, ఆ నిధులతో ఆరోగ్యం, విద్య వంటి ప్రజా సేవలకు భారీగా నిధులు అందుతాయని పేర్కొన్నారు.

అసమానతల అంతానికి అస్త్రం అదే!
ధనవంతులపై 'ప్రగతిశీల సంపద పన్ను'విధించడం ద్వారానే అసలైన ప్రజాస్వామ్య వ్యవస్థలను తిరిగి నిర్మించుకోగలమని ఈ బృందం స్పష్టం చేసింది. రాజకీయ వ్యవస్థలపై సంపన్నుల గుత్తాధిపత్యాన్ని తగ్గించాలంటే పన్నుల విధానంలో మార్పులు తప్పవని వారు అభిప్రాయపడ్డారు. భారతదేశంలో కూడా ఆదాయ అసమానతలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త థామస్ పికెట్టీ (క్యాపిటల్ ఇన్ 21వ సెంచరీ రచయిత) గతంలోనే భారత్‌లో పెరిగిపోతున్న ఆర్థిక వ్యత్యాసాలపై హెచ్చరించారు. దేశంలోని 'సూపర్ రిచ్' వ్యక్తులపై అదనపు పన్నులు విధించడం ద్వారానే సామాజిక సమతుల్యత సాధ్యమవుతుందని సూచించారు.

మైనారిటీలపై దాడులు మత ప్రమేయం లేనివే
విశ్వంభర బ్యూరో: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన వేళ, అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గడిచిన ఏడాది కాలంలో జరిగిన ఘటనల్లో అత్యధికం వ్యక్తిగత కక్షలు లేదా నేరపూరిత స్వభావం కలిగినవే తప్ప, వాటికి మతపరమైన ఉద్దేశాలు లేవని మహమ్మద్ యూనస్ కార్యాలయం స్పష్టం చేసింది.

యూనస్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం.. గతేడాది మైనారిటీలకు సంబంధించి 645 ఘటనలు నమోదయ్యాయి. వీటిలో కేవలం 71 ఘటనలు (అంటే కేవలం 11%) మాత్రమే మతపరమైన కారణాలతో జరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. దేవాలయాల ధ్వంసానికి సంబంధించి 38 కేసులు నమోదయ్యాయి. మతపరమైన 71 ఘటనల్లో 50 కేసులను పోలీసులు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన 21 ఘటనలపై విచారణ సాగుతోందని వెల్లడించింది.

గణాంకాలను తోసిపుచ్చిన హిందూ సంఘాలు
ప్రభుత్వ గణాంకాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ (BHBCUC) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ప్రకటనలు నేరస్తులకు వత్తాసు పలికేలా ఉన్నాయని, వారికి శిక్ష పడదనే భరోసా కల్పిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆందోళనలో హిందూ సమాజం
బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణపై భారత్ నిరంతరం ఒత్తిడి తెస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ ఏడాది కేవలం మూడు వారాల వ్యవధిలోనే 10 మందికి పైగా హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. నిత్యం ఆలయాల ధ్వంసం, ఆస్తుల లూటీ వంటి వార్తలు మైనారిటీల్లో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. అన్ని నేరాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పెరుగుతున్న దాడులు మరియు మైనారిటీ సంఘాల ఆందోళనలు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతున్నాయి.

డిజిటల్ ఐడీ ప్రతిపాదనపై బ్రిటన్ వెనకడుగు
విశ్వంభర బ్యూరో: బ్రిటన్‌లోని పౌరులు, శాశ్వత నివాసులకు సంబంధించి వివాదాస్పదంగా మారిన డిజిటల్ ఐడెంటిఫికేషన్ కార్డుల ప్రతిపాదనపై ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఉద్యోగం పొందాలంటే డిజిటల్ ఐడీ తప్పనిసరి అనే నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు సమాచారం. దేశంలో అక్రమ వలసలను కట్టడి చేసే లక్ష్యంతో కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది. బ్రిటన్‌లో ఎవరైనా పనిచేయాలంటే ప్రభుత్వం జారీ చేసే డిజిటల్ ఐడీ ఉండాల్సిందేనని, ఇది లేకుంటే ఉపాధి లభించదని గతంలో ప్రధాని ప్రకటించారు. ఈ విధానం వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలగదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

ప్రజా వ్యతిరేకతతో దిగివచ్చిన సర్కార్
అయితే, ఈ డిజిటల్ కార్డుల విధానంపై బ్రిటన్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వ్యక్తిగత డేటా భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 30 లక్షల మంది పార్లమెంటరీ పిటిషన్‌పై సంతకాలు చేశారు. ప్రజల నుంచి వచ్చిన భారీ వ్యతిరేకతను గమనించిన స్టార్మర్ ప్రభుత్వం, ముందడుగు వేయడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతాయని భావించి తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.

జులై 4న యూకే ఎన్నికలు.. రిషి సునాక్ కీలక ప్రకటన
సార్వత్రిక ఎన్నికలకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌  పిలుపునిచ్చారు. జులై 4న సాధారాణ ఎన్నికలు జరగున్నట్లు ప్రకటించారు. కేబినేట్‌ భేటీ తర్వాత ప్రధాని ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. శుక్రవారం బ్రిటన్ పార్లమెంట్‌ను రద్దు చేయనున్నట్లు రిషి సునాక్ కార్యాలయం పేర్కొంది.

రాజ్యాంగబద్ధంగా యూకేలో జనవరి 2025లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చాలా రోజులుగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా రిషి సునాక్ ఆ వాటికి తెరదించారు. పార్లమెంట్‌ను రద్దు చేయమని రిషి అభ్యర్థనను బ్రిటన్‌ రాజు ఆమోదం తెలిపారు.

ఇదిలా ఉంటే.. 44 ఏళ్ల రిషి సునాక్ ప్రధానమంత్రిగా ఓటర్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’ వద్ద వర్షంలో తడుస్తూనే ఆయన ఈ ప్రకటన చేశారు. బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో  విజయాలను సాధించామని, దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

These uncertain times call for a clear plan and bold action to chart a course to a secure future.

You must choose in this election who has that plan and who is prepared to take that bold action to secure a better future for our country and our children. pic.twitter.com/qlbgmYuGkM

— Rishi Sunak (@RishiSunak) May 22, 2024