Minister - Vishvambhara News

రెండేళ్లలో 'స్మార్ట్ సిటీ'గా నల్లగొండ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: నల్లగొండ పట్టణాన్ని రాబోయే రెండేళ్లలో అద్భుతమైన స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది, అసలైన అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే పదేళ్లలో నల్లగొండను ఒక భారీ పారిశ్రామిక కేంద్రంగా మారుస్తానని ప్రకటించారు. కేవలం భౌతిక అభివృద్ధి మాత్రమే కాకుండా, పట్టణంలో శాంతి సామరస్యాలను నెలకొల్పడమే తన ప్రథమ లక్ష్యమని, గంజాయి సంస్కృతిని, రౌడీయిజం వంటి అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి హెచ్చరించారు.

శరవేగంగా మౌలిక సదుపాయాల కల్పన
పట్టణ అభివృద్ధి కోసం చేపట్టిన భారీ ప్రాజెక్టుల వివరాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. రూ.900 కోట్లతో నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని, ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతమిచ్చేలా లతీఫ్ సాబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్టలకు ఘాట్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్న లో-వోల్టేజ్ ఇబ్బందులను తొలగించేందుకు 8 సబ్ స్టేషన్ల నిర్మాణం, పాత లైన్ల మార్పిడి జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలకు 24 గంటల పాటు స్వచ్ఛమైన నీటిని అందించేలా కొత్త ట్యాంకులు నిర్మిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను 'బొట్టు గూడా' పాఠశాల తరహాలో కార్పొరేట్ స్థాయిలో మారుస్తున్నామని వివరించారు. ఇప్పటికే రూ.84 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం, రూ.20 కోట్లతో న్యాక్ (NAC) భవన పనులు పూర్తయినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు
మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. శానిటేషన్, పార్కుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, మేయర్ నుండి కార్పొరేటర్ల వరకు అందరూ తమ డివిజన్లలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల నాణ్యతను పరిశీలించేందుకు తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని స్పష్టం చేశారు. పద్మావతి కాలనీ, శివాజీ నగర్‌లలో రూ.1.30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పార్కులకు ఆయన భూమి పూజ చేశారు. అలాగే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయని, బ్రాహ్మణవెల్లంల ద్వారా సాగునీటిని అందిస్తూ రైతులకు అండగా ఉంటామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ వార్షిక బడ్జెట్
విశ్వంభర, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,32,205 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజల అవసరాలను, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ వార్షిక బడ్జెట్‌లో సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు.

వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు
రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయ రంగానికి మొత్తంగా రూ.11,745 కోట్లను కేటాయించింది. ఇందులో పంట బీమా పథకం కోసం రూ.250 కోట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న 'ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజన' పథకానికి రూ.190 కోట్లు కేటాయించారు. దీనివల్ల రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

బలోపేతం కానున్న మున్సిపాలిటీలు
రాష్ట్రంలోని మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా మున్సిపల్ శాఖకు రూ.14,339 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. ఈ నిధుల ద్వారా పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా వంటి పనులను వేగవంతం చేయనున్నారు.

పోలీస్ శాఖ ఆధునీకరణ
శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ప్రభుత్వం భారీగా నిధులు ప్రకటించింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పోలీసు శాఖ వాహనాల కొనుగోలు కోసం రూ. 3,000 కోట్లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రంలో అత్యాధునిక పోలీస్ అకాడమీని ఏర్పాటు చేయడానికి 94 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

విద్యారంగానికి నిధుల వర్షం
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర స్కాలర్‌షిప్‌ల కోసం రూ.3,836 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. దీనితో పాటు 'తల్లికి వందనం' పథకానికి రూ.9,668 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.32,308 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.2,567 కోట్లు కేటాయిస్తూ విద్యారంగానికి పెద్దపీట వేశారు.

బీజేపీ, బీఆర్ఎస్‌వి సీక్రెట్ దోస్తీలు: మంత్రి శ్రీధర్ బాబు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల వేళ వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం తాండూర్, వికారాబాద్ పట్టణాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పట్టణ వాసులతో మమేకమవుతూ.. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధికి వందల కోట్ల నిధులు
వికారాబాద్ పట్టణ అభివృద్ధిపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాంతానికి ఉన్న భౌగోళిక అందాలను, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని వికారాబాద్‌ను రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా  తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.  ఇందుకోసం వందల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాలో 'మొబిలిటీ వ్యాలీ పార్క్' వంటి ప్రాజెక్టులతో పారిశ్రామిక వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.

దోస్తీపై విమర్శనాస్త్రాలు
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తీరుపై మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "రాష్ట్రంలో ఆ రెండు పార్టీలది లోపాయికారి ఒప్పందం. బయట విమర్శించుకున్నా, లోపల మాత్రం వారు సీక్రెట్ దోస్తులే" అని ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వారు ఆడుతున్న నాటకాలను ఓటర్లు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఆరు గ్యారెంటీలే మా శ్రీరామరక్ష!
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ మున్సిపల్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంటామని, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న 'ఆరు గ్యారెంటీలే' తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, పట్టణాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

మరోసారి బాలయ్యకు మొండిచేయి.. మంత్రి పదవి ఎందుకు ఇవ్వట్లేదు..?
నందమూరి బాలకృష్ణ.. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు. నందమూరి నటసింహం. తండ్రి వారసత్వంతో సినిమాల్లోకి వచ్చిన ఆయన.. అగ్ర హీరోగా రాణిస్తున్నాడు. సినిమాల పరంగా పర్వాలేదనిపించుకుంటున్న ఆయనకు.. రాజకీయాల్లో మాత్రం పెద్దగా కలిసి రావట్లేదు. కేవలం ఎమ్మెల్యే స్థాయిలోనే ఆగిపోతున్నాడు బాలయ్య.

హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచినా.. చంద్రబాబు మంత్రి వర్గంలో ఆయనకు స్థానం దక్కలేదు. ఎమ్మెల్యే కాకపోయినా నారా లోకేష్ కు మాత్రం మంత్రి పదవి దక్కింది. కానీ బాలయ్యకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇక రెండోసారి 2019 ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించాడు బాలయ్య.

అప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఇప్పుడు 2024లో మరోసారి హిందూపురం నుంచి గెలిచాడు. ఈసారి రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ సారి అయినా బాలయ్యకు మంత్రి పదవి దక్కుతుందేమో అని ఆయన అభిమానులు ఆశగా చూసినా.. చివరకు మొండి చేయి చూపించారు. చంద్రబాబు కేబినెట్ లో టీడీపీ నుంచి 20 మందికి మంత్రి పదవులు దక్కాయి.

లోకేష్ మరోసారి మంత్రి అయ్యాడు. కానీ బాలయ్యకు మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. అసలు సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోనే బాలయ్య ఉన్నాడు కదా.. పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నా ఆయనకు గుర్తింపు ఇవ్వట్లేదని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీలో నందమూరి కుటుంబ సభ్యులకే ప్రధాన పాత్ర ఉండాలి గానీ.. ఆ విధమైన పాత్ర ఏ కోశాన కనిపించట్లేదని అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే.. ఎక్కడ పార్టీని లాగేసుకుంటారేమో అని ఇవ్వట్లేదా అని వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ దీనిపై బాలయ్య మాత్రం మౌనంగానే ఉంటున్నాడు.

ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తాం: మంత్రి జూపల్లి
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని అన్నారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదన్నారు. అసలు పరిశీలనే జరగలేదని మంత్రి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో ఇవాళ (మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడారు. దొంగే.. దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల మాటలు ఉన్నాయని మంత్రి మండిపడ్డారు.

గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని జూపల్లి ఫైర్ అయ్యారు. రైతు భరోసాకు సంబంధించి రూ.6వేల కోట్లకు పైగా చెల్లింపులు తమ ప్రభుత్వంలో జరిగాయని తెలిపారు. ఒక్క ఈ నెలలోనే రూ.370 కోట్ల చెల్లింపులు చేశామని మంత్రి పేర్కొన్నారు. మద్యం కొరత ఉంటే ప్రభుత్వానికే నష్టమనీ.. ప్రజలకు కాదన్నారు. బ్లాకులో అమ్మిన ఘటనలపై ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసిందన్నారు. అయితే, గత ప్రభుత్వం టానిక్‌లకు ఇచ్చిన పన్ను మినహాయింపులను రద్దు చేశామని మంత్రి వెల్లడించారు.

అదేవిధంగా తయారీ యూనిట్ల వద్ద ఎలాంటి అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసులు నిత్యం పరిశీలిస్తున్నారని మంత్రి వివరించారు. గతంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప ఉద్యోగుల బదిలీలు జరిగేవి కావనీ.. ఇప్పుడు అలాంటివేవీ లేకుండానే పోర్టల్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయని అన్నారు. తప్పుడు రాతలు రాసిన పత్రికపై పరువునష్టం దావా వేస్తామని మంత్రి జూపల్లి హెచ్చరించారు.