whatsapp - Vishvambhara News

రష్యాలో వాట్సాప్‌పై పూర్తి నిషేధం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: రష్యా ప్రభుత్వం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. స్థానిక చట్టాలను, ప్రభుత్వ నిబంధనలను పాటించడంలో విఫలమైందనే కారణంతో వాట్సాప్‌ను దేశవ్యాప్తంగా పూర్తిగా బ్లాక్ చేసినట్లు రష్యా ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అధికారికంగా ప్రకటించారు. రష్యా ప్రభుత్వం విధించిన కఠినమైన నిబంధనలను పాటించడానికి వాట్సాప్ నిరాకరించిందని అధికారులు ఆరోపిస్తున్నారు. నేరాలను అరికట్టేందుకు అవసరమైన వినియోగదారుల సమాచారాన్ని భద్రతా సంస్థలతో పంచుకోవాలని రష్యా కోరినప్పటికీ, వాట్సాప్ అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వ నిఘాకు లోబడి పనిచేయని యాప్‌లను రష్యా తన దేశంలో అనుమతించడం లేదు.

వాట్సాప్ నిషేధంతో, రష్యా ప్రభుత్వం తన సొంత యాప్ ‘మ్యాక్స్’ను ప్రోత్సహిస్తోంది. చైనాలోని ‘వీచాట్’ మాదిరిగానే, ఈ సూపర్ యాప్ మెసేజింగ్‌తో పాటు బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై అందించనుంది.

రష్యా ప్రభుత్వ నిర్ణయాన్ని వాట్సాప్ తీవ్రంగా ఖండించింది. 10 కోట్ల మంది వినియోగదారులను సురక్షితమైన కమ్యూనికేషన్‌కు దూరం చేసి, వారిని ప్రభుత్వ నిఘా ఉండే యాప్ వైపు మళ్లించే ప్రయత్నమిదని వాట్సాప్ ఆరోపించింది. తన పౌరుల డిజిటల్ కమ్యూనికేషన్‌పై పూర్తి నియంత్రణ సాధించాలనే ఉద్దేశంతోనే వాట్సాప్‌ను నిలిపివేసి, ప్రభుత్వ యాప్‌ను తప్పనిసరి చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. వాట్సాప్‌తో పాటు టెలిగ్రామ్ సేవలను కూడా రష్యా పరిమితం చేసింది. ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లపై రష్యాలో ఆంక్షలు ఉన్నాయి.

హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..
విశ్వంభర,హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్‌ఎంసీ సేవలు ఇకపై మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. పౌరులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సప్ ద్వారానే ఫిర్యాదులు చేయడం, పన్నులు చెల్లించడం వంటి పనులను చక్కబెట్టుకునేలా సరికొత్త వ్యవస్థను జీహెచ్‌ఎంసీ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాట్సప్ చాట్‌బాట్‌ను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ చాట్‌బాట్ ద్వారా పౌరులు తమ సమస్యలను సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. వాట్సప్‌లో ఫిర్యాదు నమోదు చేయగానే, ఆ సమాచారం నేరుగా సంబంధిత అధికారికి వెళ్తుంది. ఏ సమస్యకు ఏ అధికారిని సంప్రదించాలో కూడా ఈ చాట్‌బాట్ తెలియజేస్తుంది. దీనితో పాటు ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ వంటి చెల్లింపులను కూడా ఇకపై వాట్సప్ నుంచే పూర్తి చేసే సౌకర్యాన్ని కల్పించనున్నారు. ప్రస్తుతం ఈ సేవలు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో మాత్రమే ఉన్నాయి.

అంతేకాకుండా, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు వంటివి ఎలా పొందాలో, ఎవరిని సంప్రదించాలో వంటి వివరాలను కూడా ఈ చాట్‌బాట్ అందిస్తుంది. వార్డుల వారీగా అధికారుల ఫోన్ నంబర్లు సహా పూర్తి సమాచారం ఇందులో లభిస్తుంది. ప్రస్తుతం చాలా మందికి ఆన్‌లైన్ సేవలు, అధికారుల వివరాలపై సరైన అవగాహన లేకపోవడంతో చిన్న పనులకు కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకే 24 గంటలూ అందుబాటులో ఉండే ఈ చాట్‌బాట్‌ను తీసుకొస్తున్నట్లు అధికారులు వివరించారు.ఈ చాట్‌బాట్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన టెండర్లను వచ్చే వారంలోనే పిలవనున్నట్లు జీహెచ్‌ఎంసీ ఐటీ విభాగం వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని, నగర పౌరులకు సేవలు మరింత వేగవంతం అవుతాయని భావిస్తున్నారు.