sangareddy - Vishvambhara News

ఇఫ్తార్ విందు ల్లో పాల్గొన్న టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
విశ్వంభర,సంగారెడ్డి :  సంగారెడ్డి నియోజకవర్గం లో జరిగిన పలు ఇఫ్తార్ విందుల్లో టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. కొండాపూర్ మండలం మల్కా పూర్ లో జరిగిన ప్రభుత్వ ఇఫ్తార్ విందు లో నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మల్కా పూర్ సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ ప్రవీణ్ లతో పాటు సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  సంగారెడ్డి పట్టణంలోని 11వ వార్డు మసీదు వద్ద మాజీ వార్డు కౌన్సిలర్ గడ్డం సరిత–తులసి రామ్ ఆధ్వర్యంలో దావత్–ఇ–ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి స్థానిక ముస్లిం సోదరులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉపవాస విరమణ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటీజీఐఐసి చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం సోదరభావం, సహనం, పరస్పర గౌరవం, సేవా భావాన్ని పెంపొందించే పవిత్ర కాలమని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సఖ్యతతో జీవించాలనే సందేశాన్ని రంజాన్ పండుగ ఇస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ షఫీ, జైపాల్ రెడ్డి, స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు, యువకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కదిలిన జగ్గారెడ్డి కుటుంబం
విశ్వంభర్, సంగారెడ్డి:- ఎన్నికలకు కొన్ని రోజులే మిగిలి ఉండటంతో సంగారెడ్డి, సదాశివపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రచార వేగాన్ని పెంచింది. జగ్గారెడ్డి కూతురు జయాచైతన్య రెడ్డి, సంగారెడ్డి డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలో ఇంటింటి ప్రచారం లో పాల్గొన్నారు.  జయాచైతన్య రెడ్డి సంగారెడ్డి పట్టణంలోని 21,19,29,8,27 వ వార్డులలో ప్రచారం నిర్వహించారు.

ఇల్లుల్లు తిరుగుతూ, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జయాచైతన్య రెడ్డి అందరినీ ఆకర్షించారు.

ప్రచారం సందర్భంగా  జయారెడ్డికి ప్రజలు తమ సమస్యలను వివరించారు. మీకు జగ్గారెడ్డి ఉన్నారు, ధైర్యంగా ఉండండి అంటూ ప్రజలకు భరోసా కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, సంగారెడ్డి పట్టణం అభివృద్ధిలో ముందుకు సాగాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణం లోని 24,25,26,05,38 వ వార్డులలో ఇంటిటి ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ లోని 38 వార్డులలో అన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని,  జగ్గారెడ్డి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి పట్టణానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి సంగారెడ్డి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు.

సదాశివపేట లో జగ్గారెడ్డి సుడిగాలి పర్యటన..

సదాశివపేటలో టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. సదాశివపేట శంభు లింగేశ్వర ఆలయం    మొదలుకుని దుర్గమ్మ గుడి, గాంధీ చౌక్, శాస్త్రి రోడ్, బస్టాండ్, సుభాష్  రోడ్, తిలక్ రోడ్ గుండా పాదయాత్రగా తిరుగుతూ సందడి చేశారు. వ్యాపారులను,ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు.
గాంధీ చౌక్ లో ఒక దుకాణంలో కూర్చుని  కాంగ్రెస్ నాయకులు, పట్టణ ప్రజలతో సమావేశం అయ్యారు. చాయ్ తాగుతూ కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులకు పలు సూచనలు చేశారు. సదాశివపేట పట్టణంలోని 26 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.

పండుగట పూట 'చైనా మాంజా' మృత్యుపాశం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: పండుగ పూట సరదాగా సాగే గాలిపటాల ఆట ఒక కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. నిషేధిత చైనా మాంజా ప్రాణాంతకమని తెలిసినా.. కొందరి నిర్లక్ష్యం కారణంగా ఒక సామాన్య కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌పై వెళ్తుండగా మెడకు మాంజా చుట్టుకుని, గొంతు తెగి అక్కడికక్కడే మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవిదేశ్ (35) ఉపాధి నిమిత్తం సంగారెడ్డిలో నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం తన బైక్‌పై పని నిమిత్తం వెళ్తుండగా, ఫసల్వాది గ్రామ సమీపంలో గాలిపటం తెగి కిందకు వేలాడుతున్న చైనా మాంజా అతడికి అడ్డుపడింది. అవిదేశ్ బైక్‌పై వేగంగా వెళ్తుండటంతో, గాలిలో ఉన్న మాంజాను గమనించలేకపోయాడు. ఒక్కసారిగా ఆ దారం అతడి మెడకు చుట్టుకుంది. నైలాన్‌తో తయారైన ఆ మాంజా అవిదేశ్ మెడకు చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై, బైక్ పైనుంచి కిందపడిపోయిన ఆయన నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు.

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి ఒక్కసారిగా గొంతు తెగి పడిపోవడం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ప్రాంతంలో నిషేధిత మాంజా వాడుతున్న వారిపై ఆరా తీస్తున్నారు. చైనా మాంజా వాడకం, విక్రయాలపై కఠిన నిషేధం ఉందని పోలీసులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి,టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పినా వినను : జగ్గారెడ్డి
విశ్వంభర,సంగారెడ్డి : సంగారెడ్డిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. తన స్థానంలో భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేయనున్నారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పినా కూడా తాను మళ్లీ పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు.

సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని ఓడించినా ఇంట్లో కూర్చోను. పదేళ్లుగా అధికారం లేకున్నా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ జెండా మోసిన వారినే అభ్యర్థులుగా నిలబెట్టాం” అని జగ్గారెడ్డి గుర్తుచేశారు. నియోజకవర్గంలోని అన్ని సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపడాలని, ప్రజల్లో మంచి పేరు ఉన్న వారే గెలవాలని ఆయన సూచించారు. సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని, గ్రామాల్లో మాట్లాడుకుని నాయకులు, కార్యకర్తలే అభ్యర్థులను తుది నిర్ణయానికి రావాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము చేర్చుకోబోమని స్పష్టం చేశారు.

మందు గంజాయి తాగొద్దు.. తల్లి దండ్రులకు గుండె కోత కానివ్వద్దు..
విశ్వంభర , హైదరాబాద్ :సంగారెడ్డిలో ఆదివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించిన బోనాల జాతరలో యువతకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి హితబోధ చేశారు. గంజాయి తాగితే నరాలు పనిచేయవని, ఎందుకు పనికిరాకుండా పోతారని సూచించారు. మద్యానికి కూడా దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులను బాధపెట్టకుండా మంచి భవిష్యత్తు కోసం యువత శ్రమించాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. గంజాయితోపాటు మత్తుపదార్థాల జోలికి వెళ్లి తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చవద్దని కోరారు.తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని పదేపదే సూచించారు. జగ్గారెడ్డి సందేశాన్ని యువత ఆసక్తిగా విన్నారు. అంతకుముందు సంగారెడ్డి రాంనగర్‌లోని తన ఇంటి నుంచి బోనంతో జగ్గారెడ్డి బయల్దేరారు. తన సతీమణి టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి, శివశక్తి నిషా క్రాంతి బోనాలు ఎత్తుకున్నారు. ఈ ఊరేగింపులో పోతరాజు నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య జగ్గారెడ్డి స్టెప్పులు వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు బాగా కురుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

ఎనభై ఫీట్లుగా అల్విన్ బైపాస్‌ రోడ్డు విస్తరణ
విశ్వంభర,సంగారెడ్డి : ఎనభై ఫీట్లుగా సంగారెడ్డి పట్టణంలోని అల్విన్‌ బైపాస్‌రోడ్డును విస్తరించడానికి రూ.12 కోట్లను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విడుదల చేయించారు. ఐబీ గెస్ట్‌హౌజ్‌ నుండి నేషనల్‌ హైవే సమీపంలోని గుర్రపు బొమ్మ వరకు 2.5 కిలోమీటర్లు ఈ రహదారిని విస్తరించే క్రమంలో మంగళవారం జగ్గారెడ్డి సమీక్షించారు. మున్సిపల్‌, ఆర్‌అండ్‌బి, ఎలక్ర్టిసిటీ, హెచ్‌ఎండీఏ అధికారులతో కలిసి బైపాస్‌ రోడ్డులో పర్యటించారు. రోడ్డు మధ్యలో సింగిల్‌ స్టోన్‌తో డివైడర్‌ ఏర్పాటు చేయాలని, ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. రహదారి విస్తరణలో భాగంగా డబ్బాలను తాత్కాలికంగా తొలగించి, పనులు పూర్తికాగానే అదే చోట మళ్లీ డబ్బాలు ఏర్పాటు చేయించాలని సూచించారు. 2.5కి.మీలు జగ్గారెడ్డి పాదయాత్ర చేస్తూ వ్యాపారులు, ప్రజల సలహాలు స్వీకరించారు. రహదారి విస్తరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పారు. కాగా ఐబీగెస్ట్‌ నుండి గుర్రపు బొమ్మ వరకు ఆరుచోట్ల జంక్షన్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. బసవేశ్వర, శివాజీ, అంబేద్కర్‌, మహాత్మగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, రాజీవ్‌గాంధీల పేరిట ఈ జంక్షన్లు ఉండాలని జగ్గారెడ్డి తెలిపారు .