kcr - Vishvambhara News

నిరూపించే ద‌మ్ముందా? కాంగ్రెస్ కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్
తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కుతోంది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ యువజన సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల హామీలు, నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల భర్తీ, ఉస్మానియా విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు, యూత్ డిక్లరేషన్, రాహుల్ గాంధీ హామీలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ను నిలదీశారు. కేటీఆర్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన బీఆర్ఎస్ యువజన సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సభకు భారీగా తరలివచ్చిన యువత, నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, తెలంగాణ యువతలో అపారమైన శక్తి, ప్రతిభ, పోరాట స్ఫూర్తి ఉందని అన్నారు. యువతకు పొట్ట నిండా ఆకలి మాత్రమే కాదని, భవిష్యత్తును నిర్మించుకోవాలనే తపన ఉందని పేర్కొన్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ లక్ష్యాన్ని సాధించే సత్తా తెలంగాణ యువతకు ఉందని కేటీఆర్ అన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను బీరు, బిర్యానీ బ్యాచ్ అంటూ అవమానించేలా మాట్లాడటం సరైనది కాదని కేటీఆర్ విమర్శించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువని, వేలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం అక్కడ చదువుకుంటున్నారని గుర్తు చేశారు. అలాంటి విద్యార్థులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. యువతను తక్కువ అంచనా వేస్తే అదే యువశక్తి అధికారంలో ఉన్నవారికి గట్టి సమాధానం చెబుతుందని హెచ్చరించారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ "ఓటు కొట్టు.. జాబ్ పట్టు" అంటూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎన్నో హామీలు ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, ఇందుకోసం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పత్రికల మొదటి పేజీల్లో భారీ ప్రకటనలు ఇచ్చి యువతను నమ్మించారని ఆరోపించారు.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించారని కేటీఆర్ విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల మాట పక్కన పెడితే, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో తీవ్ర నిరాశ నెలకొందని, ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితమైందని ఆరోపించారు.

ప్రభుత్వం ఇప్పటివరకు 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతోందని ప్రస్తావించిన కేటీఆర్, ఆ లెక్కల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన నియామకాలనే చేర్చి క్రెడిట్ తీసుకుంటోందని ఆరోపించారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా 70 వేల ఉద్యోగాలు ఇచ్చిందని నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారం చేయడం వల్ల నిజాలు మారవని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను సభలో ప్రదర్శించారు. కేసీఆర్, కేటీఆర్ రెండు ఉద్యోగాలు పోతే మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించిన కేటీఆర్, కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు.

అలాగే 2023 మే 8న సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ విడుదల చేసిన యూత్ డిక్లరేషన్‌ను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఇదే సభా ప్రాంగణంలో నిరుద్యోగ యువతకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఆ సమయంలో చేసిన ప్రకటనలు, వీడియోలను సభలో ప్రదర్శించారు. యూత్ డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీలు అమలు కాలేదని, యువతను మోసం చేశారని ఆరోపించారు.రేవంత్ రెడ్డి మాటలు వింటే సాంప్రదాయిని, సుప్పిని, సుద్దపూసని పాట గుర్తుకు వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదని, మాటే శాశ్వతమని చెప్పే నాయకులు ముందు తమ మాట నిలబెట్టుకోవాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గొప్పలు చెప్పుకోవడం సరికాదని విమర్శించారు.

సరూర్‌నగర్ సభలో కనిపించిన యువత ఉత్సాహం కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక అని కేటీఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో సభకు హాజరుకావడం ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి నిదర్శనమని అన్నారు. ప్రజల్లో మార్పు కోసం ఆలోచన మొదలైందని, ఇక నుంచి రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయని వ్యాఖ్యానించారు.

"ఇప్పటిదాకా ఒక లెక్క... ఇప్పటి నుంచి ఒక లెక్క" అంటూ కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. యువత తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జంగ్ సైరన్ మోగించేందుకు వచ్చిన యువతకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ సభతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కగా, ఉద్యోగాల హామీలు, నిరుద్యోగ సమస్య, ఎన్నికల వాగ్దానాల అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తోంది.

నా రక్తం మరిగిపోతుంది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
విశ్వంభర,హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను తిడుతుంటే కూతురిగా నా రక్తం ఉండుకుతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కసబ్ తో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అలా మాట్లాడితే నా రక్తం మరిగిపోతుందని కవిత అన్నారు.తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా   ఈరోజు మీడియాతో మాట్లాడిన కవిత, బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. "సభకు కేసీఆర్ రావడం తప్పనిసరి. ఆయన రాకపోతే బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాలి. సభకు రాకుండా పిల్ల కాకుల గురించి మాట్లాడుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఒక కూతురిగా నా రక్తం ఉడుకుతోంది" అని కవిత చెప్పారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టిన కేసీఆర్ ను ఉరి తీయాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ... కేసీఆర్ ను ఒకసారి ఉరి తీయాలంటే రేవంత్ రెడ్డిని 10 సార్లు ఉరితీయాలని అన్నారు. సొంత జిల్లా మహబూబ్ నగర్ కు రేవంత్ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారని ప్రశ్నించారు. ఇదే సమయంలో హరీశ్ రావుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే అన్నీ హరీశ్ చూసుకోవడం సరికాదని... కేసీఆర్ సభకు రావాలని వ్యాఖ్యానించారు.

ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ సమావేశం
విశ్వంభర,హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్‌రావుపై కవిత చేసిన తీవ్ర ఆరోపణలు సృష్టించిన రాజకీయ ప్రకంపనల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశీ పర్యటనను ముగించుకుని ఈ ఉదయం నగరానికి చేరుకున్న హరీశ్‌రావు  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం ఆయన నేరుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరి వెళ్లారు.

కవిత ఇటీవల హరీశ్‌రావుతో పాటు ఎంపీ సంతోష్‌రావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్‌లో ఉన్నారని, కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్టీని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో లండన్ పర్యటనలో ఉన్న హరీశ్‌రావు తిరిగి రాగానే ఈ అంశంపై కేసీఆర్‌తో చర్చించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో కేసీఆర్‌కు పూర్తి వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

అయితే, ఈ వివాదంలో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా హరీశ్‌రావుకు మద్దతుగా నిలవడం గమనార్హం. పార్టీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా హరీశ్‌రావుకు బాసటగా పోస్టులు పెట్టడంతో ఈ వ్యవహారంలో కేసీఆర్ మద్దతు ఆయనకే ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య కేసీఆర్, హరీశ్ రావు భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

కాంగ్రెస్ పై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనోడు..
విశ్వంభర,హైదరాబాద్  : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించిన కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీపై ఇలా మాట్లాడటం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని మండిపడ్డారు.శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. "వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మీకు థర్డ్ క్లాస్ పార్టీగా, చిల్లర పార్టీగా కనిపిస్తోందా? ఆ పార్టీ నుంచే రాజకీయాలు నేర్చుకున్న మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాసే కదా?" అని నిలదీశారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాధ్యమైందని స్వయంగా కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన మాటలను కేటీఆర్ మరిచిపోయారా అని ధ్వజమెత్తారు.తెలంగాణ రాకపోయి ఉంటే కేటీఆర్ కుటుంబం పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని జగ్గారెడ్డి హితవు పలికారు. "సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు అమెరికాలో జీతం మీద బతికేవారు. మీ కుటుంబం వేల కోట్లు సంపాదించే అవకాశం ఉండేది కాదు" అని ఘాటుగా విమర్శించారు.

తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు లేనిది, ఇప్పుడు కాంగ్రెస్ చిల్లర పార్టీగా ఎందుకు కనిపిస్తోందని ఆయన ప్రశ్నించారు.పదేళ్లు మంత్రిగా పనిచేసినా కేటీఆర్‌కు రాజకీయ పరిణతి రాలేదని, బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. ఆయన తాత, నానమ్మ బతికి ఉంటే ఇలాంటి మాటలకు చెంప మీద కొట్టేవారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన దీక్ష కూడా నాటకంలో భాగమేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలంటూ కేటీఆర్‌కు ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తారా? అవకాశవాద రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్‌ వైఖరులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎండగట్టారు.తాను సచివాలయంలో సమీక్షలు నిర్వహిస్తే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తాను సమీక్షలు చేస్తానని, వాటిని ఆపేది లేదని స్పష్టం చేశారు. యూరియా ఇవ్వాల్సింది కేంద్రమేనని  మీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నామ్  చేస్తున్నారని అన్నారు . కిషన్ రెడ్డి కేంద్రమంత్రి ఐనా స్క్రిప్ట్ రీడరే అని అన్నారు. వేల కోట్లు రైతులకు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, యూరియా కేంద్రం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వకుండా ఉంటుందా..? అని పేర్కొన్నారు . బిఆర్ఎస్ బీజేపీ నేతల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి జగ్గారెడ్డి పేర్కొన్నారు .సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రైతులకు యూరియా అందించే పనిలోనే ఉన్నారని కేంద్రం దగ్గర తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని రైతులు గమనించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేసారు .

కేటీఆర్ మీ ఫ్యామిలీనే ఒక 420.. మమ్మల్ని 420 అంటారా..? : జగ్గారెడ్డి
విశ్వంభర, హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తమ సుదీర్ఘ రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో అని, ఆయన ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చర్చకు పిలిచే స్థాయి కేటీఆర్‌కు లేదని అన్నారు.మంగళవారం గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నించారు. మేమంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి క్షేత్రస్థాయి నుంచి నాయకులుగా ఎదిగాం. కేటీఆర్ తన తండ్రి సీటిస్తే నేరుగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయనెప్పుడైనా సర్పంచ్‌గా గెలిచారా? జడ్పీటీసీగా గెలిచారా? రాజకీయాల్లోని కష్టనష్టాలు, ఒడిదుడుకులు ఆయనకు ఎలా తెలుస్తాయి?" అని జగ్గారెడ్డి నిలదీశారు.అమెరికా లో చదువుకొని వచ్చిన నీకు ఎమ్మెల్యే లు అసెంబ్లీ లో చర్చ చేస్తారా,రోడ్ల మీద చేస్తారా అన్న జ్ఞానం కూడా లేదా అని ప్రశ్నించారు.

మీ నాయన కేసీఆర్ చర్చ కు సవాలు చేస్తే, సీఎం రేవంత్ రెడ్డి వస్తారు, అవసరం అయితే నేను సీఎం ను ఒప్పించేందుకు ట్రై చేస్తానన్నారు. లేదంటే కేటీఆర్, హరీష్ లు సవాలు చేస్తే నేను రావడానికి ఎక్కడికైనా మీతో చర్చించేందుకు సిద్ధం అన్నారు. కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని, కాంగ్రెస్ నేతలను "గాడిదలు" అంటూ విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. "మీరు మమ్మల్ని ఒక మాట అంటే మేము పది మాటలు అంటాం. మీరు ముఖ్యమంత్రిని దూషించడం ఆపేస్తే, మేము కూడా ప్రతి విమర్శలు ఆపేస్తాం" అని స్పష్టం చేశారు.

18 నెలలు అధికారం లేకపోయేసరికి కేటీఆర్ గట్టున పడ్డ చేపలా కొట్టుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. సోదరి కవిత అరెస్టు వ్యవహారంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, అందుకే తరచూ విదేశీ పర్యటనలకు వెళుతున్నారని ఆరోపించారు. అందరికీ వడదెబ్బ తగిలితే కేటీఆర్ కి సిస్టర్, బ్రదరిన్ల స్ట్రోక్ తగిలిందని అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు.కాంగ్రెస్‌ను విమర్శించే ముందు కేటీఆర్ బాగా అధ్యయనం చేయాలని జగ్గారెడ్డి సూచించారు.సీఎం రేవంత్ రెడ్డి ని గోకుడు ఎందుకు మళ్ళీ ఆయనతో తన్నించుకోవడం ఎందుకని అన్నారు.

పుత్రోత్సాహంలో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత
విశ్వంభర , హైద‌రాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ పుత్రోత్స‌వం వ్య‌క్తప‌ర్చారు. ఎమ్మెల్సీ క‌విత పెద్ద కుమారుడు ఆదిత్యా అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యురేష‌న్ ప‌ట్టాను అందుకున్నారు.  యూనివ‌ర్సిటీలో జ‌రిగిన గ్రాడ్యుయేష‌న్ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత‌, అనీల్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు.

గ్రాడ్యురేష‌న్ కు సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసి ఎమ్మెల్సీ క‌విత త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. "ఆదిత్యా, నీ చిట్టి చేతిని పట్టుకోవడం నుండి నువ్వు డిగ్రీ పట్టుకోవడం వరకు చూశాను. ఎంత గొప్ప ప్రయాణం అది. నువ్వు చాలా క‌ష్ట‌ప‌డ్డావు. ఎంతో ఎదిగావు. మేమంద‌రం గ‌ర్వ‌ప‌డేలా చేశావు"  అని ఎక్స్ లో పేర్కొన్నారు. ఒక త‌ల్లిగా ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నానని సంతోషం వ్య‌క్తం చేశారు.

కాగా, ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏడు రోజుల పాటు అమెరికా పర్యటనకు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీన ఎమ్మెల్సీ కవిత తిరిగి హైదరాబాద్ చేరుకొనున్నారు

హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం
విశ్వంభర , హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో బిఆర్ఎస్  అధినేత కేసిఆర్  అధ్యక్షతన, హైదరాబాద్,సన్నాహక  సమావేశం జరిగింది.శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో సహా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబిత ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు షంభీపూర్ రాజు, నవీన్ రావు, వాణి దేవి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే లు, మాధవరం కృష్ణ రావు, మాగంటి గోపీనాథ్,  బండారి లక్ష్మా రెడ్డి, డి. సుధీర్ రెడ్డి,  ముఠా గోపాల్,  మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేష్,మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు, కొప్పుల మహేష్ రెడ్డి, డా. మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పటోళ్ల కార్తీక్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి, జయసింహ ,మాజీ చైర్మన్ మన్నె కృశాంక్, మాజీ చైర్మన్ గజ్జెల నగేష్, కుమారి నివేదిత సాయన్న, పంజుగుల శ్రీశైల్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, పార్టీ నేత కల్వకుంట్ల వంశీధర్ రావు... తదితరులు పాల్గొన్నారు.