gurram murali goud - Vishvambhara News

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక!
విశ్వంభర ,హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ప్రధాన పా రాజకీయ పార్టీలు అన్ని ఫోకస్ పెట్టాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో కాళీ అయిన ఈ సీటు కోసం మూడు ప్రధాన పార్టీలు తలపడుతున్నాయి.  ఇక రెండు జాతీయ పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగగా బిఆర్ఎస్ ఆచితూచి  వ్యవహరిస్తుంది.  అభ్యర్థిని ఖరారు చేశాకే జనంలోకి వెళ్లాలని ఆ పార్టీ ఆలోచనగా ఉంది. ఇక రాష్ట్రం లో అధికారం లోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ రూపం లో మొదటి ఉప ఎన్నికను ఎదురుకున్న కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ సిట్టింగ్ సీటును తన ఖాతాలో వేసుకుంది . ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అదే సీను రిపీట్ చేయాలనీ భావిస్తోంది. అందుకే ఈ  ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గ్రేటర్ పరిధిలోని సీటు కావడంతో ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. 2023 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఆ పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆ లోటును తీర్చుకోవాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి,టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.ఇప్పటికే నియోజకవర్గాన్ని మూడు భాగాలుగా విభజించి మంత్రులు తుమ్మల,వివేక్,పొన్నం లకు ఒక్కొక్కరికి రెండు డివిజన్ ల చొప్పున కేటాయించారు .

టికెట్ రేసులో ఉన్నది వీళ్ళే ..!

ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు బరిలో దిగుతారన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం పార్టీ లోపల నాలుగు,ఐదు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటి పేరు మహ్మద్ అజారుద్దీన్.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.  తనకు హైకమాండ్ సపోర్ట్ కూడా ఉందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. మరోపేరు  నవీన్ యాదవ్.. గతంలో ఎంఐఎం తరఫున జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేసి.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి వచ్చిన నేత. తనకు ఓ అవకాశం ఇస్తే గెలుస్తానని నమ్మకంగా ఉన్నారు. ఇక మూడో పేరు గుర్రం మురళి గౌడ్  ఈయన కూడా జూబ్లీహిల్స్‌ సీటుపై ఆసక్తి చూపుతున్నారు . గతం లో జూబ్లీ హిల్స్ నుండి ఏమ్మెల్యే గా పోటీచేయడం, అలాగే కార్పొరేటర్ గా పని చేయడం , మరియు వారి కుమారుడు గుర్రం సంజయ్ గౌడ్ కూడా యూసుఫ్ గూడా కార్పొరేటర్ గా పనిచేయడం తో జూబ్లీహిల్స్ నియోజక వర్గ ప్రజలతో తనకు తన కుటుంబానికి  ఉన్న సత్సంబంధాలు , అనుభవం దృష్ట్యా ఈ సారి తప్పకుండ తనకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇస్తుందనే నమ్మకం తో , ఇప్పటికే ఆయన నియోజకవర్గం లో తన గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారని తెలుస్తోంది. అలాగే గతంలో హైదరాబాద్ మేయర్‌గా పనిచేసిన బొంతు రామ్మోహన్, కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు గట్టిగ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు . నియోజకవర్గంలో ప్రజలకు  సుపరిచితమైన వ్యక్తి కావడంతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునికాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాజీ మేయర్ వైపు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది.ఇక వీళ్లతో పాటు  ఖైరతాబాద్ కార్పోరేటర్ విజయారెడ్డి, పీజేఆర్ కుమార్తె అయిన ఆమె కూడా జూబ్లీహిల్స్‌ టికెట్ రేసులో ఉన్నారు. అలాగే జెట్టి కుసుమ కుమార్  కూడా టికెట్ ఆశిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుసుమ కుమార్, తన సామాజిక నేపథ్యం తనకు కలిసొస్తుందని ధీమాగా ఉన్నారు. మైనారిటీ నాయకుడు మహ్మద్ ఫహియుద్దీన్ ఖురేషీ కూడా టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్ల మద్దతు ఉందని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో, అధిష్ఠానం సర్వే నిర్వహించి అభ్యర్థిని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అభ్యర్థి ఎంపికలో పార్టీలో ఒక నిర్దిష్ట ప్రక్రియ ఉందని, అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు.మరి ఫైనల్‌గా ఎవరు బరిలోకి దిగుతారు? కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గుతుంది? ఈ ఎన్నికల్లో ఎలాంటి అద్భుతాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి!

నవీన్ దుమ్మాజి
సీనియర్ కరస్పాండెంట్