telangana jagruthi - Vishvambhara News

మున్సిపల్ పోరులో 'సింహం' గర్జన?
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి, సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదుపరి అడుగు ఎటువైపు అనే ఉత్కంఠకు తెరపడుతున్నట్లు కనిపిస్తోంది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ఆమె వేస్తున్న వ్యూహాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసిన కవిత, ఇంకా పార్టీ పేరును అధికారికంగా ఖరారు చేయలేదు. అయితే, మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ, తన అనుచరులను ఏ గుర్తుపై బరిలోకి దింపాలనే అంశంపై ఆమె ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)నేతలతో కవిత భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఎందుకు 'సింహం' గుర్తుపైనే మోజు?
రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు ధీటుగా నిలబడాలంటే ఒక శక్తివంతమైన గుర్తు అవసరమని కవిత భావిస్తున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి క్షేత్రస్థాయిలో భారీ క్యాడర్ లేకపోయినా, దాని 'సింహం' గుర్తుకు ప్రజల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో రామగుండంలో కోరుకంటి చందర్ ఇదే గుర్తుపై గెలిచి తన సత్తా చాటారు. 2019 పరిషత్ ఎన్నికల్లో ఈ పార్టీ ఏకంగా 25 ఎంపీటీసీలు, 2 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవడం విశేషం. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులకు, రెబల్ నేతలకు ఈ 'సింహం' గుర్తు ఒక ఆయుధంగా మారుతోంది.

చట్టసభల్లోకి 'ఒంటరి' పోరాటం!
శాసనమండలిలో తన చివరి ప్రసంగంలో "ఒంటరిగా వెళ్లి తిరుగులేని శక్తిగా తిరిగి వస్తాను" అని ప్రకటించిన కవిత, ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే హైదరాబాద్ నివాసంలో ఆశావహులతో భేటీ అయ్యి, ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఒకవేళ ఫార్వర్డ్ బ్లాక్ మద్దతుతో లేదా ఆ పార్టీ బి-ఫారమ్‌లతో జాగృతి నేతలు బరిలోకి దిగితే, అది అధికార, ప్రతిపక్ష పార్టీల ఓటు బ్యాంకుకు గండి కొట్టే అవకాశం ఉంది.

తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్న కవితకు, ఈ 'సింహం' గుర్తు ఏ మేరకు కలిసి వస్తుంది? ప్రజలు ఆమె కొత్త ప్రయాణాన్ని ఎలా ఆదరిస్తారు? అనేది తెలియాలంటే మున్సిపల్ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
విశ్వంభర,హైదరాబాద్ : వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 3 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్ ను  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితఆదివారం బంజారా హిల్స్ లోని వారి నివాసం లో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ ఎమ్మెల్సీ కవితకు వారి డిమాండ్ లకు సంబందించిన లేఖ ను అందించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వైశ్యులు కోరుతున్నవి న్యాయమైన డిమాండ్ లని, వారికి జాగృతి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు .  ఆగస్టు 3 న జరిగే వైశ్య రాజకీయ రణభేరి కి తప్పకుండ హాజరు అవుతానని కవిత హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో  వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు కొత్త రవి కుమార్ గుప్తా , కూర రమేష్, కాచం సాయి, మీర్పేట్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ తేరటపల్లి శ్రీనివాస్ గుప్తా, బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు  నాల్ల శ్రీనివాస్ గుప్త,వైశ్య విద్యావంతుల వేదిక నాయకులు బుద్ధ ప్రవీణ్, శ్రీకాకోళ్ల రాజు గుప్త, వైశ్య యూత్ ఫోర్స్ నాయకులు  బూరుగు ప్రవీణ్, సముద్రాల నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి జాగృతి ఆవిర్భావం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
విశ్వంభర, హైదరాబాద్ :సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సింగరేణి జాగృతి ఆవిర్భావ సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగరేణిలోని 11 ఏరియాల కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పని చేస్తుందన్నారు. సింగరేణి కార్మికులు విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థనే అంతం చేయాలని కుట్రలు పన్నుతోందని వాటిని అడ్డుకుంటామన్నారు. సంస్థలో 40 వేల మందికిపైగా కార్మికులు పని చేస్తుంటే వారిలో సగానికిపైగా యువకులే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా 11 ఏరియాలకు సింగరేణి జాగృతి కో ఆర్డినేటర్లను నియమిస్తున్నామని కవిత ప్రకటించారు.

సింగరేణి స్కూళ్లను పునరుద్దరించి సీబీఎస్ఈ సిలబస్ లో విద్యాబోధన చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యం అందజేయాలన్నారు. కార్మిక కాలనీల్లో మెరుగైన వసతులు కల్పించాలని, తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1970లో నిర్మించిన క్వార్టర్స్ కూలిపోయే దశలో ఉన్నాయని, అన్ని రీజియన్లలో కార్మికుల కోసం కొత్త క్వార్టర్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్టుల్లో ఎస్ డీ ఎల్ వెహికిల్స్ ను సింగరేణి కార్మికులతోనే నడిపించాల్సి ఉండగా ఆ మిషన్లను ప్రైవేటు వాళ్ల తో నడిపిస్తున్నారని, ఇది ఓపెన్ కాస్టుల నుంచి కార్మికులను తొలగించే కుట్ర అన్నారు. వెంటనే ప్రైవేట్ వ్యక్తులతో పని చేయించడం ఆపివేయాలన్నారు. సింగరేణి సంస్థ ద్వారా సమకూరుతున్న డీఎంఎఫ్ టీ నిధులను కార్మికులకు మెరుగైన వసతులు కల్పించడానికి వినియోగించుకుండా సీఎం, డిప్యూటీ సీఎంల నియోజకవర్గాలు కొడంగల్, మధిరకు తరలించుకుపోతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ గారి నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించి సింగరేణిని రక్షించుకున్నామని.. అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తోందన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ సెకండ్ ఫేజ్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.5 వేల కోట్లతో ప్రతిపాదిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపే రూ.9 వేల కోట్లకు పెంచిందని అంటే సంస్థను తమ అవినీతితో ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో దెబ్బతీయాలని చూస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎక్స్ ప్లోజివ్స్ టెండర్లలోనూ భారీ అక్రమాలకు పాల్పడ్డారని, ఏకంగా టెండర్ ను మూడు రెట్లు పెంచారని తెలిపారు. 130 ఏళ్ల సింగరేణి చరిత్రలోనే ఇంతటి అవినీతిని ఎప్పుడూ చూడలేదన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని సంస్థను ముంచేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకొని తీరుతామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ కోసం పని చేస్తున్నాడని అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్కమాట మాట్లాడటం లేదన్నారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగ నియామకాలు జీఎం స్థాయిలో చేస్తారని.. సీఎం తన పబ్లిసిటీ స్టంట్ కోసం ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ హైదరాబాద్ కు పిలిపించి అపాయింట్ మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న మారు పేర్ల సమస్యను పరిష్కరించి వారికి ఉద్యోగ అవకాశం వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారి తరుపున సింగరేణి జాగృతి ఉద్యమిస్తుందన్నారు. రాజకీయ పార్టీలకు సింగరేణి అంటే తమ ప్రయోజనాలు మాత్రమేనని.. కార్మికులకు ఆ సంస్థే జీవితమని అన్నారు. వారందరి తరుపున తాము పని చేస్తామన్నారు. కార్మికుల కోసం తాను స్వయంగా బొగ్గు గనులు, ఓపెన్ కాస్టుల వరకు వచ్చి కూర్చొంటానని హామీ ఇచ్చారు. ఓపెన్ కాస్టుల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. సింగరేణి జాగృతికి అనుబంధంగా మహిళల విభాగం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

జాగృతి ఏరియా కో ఆర్డినేటర్ల నియామకం

1) బెల్లంపల్లి – కిరణ్ ఓరం

2) శ్రీరాంపూర్ – కుర్మ వికాస్

3) మందమర్రి – ఎస్. భువన్

4) రామగుండం1 – బొగ్గుల సాయికృష్ణ

5) రామగుండం 2 – కె. రత్నాకర్ రెడ్డి

6) రామగుండం 3 – దాసరి మల్లేశ్

7) భూపాలపల్లి – నరేశ్ నేత

8) మణుగూరు – అజ్మీరా అశోక్ కుమార్

9) కొత్తగూడెం – వన్నంరెడ్డి వీర నాగేంద్ర సాగర్

10) కార్పొరేట్ – వసికర్ల కిరణ్ కుమార్

11) ఎస్ టీపీపీ పవర్ ప్లాంట్ – కె. రామ్మోహన్ చారి