Cyber Crime - Vishvambhara News

ఢిల్లీలో 21 మంది మహిళా టెలికాలర్లు అరెస్ట్.. ఫేక్ కాల్ సెంటర్ గుట్టురట్టు
: అమాయక ప్రజలను మోసం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఫేక్‌ కాల్ సెంటర్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఢిల్లీలోని శివ మార్కెట్ ప్రాంతంలో మూడు ఫేక్ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న వ్యవహారంపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్ సెంటర్లకు సంబంధించి తెలంగాణలో నమోదైన 22 సైబర్ క్రైమ్ కేసుల్లో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల దర్యాప్తులో ఉత్తరాదికి చెందిన లలిత్ సింగ్, కులదీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ మూడు మోసపూరిత కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు అమాయక ప్రజలకు ఫోన్లు చేసి తమను బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులుగా పరిచయం చేసుకునేవారని పోలీసులు తెలిపారు. ముందుగానే సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్‌ ప్రకారం బాధితులను నమ్మించి, వివిధ రకాల ఛార్జీలు, ఇతర పేర్లతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

బాధితులను తమ మాటలతో నమ్మించి వారి నుంచి డబ్బులు బదిలీ చేయించుకునే విధంగా కాల్ సెంటర్‌లో పనిచేసే టెలికాలర్లకు ప్రత్యేక స్క్రిప్ట్‌లు అందించినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా అనేక మంది ప్రజలను మోసం చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో నమోదైన సైబర్ కేసులను పరిశీలించిన సమయంలో ఈ కాల్ సెంటర్లతో సంబంధాలు బయటపడటంతో పోలీసులు ఢిల్లీలో ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో కాల్ సెంటర్ నిర్వాహకులు పోలీసులకు చిక్కకుండా పరారైనప్పటికీ, అక్కడ పనిచేస్తున్న 21 మంది మహిళా టెలికాలర్లు, ఒక బ్యాంకు ఖాతాదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సైబర్ మోసాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. కాల్ సెంటర్ నిర్వాహకుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

అరెస్టైన మహిళా టెలికాలర్లలో కొందరు తెలంగాణకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్‌లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు వెల్లడైంది. కాల్ సెంటర్‌లో వారి పాత్ర, ఎవరెవరిని సంప్రదించారు, ఎంత మొత్తంలో నగదు వసూలు చేశారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఫేక్ కాల్ సెంటర్ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు.

భూ భారతి స్కామ్‌లో 15 మంది అరెస్ట్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రెవెన్యూ శాఖలో సంచలనం సృష్టించిన 'భూ భారతి' కుంభకోణం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దుల్లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. భూ భారతి వెబ్‌సైట్‌లో ఉన్న కొన్ని సాంకేతిక లోపాలను నిందితులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని చెప్పారు. తప్పుడు పద్ధతుల్లో లాగిన్ అయ్యి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలాన్లను పక్కదారి పట్టించి అక్రమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారని చెప్పారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.3.90 కోట్ల గండి పడిందని సీపీ సన్ ప్రీత్ సింగ్ వివరించారు.

నిందితుల నుంచి భారీగా రికవరీ
పోలీసులు నిందితుల ఇళ్లపై దాడులు చేసి భారీ మొత్తంలో నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 63.19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.కోటి విలువైన ఆస్తి పత్రాలు, నిందితుల బ్యాంకు ఖాతాల సీజ్ చేశామన్నారు. ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఈ కేసులో బసవరాజు, జెల్లా అనే వ్యక్తులను ప్రధాన నిందితులుగా గుర్తించారు. ప్రస్తుతం మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఇలాంటి సాంకేతిక నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరైనా ప్రభుత్వ అధికారులు లేదా కీలక వ్యక్తుల హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

డిజిటల్ అరెస్ట్ భయం… వృద్ధ దంపతులకు రూ.14.85 కోట్ల నష్టం..!!
విశ్వంభర తెలంగాణ, బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనంగా మారిన ఒక భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీస్‌, టెలికాం, న్యాయ వ్యవస్థ అధికారులుగా నటించిన సైబర్ నేరగాళ్లు, ‘డిజిటల్ అరెస్ట్’ అనే భయాన్ని సృష్టించి ఓ ఎన్‌ఆర్‌ఐ వృద్ధ డాక్టర్ దంపతుల నుంచి ఏకంగా రూ.14.85 కోట్లను దోచుకున్నారు. దాదాపు 17 రోజుల పాటు వారిని మానసికంగా వేధిస్తూ, ఇంట్లోనే బంధించినట్టుగా పరిస్థితులు సృష్టించి ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఢిల్లీ గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో నివసిస్తున్న డాక్టర్ ఓం తనేజా, డాక్టర్ ఇందిరా తనేజా దంపతులు ఈ మోసానికి బలయ్యారు. వీరిద్దరూ ఐక్యరాజ్యసమితిలో దాదాపు 48 సంవత్సరాల పాటు సేవలందించి, 2015లో పదవీ విరమణ అనంతరం భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. గత ఏడాది డిసెంబర్ 24న వారికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము టెలికాం శాఖ, పోలీస్ విభాగానికి చెందిన అధికారులమని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తులు, తమపై మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయని, అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అయ్యాయని బెదిరించారు.

ఈ హెచ్చరికలతో తీవ్ర భయాందోళనకు గురైన వృద్ధ దంపతులను, సైబర్ కేటుగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో పూర్తిగా మానసికంగా నియంత్రించారు. డిసెంబర్ 24 నుంచి జనవరి 10 వరకు, అంటే సుమారు 17 రోజుల పాటు వీడియో కాల్స్ ద్వారా వారిని నిరంతరం నిఘాలో ఉంచారు. ఆర్‌బీఐ, సుప్రీం కోర్టు అధికారులుగా నటిస్తూ నకిలీ నోటీసులు, పత్రాలను చూపించి మరింత భయపెట్టారు. డబ్బు చెల్లిస్తే కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని నమ్మించారు.

ఈ క్రమంలో డాక్టర్ ఇందిరా తనేజాను బ్యాంకులకు పంపించి, విడతల వారీగా ఎనిమిది వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు భారీ మొత్తాలను బదిలీ చేయించారు. ఇలా మొత్తం రూ.14.85 కోట్లను సైబర్ నేరగాళ్లు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. చివరకు జనవరి 10న “ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం మీ డబ్బులు తిరిగి వస్తాయి, సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి” అని చెప్పి అకస్మాత్తుగా కాల్ కట్ చేశారు.

పోలీసు స్టేషన్‌కు వెళ్లిన తర్వాతే తాము ఘోరమైన మోసానికి గురయ్యామని వృద్ధ దంపతులు గ్రహించారు. వెంటనే ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఈ-ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని స్పెషల్ సైబర్ యూనిట్ (IFSO)కు దర్యాప్తును అప్పగించారు.

పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వచ్చే కాల్స్ పూర్తిగా మోసమేనని స్పష్టం చేశారు. ఎలాంటి అధికార సంస్థలు కూడా ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా అరెస్టులు, డబ్బు బదిలీలు కోరవని తెలిపారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే స్పందించకుండా, సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

All India Pregnant Job: ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్.. ఇదో కొత్తరకం మోసం..!!
All India Pregnant Job: ఇంటర్నెట్‌లో కనిపించిన ఒక ఆన్‌లైన్ ప్రకటన బిహార్‌లో కలకలం రేపింది. పిల్లలు కలగని మహిళలను తల్లుల్ని చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రచారం చేస్తూ, “ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్” అనే పేరుతో మోసగాళ్లు వల విసిరారు. ఈ ప్రకటనను నమ్మిన చాలా మంది చివరికి మోసపోయారు. ఫోన్ కాల్స్ ద్వారా మాయమాటలు చెప్పి భారీగా డబ్బు దండుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు మైనర్ కావడం మరింత సంచలనంగా మారింది.

ఈ మోసం ఎలా జరిగిందంటే..
పిల్లలు కలగక బాధపడుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఆకర్షణీయమైన మోడళ్ల ఫోటోలతో సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రకటనలు పెట్టారు. తాము దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నామని, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా తమ ‘జాబ్’లో పాల్గొనవచ్చని చెప్పారు. ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తే, మహిళను ప్రెగ్నెంట్ చేయగలిగితే రూ.10 లక్షలు ఇస్తామని, ఒకవేళ ప్రయత్నం విఫలమైతే కనీసం సగం మొత్తం చెల్లిస్తామని నమ్మబలికేవారు.

ముందుగా రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బు వసూలు చేశారు. “పని పూర్తయితే పెద్ద మొత్తం వస్తుంది” అనే ఆశతో కొందరు, “డబ్బుతో పాటు సుఖం కూడా” అనే మాయలో మరికొందరు ఈ వలలో చిక్కుకున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన వెంటనే హోటల్ టారిఫ్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ అంటూ ఒక్కొక్క పేరుతో మళ్లీ మళ్లీ డబ్బు అడిగేవారు. ఒక ఫీజు కట్టగానే మరో కారణం చెప్పి చెల్లింపులు చేయించుకునేవారు.

చాలా మంది డబ్బులు ఇచ్చిన తర్వాతే మోసమని గ్రహించారు. అయితే పరువు పోతుందన్న భయంతో కొందరు మౌనం పాటించారు. మరికొందరు మాత్రం ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులిద్దరినీ పట్టుకున్నారు. వారిలో ఒకరు మైనర్ అని తేలడంతో కేసు మరింత సీరియస్‌గా మారింది. ఈ ఘటన ఆన్‌లైన్ ప్రకటనలపై ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తు చేస్తోంది. అధిక డబ్బు ఆశ చూపించే, నైతికంగా అనుమానాస్పదమైన ఆఫర్లు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.