cm revanth reddy - Vishvambhara News

గ్రీన్ ఎనర్జీయే భవిష్యత్ కరెన్సీ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: గ్రీన్ ఎనర్జీ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, అది భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘క్లైమేట్ వీక్’ సదస్సులో ఆయన పాల్గొని 'గ్రీన్ తెలంగాణ' రోడ్ మ్యాప్‌ను ప్రపంచ వేదికపై ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న 30 లక్షల పంప్‌సెట్లు, 50 లక్షల గృహాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాలను బొగ్గు వంటి సాంప్రదాయ వనరుల నుంచి కాకుండా సోలార్, గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లించడమే తన ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పాదక వనరులే ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా అసలైన బలం అని, ఆ దిశగా తెలంగాణ అడుగులు వేస్తోందని పునరుద్ఘాటించారు.

హైదరాబాద్‌కు సరికొత్త గుర్తింపు.. 2034 లక్ష్యం
భారతదేశంలోనే కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి నగరంగా హైదరాబాద్‌ను నిలబెడతామని ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు. 2034 నాటికి నగరాన్ని 'నెట్-జీరో' (కర్బన ఉద్గారాలు లేని) నగరంగా మార్చడమే తమ సంకల్పమని తెలిపారు. ఇందులో భాగంగా 'కోర్ అర్బన్ రీజియన్' (CURE)లో రాబోయే ఐదేళ్లలో ఎటువంటి కాలుష్య కారక పరిశ్రమలు ఉండవని, వాటిని పెరి-అర్బన్ జోన్లకు తరలిస్తామని వెల్లడించారు. 1991లో మొదలైన ఎల్‌పీజీ సంస్కరణల వల్ల భారత్ సేవా రంగంలో గ్లోబల్ హబ్‌గా ఎదిగిందని, అయితే తయారీ రంగంలో వెనుకబడిన లోటును ఇప్పుడు భర్తీ చేస్తామని చెప్పారు. ప్రపంచ పెట్టుబడిదారులు చైనాకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న తరుణంలో, తెలంగాణను 'చైనా +1' తయారీ కేంద్రంగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఆర్థిక వృద్ధికి మూడు స్తంభాలు
తెలంగాణ జీడీపీని ప్రస్తుతమున్న 200 బిలియన్ డాలర్ల నుంచి 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు, స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి (2047) 3 ట్రిలియన్ డాలర్లకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నట్లు వివరించారు. CURE: ఐటీ, సర్వీస్ మరియు క్లీన్ టెక్నాలజీ హబ్, PURE: ఉత్పత్తి మరియు తయారీ రంగాల కేంద్రం, RARE: వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ, గ్రామీణ పరిశ్రమలు, ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్య ప్రాంతాన్ని ప్రధాన తయారీ జోన్‌గా అభివృద్ధి చేస్తామని, దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణలో కఠినం.. హైడ్రా ఏర్పాటు
కేవలం పారిశ్రామిక వృద్ధే కాకుండా, సహజ వనరుల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుకోసమే 'హైడ్రా' పేరిట ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేశామని, చెరువులు, కుంటల ఆక్రమణలను తొలగించి వాతావరణ సమతుల్యతను కాపాడతామని తెలిపారు. మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టు ద్వారా నగరానికి కొత్త రూపునిస్తామని, వాటర్ గ్రిడ్ ద్వారా వనరుల నిర్వహణ చేపడతామని వివరించారు. రవాణా రంగంలో మార్పు కోసం 3,500 ఎలక్ట్రిక్ బస్సులు, 2 లక్షల ఆటోలను పర్యావరణ హితంగా మార్చడం, మెట్రోను 200 కిలోమీటర్లకు విస్తరించడం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

రైతు భరోసాపై కీలక ప్రకటన
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా గూడూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే రైతు భరోసా నిధులను నేరుగా అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. వరి ఉత్పత్తిలో ఆసియాలోనే మిర్యాలగూడ అగ్రస్థానంలో ఉండటం గర్వకారణమని కొనియాడారు. రైతు సంక్షేమం కోసం ఇప్పటి వరకు మొత్తం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. సన్నబియ్యం పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేశామని సీఎం గుర్తు చేశారు. తాము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పాలకులు వరి వేస్తే ఉరి అన్నచోట, క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. 3.17 కోట్ల మంది నిరుపేదలకు 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేదల ఇళ్లకు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
విశ్వంభర, తెలంగాణ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌ను కలిసి రేవంత్ రెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు తలెత్తేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, తక్షణమే సీఎంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం దుర్మార్గమన్నారు. ఖమ్మంలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్, చంద్రబాబు అనుచరులు ఏకమై బీఆర్ఎస్‌ను అంతం చేయాలని అనడం, తెలంగాణ గడ్డపై బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేయాలని, ఎక్కడికక్కడ ఆ పార్టీ దిమ్మెలను కూల్చివేయాలనే చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సీఎం Vs ఒరిజినల్ కాంగ్రెస్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనుల టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్, బీజేపీల వైఖరిపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నైనీ బ్లాక్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి, ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఈ టెండర్లు సాగుతున్నాయని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు.

ఆరు గ్యారంటీలు గాలికొదిలేశారు..
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం పక్కన పెట్టిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు కేవలం కమీషన్లు, వాటాల కోసమే కొట్టుకుంటున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల టెండర్లు, గనుల కేటాయింపుల్లో వాటాల కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదిరిన అంతర్గత పోరు..
రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ముదిరిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. "రాష్ట్రంలో ఇప్పుడు అవుట్ సోర్సింగ్ సీఎంకు, అసలైన కాంగ్రెస్ వాదులకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది" అని ఆయన ఆరోపించారు. పాలనపై పట్టు కోల్పోయి, గ్రూపు రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. పారదర్శకత లేని టెండర్లను వెంటనే రద్దు చేయాలని, గనుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు తలమానికమైన సింగరేణిని కాపాడాలని అన్నారు.

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి సందడి
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర ప్రాంగణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా ఆదివాసీలు డప్పు చప్పుళ్లు, నృత్యాలతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్లకు పట్టువస్త్రాలు, పూలు, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల ప్రభుత్వం సుమారు రూ. 101 కోట్ల వ్యయంతో చేపట్టిన సమ్మక్క-సారలమ్మ గద్దెల ఆధునీకరణ పనులను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా గద్దెల ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన తీరును ఆయన పరిశీలించారు.

మనవడితో కలిసి తులాభారం..
వనదేవతల గద్దెల వద్ద సీఎం తొలి మొక్కు సమర్పించారు. ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సీఎం తన మనవడు రేయాన్ష్‌ తో కలిసి తులాభారం తూగడం. మొక్కులో భాగంగా దేవతలకు తన బరువుకు సమానమైన 68 కిలోల బెల్లాన్ని (బంగారం) అమ్మవార్లకు సమర్పించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వనదేవతలను వేడుకున్నట్లు సీఎం తెలిపారు. మేడారం జాతరను కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిరిజనుల ఆచారాలకు భంగం కలగకుండా అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాంమని రేవంత్ రెడ్డి తెలిపారు.

విదేశీ పర్యటనకు సీఎం..
మేడారం పర్యటన ముగిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా విదేశీ పర్యటనకు బయలుదేరారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొని, రాష్ట్రానికి పెట్టుబడుల సేకరణే ధ్యేయంగా ఆయన అక్కడ పర్యటించనున్నారు. సీఎం పర్యటన ముగిసిన వెంటనే సాధారణ భక్తులను వనదేవతల దర్శనానికి అధికారులు అనుమతించారు.

మంత్రులపై తప్పుడు రాతలు రాస్తే ఖబర్దార్‌..!
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో మీడియా కథనాలు ఇప్పుడు పెను సంచలనానికి దారితీస్తున్నాయి. గత కొద్దిరోజులుగా మంత్రుల వ్యక్తిగత, శాఖాపరమైన అంశాలపై వెలువడుతున్న కథనాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా మీడియా తీరుపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై సీరియస్ అయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ''రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజం. మీ మధ్య ఏవైనా పంచాయితీలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోండి. కానీ, ప్రజాప్రతినిధులపై, మంత్రులపై తప్పుడు వార్తలు రాసి బద్నామ్ చేయాలని చూస్తే సహించేది లేదు. ఆధారాలు లేకుండా కథనాలు అల్లితే ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది." అంటూ హెచ్చరించారు.

రాజకీయ దుమారం
రాష్ట్ర కేబినెట్‌లోని కీలక మంత్రులను టార్గెట్ చేస్తూ వస్తున్న వరుస కథనాలు సచివాలయ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఒక ఐఏఎస్ అధికారిణికి ముడిపెడుతూ ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం పెను దుమారం రేపింది. దీనిపై మంత్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లక్ష్యంగా బొగ్గు గనుల వ్యవహారంలో అవినీతి జరిగిందనే కోణంలో కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మీడియా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామనే సంకేతాలను సీఎం పంపినట్లు తెలుస్తోంది.

అది కట్టుకథ: భట్టి
తనపై వస్తున్న ఆరోపణలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూర్తిగా కొట్టిపారేశారు. ఒక పత్రిక తనపై రాసిన వార్త కేవలం ఊహాజనితమని, అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ కట్టుకథలు అల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పత్రికా యాజమాన్యంతో ఈ విషయంపై తానే స్వయంగా తేల్చుకుంటానని, చట్టపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. ప్రభుత్వంలోని కీలక నేతలు వరుసగా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

చదువే పేదల తలరాతను మారుస్తుంది: రేవంత్ రెడ్డి
విశ్వంభర తెలంగాణ బ్యూరో: "సమాజంలో ఏ సమస్యకైనా విద్యే సరైన పరిష్కారం చూపుతుంది. చదువు వల్లనే అవకాశాలు మెరుగుపడతాయి, భవిష్యత్ నిర్మించబడుతుంది" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఈ మేరకు జడ్చర్ల మండలం చిట్టెబోయినపల్లిలో ఏర్పాటు చేయనున్న మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీ (IIIT) క్యాంపస్ నిర్మాణానికి శనివారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

రాజకీయ ప్రస్థానంపై స్ఫూర్తిదాయక ప్రసంగం

ముఖ్యమంత్రి తన రాజకీయ ప్రయాణాన్ని విద్యార్థులతో పంచుకుంటూ.. "నేను అచ్చంపేట నియోజకవర్గంలోని ఒక మారుమూల పల్లె నుంచి వచ్చాను. పట్టుదలతో కష్టపడి పనిచేయడం వల్లే రాజకీయాల్లోకి వచ్చిన 17 ఏళ్లలోనే ముఖ్యమంత్రిని కాగలిగాను. కనీసం మంత్రిగా కూడా పని చేయకుండానే మీ అందరి సహకారంతో ఈ స్థాయికి చేరుకున్నాను" అని పేర్కొన్నారు. విద్యార్థులు భాషను మెరుగుపరుచుకోవాలని, తాజా పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు.

విద్యకు ‘ప్రజా ప్రభుత్వం’ అగ్రతాంబూలం

పూర్వం పేదలకు పంచడానికి భూములు ఉండేవి. కానీ ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కూడా భూమి లేని పరిస్థితి నెలకొంది. అందుకే పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక్కటే మార్గమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని, సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.

జిల్లాపై ప్రత్యేక మమకారం
బూర్గుల రామకృష్ణారావు తర్వాత దాదాపు 75 ఏళ్లకు మహబూబ్‌నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాను విద్యా, ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. "ఈ ఏడాదిలోనే IIIT భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. నిబద్ధత లేని చదువు జీవితానికి ఉపయోగపడదు. సమాజంలో గౌరవం పెరగాలంటే విద్యతో పాటు తల్లిదండ్రులను గౌరవించే సంస్కారం ఉండాలి" అని ఆయన హితబోధ చేశారు.

హైదరాబాద్‌ వేదికగా మరో అంతర్జాతీయ క్రీడా సంబరం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: భాగ్యనగరం మరో అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదిక కానుంది. మహిళల హాకీ వరల్డ్‌ కప్‌ క్వాలిఫయింగ్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని హైదరాబాద్ దక్కించుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు తయ్యబ్‌ ఇక్రామ్‌ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టోర్నీ నిర్వహణ, వసతులు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత హాకీ సమాఖ్య (హెచ్‌ఐ) అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌ తిర్కీ, భోలానాథ్‌ సింగ్‌తో పాటు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సలహాదారు జితేందర్‌ రెడ్డి, క్రీడా కార్యదర్శి జయేశ్‌ రంజన్, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ సోనీబాలాదేవి, తదితరులు పాల్గొన్నారు.

క్రీడా హబ్‌గా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి హాకీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని చెప్పారు. ఈ టోర్నీ నిర్వహించడం ద్వారా మున్ముందు నగరాన్ని అత్యుత్తమ స్థాయి క్రీడా కేంద్రంగా మార్చే క్రమంలో ఇది మరో ముందడుగు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

టోర్నీ విశేషాలివే
మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగే క్వాలిఫయింగ్‌ టోర్నీని హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తారు. మార్చి 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. ఇందులో భారత్‌తో పాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆస్ట్రియా మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. ఈ టోర్నీలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా మహిళల హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. సొంతగడ్డపై భారత మహిళల జట్టు సత్తా చాటి వరల్డ్ కప్ బెర్తును ఖాయం చేసుకోవాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. ఈ టోర్నీ కోసం గచ్చిబౌలిలోని హాకీ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయనున్నారు.

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ ప్రకటన
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఏను 30.03 శాతం నుంచి 33.67 శాతానికి పెంచుతూ సంబంధిత ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరనుంది.

జూలై 1వ తేదీ నుంచి అమలు
ఈ డీఏ పెంపు 2023 జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులు, యూనివర్సిటీ టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్‌కు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. పెరిగిన డీఏను ఈ జనవరి జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లించనున్నారు. జూలై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు ఉన్న బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ (GPF) ఖాతాల్లో జమ చేయనున్నారు. పదవీ విరమణ పొందిన వారికి బకాయిలను 30 విడతల్లో చెల్లించనున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.227 కోట్ల అదనపు భారం పడనుంది.

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రభుత్వం తరపున రూ.1 కోటి ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పదవీ విరమణ పొందే వారికి అందాల్సిన ఇతర ప్రయోజనాలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పార్ట్ టైం అసిస్టెంట్లు, వీఆర్ఏలకు నెలకు రూ.100 అదనంగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన
కాగా, జీవో విడుదలకు ముందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. "ఉద్యోగుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీ దగ్గరకు రావడానికి ముందే డీఏ ఫైలుపై సంతకం చేసి వచ్చాను. దీనికి సంబంధించిన జీవో అధికారికంగా వెలువడుతుంది" అని  సీఎం ప్రకటించారు. పండుగ పూట ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సచివాలయం నుంచి జిల్లాల స్థాయి వరకు ఉద్యోగ సంఘాలు సంబరాలు జరుపుకుంటున్నాయి.

చలాన్ పడితే అకౌంట్‌లో డబ్బులు కట్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహన యజమాని బ్యాంకు ఖాతా నుంచి నేరుగా డబ్బులు కట్ అయ్యేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ స్టేడియంలో నిర్వహించిన ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక ప్రమాదం, ప్రతి మూడు నిమిషాలకు ఒక మరణం సంభవిస్తుండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం, డ్రంగ్ అండ్ డ్రైవ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఇలాంటివారిపై కఠినంగా వ్యవహరించి నివారించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని సూచించారు.

వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంకు ఖాతాను లింక్ చేయాలని, దీనికోసం బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. చలాన్లపై రాయితీలు ఇస్తారనే ధీమాతో వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తున్నారని.. ఇకపై చలాన్లపై ఎలాంటి డిస్కౌంట్లు ఉండవని స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే, వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. రోడ్డు ప్రమాద మరణాలను కేవలం ప్రమాదాలుగా చూడలేమని, అవి మనుషుల తప్పిదాల వల్ల జరుగుతున్న 'హత్యలే' అని సీఎం వ్యాఖ్యానించారు. శాంతిభద్రతల సమస్య కంటే ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలే పెద్ద సవాల్‌గా మారాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల విషయంలో రవాణా శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో పని చేయాలని సీఎం సూచించారు. చాలా సందర్బాల్లో మనకు సంబంధం లేకపోయినా ఎదుటివారి తప్పు వల్ల మనకు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.

వ్యవస్థలో భారీ మార్పులు
ట్రాఫిక్ విభాగంపై పోలీసుల్లో ఉన్న చిన్నచూపును పోగొట్టేందుకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు సేఫ్టీ అథారిటీలో పోస్టింగ్ అంటే 'పనిష్మెంట్' అనే భావన పోవాలని, ఇకపై రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ విభాగాల్లో డీజీ, అడిషనల్ డీజీ క్యాడర్ అధికారులను నియమిస్తామని ప్రకటించారు. హైడ్రా, సైబర్ క్రైమ్ విభాగాల తరహాలోనే ట్రాఫిక్ విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రమాదం ఉండేదని.. కానీ, ఇప్పుడు మర్డర్ కంటే రోడ్డు ప్రమాదాలు డేంజర్‌గా మారాయని పేర్కొన్నారు.  ప్రస్తుతమున్న రవాణా విధివిధానాలను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. రోడ్డు భద్రతపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

అమ్మానాన్నలను కాదంటే జీతంలో కోత
విశ్వంభర, బ్యూరో: అమ్మానాన్నలను కాదనుకుని, వృద్ధాప్యంలో వారిని కంటికి రెప్పలా చూసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తమ రక్తాన్ని చెమటగా మార్చి పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అటువంటి ఉద్యోగుల నెలవారీ వేతనం నుంచి 10 నుంచి 15 శాతం మొత్తాన్ని కోత విధించి, నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు.

హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో కొత్తగా ఎంపికైన గ్రూప్-2 అధికారులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి నెల ఒకటో తేదీన జీతం ఎలా పడుతుందో, వారి తల్లిదండ్రులకు కూడా అదే రోజున నిర్ణీత మొత్తం (10-15%) వారి ఖాతాల్లో జమైపోతుందన్నారు. ఈ చట్టానికి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలను రూపొందించే బాధ్యతను కొత్తగా విధుల్లో చేరుతున్న అధికారులకే అప్పగిస్తున్నట్లు సీఎం తెలిపారు. దీనిపై తక్షణమే కసరత్తు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

కొడుకైనా, కూతురైనా బాధ్యత తప్పదు..

తల్లిదండ్రుల పట్ల బాధ్యత కేవలం కుమారులకే కాదని, కుమార్తెలకు కూడా ఉంటుందని సీఎం గుర్తుచేశారు. "పెళ్లయ్యాక ఆడపిల్లలకు అత్తగారి ఇల్లు ఎంత ముఖ్యమో, పుట్టినిల్లు కూడా అంతే ముఖ్యం. కొడుకులకు కట్నాలు, కార్లు రావచ్చు.. కానీ కన్నవారిని రోడ్డున పడేయడం క్షమార్హం కాదు" అని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. తాము కేవలం శిక్షించడం కోసం కాకుండా, సమాజంలో నైతిక విలువలను కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మీరు ఈ రోజు అధికారి కుర్చీలో కూర్చున్నారంటే దానికి కారణం మీ తల్లిదండ్రుల త్యాగమేనని, ఆ వేళ్లను మరిచిపోవద్దని.. మీ దగ్గరకు వచ్చే పేద ప్రజల్లోనూ మీ తల్లిదండ్రులను చూసుకోవాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన శశిధర్ రెడ్డి
విశ్వంభర,హైదరాబాద్ : చైతన్యపురి డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్  కార్పొరేటర్ సీనియర్ నాయకులు కె. శశిధర్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తిరుమలలో సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన శశిధర్ రెడ్డి సిఎం కు వారి  కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి,నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.‌ ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ కు చెందిన శశిధర్ రెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి స్వామి వారి దర్శనానికి వెళ్లారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కూడా మంగళవారంస్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన శశిధర్ రెడ్డి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపి సిఎం ఆశీస్సులు తీసుకున్నారు.