ktr - Vishvambhara News

మున్సిపల్ ఫలితాల ప్రభావం అసెంబ్లీపై ఉండదు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఏమాత్రం ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మున్సిపల్ పీఠాల దక్కించుకునే క్రమంలో ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదు ప్రక్రియ అత్యంత కీలకమని, దీనిపై స్పష్టత కోరుతూ ఆయన పార్టీ ముఖ్య నేతలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌లను కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాము 30కి పైగా మున్సిపాలిటీలు గెలుస్తామని అంచనా వేశామని, అయితే ఆ సంఖ్య కొంత మేర తగ్గిందని అంగీకరించారు. అయినప్పటికీ హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కూడా సమీకరణాలు తమకే అనుకూలంగా మారుతాయని, అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు అవసరమైన వ్యూహాలతో తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు
అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై కేటీఆర్ ఘాటుగా స్పందిస్తూ.. ఆ పార్టీకి కూడా ప్రజలు ఆశించిన మేర మున్సిపాలిటీలను అప్పగించలేదని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ ప్రభావం కేవలం కరీంనగర్, నిజామాబాద్ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఆ పార్టీ ఉనికి ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. పొత్తుల విషయానికొస్తే, స్థానిక పరిస్థితులను బట్టే ఎన్నికల పొత్తులు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

కొత్తగూడెంలో సీపీఐతో సఖ్యత
కొత్తగూడెం మున్సిపాలిటీలో తాము సీపీఐకి మద్దతు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందనే బలమైన సందేశం పంపడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ వివరించారు. ఈ ఫలితాలను విశ్లేషించుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి లీగల్ నోటీసు పంపించిన కేటీఆర్
విశ్వంభర ,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు లీగల్ నోటీసు పంపారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన బండి సంజయ్ నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఈ నోటీసును పంపించారు.

బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశ పూరితమైనవని కేటీఆర్ తరపు న్యాయవాదులు నోటీసులో పేర్కొన్నారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజలలో కేటీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని నోటీసులో ఆరోపించారు. కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు అడ్డగోలుగా ప్రాపగండ చేస్తున్న బండి సంజయ్ పదేపదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని న్యాయవాదులు తెలిపారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వలన కేటీఆర్ ప్రతిష్టకు భంగం కలిగిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు ఆ తర్వాత మంత్రిగా కేటీఆర్ అనేక రంగాల్లో అద్భుతమైన సేవలు అందించారని అయితే బండి సంజయ్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలతో తన క్లైంట్ కేటీఆర్ పరువుకి భంగం కలుగుతుందని నోటీసులో పేర్కొన్నారు. మీడియా సమావేశంలో  బండి సంజయ్  చేసిన ఏ వ్యాఖ్యలకు కూడా ఎలాంటి సాక్షాదారాలు లేవని, ఒక పార్లమెంటు సభ్యుడుగా కేంద్ర మంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి మరొక శాసనసభ్యుడు పైన అసత్య పూరిత అడ్డగోలు వ్యాఖ్యలు చేయడానికి లీగల్ నోటీసులు న్యాయవాదులు ప్రస్తావించారు.

బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని, ఇవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారని నోటీసులో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, కేటీఆర్ తరపున బండి సంజయ్‌ కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, కేటీఆర్ మరియు అతని కుటుంబ సభ్యులపై భవిష్యత్తులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని నోటీసులో డిమాండ్ చేశారు. నోటీసు అందిన ఏడు రోజులలోగా ఈ డిమాండ్లను పాటించని పక్షంలో, చట్టపరంగా సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆరోపణల వల్ల కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు.

తొమ్మిదేళ్ల తర్వాత నేను సీఎం అయ్యేందుకు కృషి చేస్తా : జగ్గారెడ్డి
విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. ముఖ్యమంత్రి పదవిపై తన ఆకాంక్షను పరోక్షంగా వెల్లడిస్తూనే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి పదవి గురించి జగ్గారెడ్డి మాట్లాడుతూ, వచ్చే మూడేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత ఐదేళ్ల కాలానికి కూడా ముఖ్యమంత్రి కావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అయితే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత తానూ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆ సమయంలో తన అభ్యర్థిత్వాన్ని ప్రజల ముందు ఉంచుతానని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన అద్భుతంగా సాగుతుందని ఆయన అన్నారు. గతంలో రైతు బంధు వేసేందుకు బీఆర్ఎస్‌ ఐదు నెలల టైం తీసుకునేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేసిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయంలో డబ్బులు అందుబాటులో ఉండి కూడా వేయలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు కడుతూ కూడా రైతు భరోసా వేసిందన్నారు.

మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఫోన్ ట్యాపింగ్‌తోనే నడిచిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు అంతా ఏం చేస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిఘా పెట్టిందని. తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు తనకు చెప్పినట్టు తెలిపారు. కాంగ్రెస్‌ నాయకుల ఫోన్‌లు ట్యాప్‌ చేయడంపైన దృష్టి పెట్టిన బీఆర్ఎస్‌ గత పదేళ్ల రాష్ట్ర పాలనను గాలికొదిలేసిందని విమర్శించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కవిత ప్రతి విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆమె బీఆర్ఎస్‌లో ఉన్నా బయటకు వచ్చినా పెద్ద తేడా ఏమీ ఉండదని అన్నారు. కవిత మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు. సాధారణంగా తండ్రి రాజకీయ వారసత్వం కుమారుడికి వస్తుందని, ఒకవేళ కుమారుడు లేకపోతే కుమార్తెకు అవకాశం దక్కవచ్చని వ్యాఖ్యానించారు.

తాము స్పందించే స్థాయి నాయకురాలు కవిత కాదన్నది తమ అభిప్రాయమని జగ్గారెడ్డి అన్నారు. కవిత ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాన ప్రాధాన్యత కలిగిన నేతలని, వారు రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకుంటే అర్థం ఉంటుందని తెలిపారు.తమ గురించి కవిత అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో కవిత ప్రమేయంపై జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ స్కాంలో పెట్టుబడులు పెట్టడానికి కవితకు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని జగ్గారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

తెలంగాణ రాజకీయ వ్యవస్థలో కేటిఆర్ అజ్ఞాని : మెట్టు సాయి కుమార్
విశ్వంభర,హైదరాబాద్ : రేవంత్ రెడ్డి బిఆర్ఎస్  గురించి పది నిమిషాలు ఆలోచిస్తే ఆ పార్టీలో నలుగురు తప్ప ఎవరూ మిగలరని,  ఫిషేర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్  అన్నారు.గాంధీ భవన్ ఆయన మీడియతో మాట్లాడుతూ, మేము ఇంకా ఏమి అనుకోలేదు, మేము అనుకుంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటదన్నారు.డ్రగ్స్ టెస్టుకు సిద్ధమా అన్న ఛాలెంజ్ కి భయపడ్డ కేటిఆర్ కు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కు  లేదన్నారు.కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అని హెచ్చరించారు. తెలంగాణ రాజకీయ వ్యవస్థలో కేటిఆర్ ఓ అజ్ఞాని అని తెలిపారు.  తెలంగాణలో కేటీఆర్ శకుని పాత్ర పోషిస్తున్నారని మెట్టు సాయి కుమార్ విమర్శించారు .తెలంగాణ సమాజాన్ని పది సంవత్సరాలు కొరివిదయ్యం లాగ పీల్చుకొని తిన్నది మీరు, కాంగ్రెస్ పార్టీ ని దయ్యం అనడం విడ్డురంగా ఉందన్నారు.మీ సోదరి కవిత దయ్యం అనే పదం నీ గురించా,నీ బావ గురించా మీకే తెలియాలన్నారు. రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు మీరు,మీ పార్టీ అదో పాతాళానికి వెళ్లిపోయారన్నారు.మీ తండ్రి చేసిన అరాచకాలు ఇంకా తెలంగాణ ప్రజలు మర్చి పోలేదన్నారు.  కేసీఆర్ యువజన కాంగ్రెస్ నాయకుడిగా గతంలో పనిచేశారని.. ఈ విషయం కేటీఆర్ తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డి కొట్టిన దెబ్బకు బీఆర్ఎస్ అధో పాతాళానికి పోయిందని విమర్శించారు. దివంగత నేత వైఎస్సార్‌ని ఆదర్శంగా తీసుకొని రేవంత్‌రెడ్డి స్వర్ణయుగం లాగా తెలంగాణను పాలిస్తున్నారని ఈ సందర్భముగా మెట్టు సాయి కుమార్ పేర్కొన్నారు.