hydra - Vishvambhara News

హైడ్రాకు మద్దతుగా కొనసాగుతున్న ర్యాలీలు.. ప్రభుత్వానికి సంఘీభావం
HYDRA: హైదరాబాద్‌లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రా చేపడుతున్న చర్యలకు మద్దతుగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. నగరంలో పర్యావరణ పరిరక్షణకు, ప్రజలకు అందుబాటులో ఉన్న పార్కులు, చెరువులను కాపాడేందుకు హైడ్రా తీసుకుంటున్న చర్యలను పలువురు స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు, స్థానికులు ర్యాలీలు నిర్వహిస్తూ హైడ్రాకు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. చెరువులు, కుంటలు, పార్కులు ఆక్రమణలకు గురికాకుండా కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉందని ర్యాలీల్లో పాల్గొన్న వారు పేర్కొన్నారు.

నగరంలో అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. హైడ్రా చేపడుతున్న చర్యల వల్ల నగరంలోని సహజ వనరులను రక్షించేందుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. చెరువులు, పార్కులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండేలా చూడాలని, వాటి పరిరక్షణలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు.

హైడ్రాకు, ప్రభుత్వానికి సంఘీభావంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీల్లో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. హైడ్రా చేపడుతున్న చర్యలను కొనసాగించాలని, పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నగర అభివృద్ధితో పాటు చెరువులు, పార్కులు, పచ్చదనాన్ని కాపాడటం కూడా అత్యంత ముఖ్యమని ర్యాలీలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. హైదరాబాద్‌ను మరింత సుందరంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, హైడ్రాకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు.

మాదాపూర్‌లో హైడ్రా మెరుపు దాడి.. 11 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములను రక్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా తన దూకుడును ప్రదర్శించింది. మాదాపూర్ హైటెక్స్ సమీపంలోని ఖానామెట్ గ్రామ పరిధిలో ఉన్న మొండికుంట చెరువు ప్రాంతంలో భారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 11 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ ధర ప్రకారం దీని విలువ సుమారు రూ.2,200 కోట్లు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రజావాణి ఫిర్యాదుతో కదలిక
మొండికుంట చెరువును ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు 53, 55 లోని ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు వెలిశాయని హైడ్రా ప్రజావాణి ద్వారా అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. ఆక్రమణల నిర్ధారణ కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ సేకరించి, ఆక్రమణలను శాస్త్రీయంగా నిర్ధారించారు. గత నెల జనవరి 31న జరిగిన విచారణలో ఆక్రమణదారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఈ భూమి ప్రభుత్వానిదేనని తేలింది.

వందలాది షెడ్ల కూల్చివేత
భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగిన ఈ ఆపరేషన్‌లో వందలాది తాత్కాలిక షెడ్లు, 30కి పైగా వాణిజ్య దుకాణాలను నేలమట్టం చేశారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఒక ఆలయ ప్రహరీ గోడను సాకుగా చూపి కబ్జాదారులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. ఇక్కడ మెకానిక్ షెడ్లు, ఐరన్, స్టీల్ దుకాణాలను ఏర్పాటు చేసి నెలకు లక్షల రూపాయల అద్దె వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. బాధితులకు తగిన సమయం ఇచ్చిన తర్వాతే ఈ కూల్చివేతలు చేపట్టారు.

పర్యాటక కేంద్రంగా మొండికుంట
అక్రమ నిర్మాణాల తొలగింపుపై చుట్టుపక్కల వాసులు హర్షం వ్యక్తం చేశారు. స్వాధీనం చేసుకున్న ఈ 11 ఎకరాల భూమిలో సుందరమైన పార్కులను నిర్మించాలని, మొండికుంట చెరువును పర్యాటక కేంద్రంగా మార్చాలని అధికారులను కోరారు.

త్వరలో సరూర్ నగర్ చెరువుకు పూర్వవైభవం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో:  నగరంలోని చారిత్రక సరూర్ నగర్ చెరువుకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు హైడ్రా నడుం బిగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్ద చెరువుల పునరుద్ధరణలో భాగంగా, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం సరూర్ నగర్ చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు ప్రస్తుత పరిస్థితి, ఆక్రమణలు మరియు వరద నియంత్రణ చర్యలపై అధికారులతో చర్చించారు. వచ్చే ఏడాది కాలంలో చెరువు పునరుద్ధరణ పనులన్నింటినీ పూర్తి చేస్తామని, మార్చి నాటికి కీలకమైన పనులు ముగుస్తాయని కమిషనర్ వెల్లడించారు. వర్షాకాలంలో చుట్టుపక్కల కాలనీలు ముంపునకు గురికాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని, వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెరువులోకి మురికినీరు నేరుగా చేరకుండా మళ్లించి, కేవలం స్వచ్ఛమైన నీరు మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. చెరువులో పూడిక తీసి, మట్టిని తొలగించడం ద్వారా నీరు భూమిలోకి ఇంకుతుందని, దీనివల్ల స్థానికంగా బోర్లలో నీటి మట్టం పెరుగుతుందని వివరించారు.

ఆక్రమణల ప్రస్తుత పరిస్థితి
చెరువు ప్రస్తుతం 90 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, గతంలో చుట్టుపక్కల ప్రాంతాలు కబ్జాకు గురైన విషయం వాస్తవమేనని ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి ఆ ఆక్రమణల జోలికి వెళ్లడం లేదని.. తమ ప్రాధాన్యత అంతా చెరువును అభివృద్ధి చేయడం, పూడిక తీయడం మరియు బ్యూటిఫికేషన్ చేయడంపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ప్రధాన చెరువులను కాపాడటమే తమ లక్ష్యమని చెప్పారు. సరూర్ నగర్ చెరువును కేవలం ఒక నీటి వనరుగా కాకుండా, స్థానికులకు ఆహ్లాదాన్నిచ్చే ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రభుత్వ అనుమతులతో త్వరలోనే పూర్తిస్థాయి పనులు ప్రారంభమవుతాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

సరూర్ నగర్ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్స్, సుందరమైన చెట్లతో సుందరీకరణ చేయనున్నట్లు కమిషనర్ తెలపడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మురికి కూపంగా మారుతున్న చెరువుకు మళ్లీ మంచి రోజులు రాబోతుండటంతో పర్యావరణ ప్రేమికులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

రేవంత్ సర్కారు కు చెడ్డపేరు తెచ్చేలా హైడ్రా అధికారుల కుట్ర : జగ్గారెడ్డి
విశ్వంభర,హైదరాబాద్ :జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను ఓడించడానికి బీఆర్‌ఎస్‌ పార్టీ హైడ్రాను అడ్డం పెట్టుకొని కుట్రలు పన్నుతోందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సంగారెడ్డిలో ఆయన విలేకరుతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కొందరు హైడ్రా అధికారులు పనిచేస్తున్నట్లుగా అనుమానం కలుగుతోందన్నారు. అత్యుత్సాహం చూపుతున్న అధికారులపై హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌ దృష్టిపెట్టాలని సూచించారు. హైడ్రా కూల్చివేతలను బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉప ఎన్నికలో లబ్ధిపొందాలని చూస్తోందని వివరించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి సహకరిస్తున్నట్లుగా ఉన్న హైడ్రా అధికారుల కుట్రలకు అడ్డుకట్ట వేయాలని, దీనిపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే హైడ్రా బాధితులను కలుస్తానని, బీఆర్‌ఎస్‌ అనుకూల అధికారుల గురించి పూర్తి వివరాలు తెలుసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇప్పటిదాకా హైడ్రా దాడుల గురించి మాట్లాడని కేటీఆర్‌.. జూబ్లీహిల్స్‌ ఎన్నికల నేపథ్యంలో హైడ్రా జపం చేయడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు.