BRS - Vishvambhara News

ఇద్దరు నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచిన కేటీఆర్
KTR: ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఇద్దరు నిరుపేద విద్యార్థులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం అందించారు. ఉన్నత విద్యను అభ్యసిస్తూ తమ లక్ష్యాల వైపు ముందుకు సాగుతున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సహాయాన్ని అందించారు. ఇందులో భాగంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించిన జీవన్‌కు, అలాగే సివిల్స్‌ కోచింగ్ తీసుకుంటున్న ఫర్జానాకు కేటీఆర్ ఆర్థిక సహాయం అందించారు. ఉన్నత విద్య, పోటీ పరీక్షల కోసం అవసరమైన ఖర్చులను భరించేందుకు ఈ ఆర్థిక సాయం వారికి ఉపయోగపడనుంది.

పేదరికం కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు తమ చదువును మధ్యలో ఆపకూడదనే ఉద్దేశంతో వారికి చేయూత అందించినట్లు తెలిపారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా గతంలోనూ పలువురికి వివిధ రకాలుగా సహాయం అందించిన కేటీఆర్.. తాజాగా ఈ ఇద్దరు విద్యార్థులకు కూడా అండగా నిలిచారు. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కష్టపడి చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని వారికి సూచించారు. కేటీఆర్ అందించిన ఆర్థిక సహాయంతో తమ ఉన్నత విద్య, కెరీర్ లక్ష్యాలకు మరింత భరోసా లభించిందని విద్యార్థులు పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వల్ల తమకు మరింత ఉత్సాహం కలిగిందని తెలిపారు.

నేతన్నల కష్టానికి వందనం.. చేనేత కార్మికులకు కేటీఆర్ శుభాకాంక్షలు
KTR NEWS: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని చేనేత కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నరాలను పోగులుగా, రక్తాన్ని రంగులుగా, గుండెలను కండెలుగా మార్చి, చెమట చుక్కలను అందమైన చీరలుగా మలిచి భారతీయ నాగరికతకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నేతన్నల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చేనేత కార్మికుల శ్రమ, నైపుణ్యం భారతీయ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు.

తెలంగాణ చేనేత కార్మికులు సమైక్య పాలనలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. అగ్గిపెట్టెలో పట్టేంత సన్నని చీరలు నేసే నైపుణ్యం ఉన్నప్పటికీ, ఉపాధి లేక అనేక మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో నేతన్నల జీవితాలను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా, బతుకమ్మ చీరల పంపిణీ, రుణమాఫీ, పెన్షన్లు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి చేనేత కుటుంబాల్లో కొత్త ఆశలు నింపినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పలువురు చేనేత కార్మికులు తిరిగి తెలంగాణకు వచ్చి తమ వృత్తిని కొనసాగించే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు.

చేనేత పరిశ్రమ అభివృద్ధి, నేతన్నల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేసిందని, భవిష్యత్తులో కూడా చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. నేతన్నల కష్టం, కళను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణకు శనిలా మారాడు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్..
KTR: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు.. తెలంగాణకు రేవంత్ రెడ్డి శనిలా తయారయ్యాడు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ శాశ్వత శత్రువని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పారని, అలాంటి కాంగ్రెస్‌ను ప్రజలు అధికారంలోకి తీసుకురావడం దురదృష్టకరమని అన్నారు.

ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టించిందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, 1.60 లక్షల మందికి నియామక పత్రాలు అందించామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ రెండున్నరేళ్లు గడిచినా ఆ హామీ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఉద్యోగాల పేరుతో యువతను రెచ్చగొట్టి ఇప్పుడు వారిని నిరాశపరిచారని విమర్శించారు.

ఇటీవల తెలంగాణలో ఇద్దరే మేధావులు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ తప్పుబట్టారు. ప్రొఫెసర్ జయశంకర్, ఆర్. విద్యాసాగర్ రావు వంటి మహనీయులను విస్మరించడం తెలంగాణ ఆత్మను అవమానించడమేనని అన్నారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమ స్ఫూర్తిని గుర్తించే సంస్కారం లేకపోతే ముఖ్యమంత్రి పదవికి అర్థమేంటని ప్రశ్నించారు.

ప్రభుత్వ పనితీరుపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ పాలమూరు, కన్నెపల్లి పంపులను ప్రారంభించడం లేదని, రాష్ట్ర అప్పులపై కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. అలాగే 32 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి 75 సార్లు ఢిల్లీకి వెళ్లారని, తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా కేంద్రం ఎదుట తలవంచే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ స్వాభిమానం, స్వయం పాలన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చూపిన మార్గమే తమకు ఆదర్శమని, అదే బీఆర్ఎస్ సిద్ధాంతమని కేటీఆర్ స్పష్టం చేశారు.

బట్ట కాల్చి నాపై వేస్తే ఊరుకోను.. కాంగ్రెస్‌కు హరీష్ రావు వార్నింగ్
Harish Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తనపై చేసిన క్షుద్రపూజల ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విమర్శలకు హద్దులు ఉండాలని స్పష్టం చేశారు. రాజకీయ విభేదాల పేరుతో నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే సహించబోనని హెచ్చరించారు. "బట్ట కాల్చి నా మీద వేయాలని చూస్తే ఊరుకునేది లేదు. నాలుక ఉందని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఉండను" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, స్కాములను తాను బయటపెడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.

గతంలో మంత్రి కొండా సురేఖ కూడా ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేసి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు, పరువు నష్టం దావాలు వేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే సంబంధిత వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపించామని, అవసరమైతే న్యాయపరంగా చివరి వరకు పోరాడతానని వెల్లడించారు.

రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చని, కానీ వ్యక్తిగతంగా దూషించడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హరీష్ రావు అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ఇకపై ఏమాత్రం సహించబోనని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

అబిడ్స్‌లో అక్రమ పేకాట దందా.. సీపీ సీవీ ఆనంద్‌కు బీఆర్ఎస్‌ నేత ఫిర్యాదు
Hyderabad news: హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో అక్రమంగా పేకాట క్లబ్ నిర్వహిస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకుని ఆ స్థావరాన్ని మూసివేయాలని బీఆర్ఎస్ కాంటెస్టెడ్ ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అబిడ్స్‌లోని ఇస్కాన్ ఆలయం, ఓ పాఠశాల మధ్య ఉన్న ఇంటిమేట్ క్లబ్లో బేగంబజార్ మాజీ కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ అక్రమంగా పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా పలువురు యువత జీవితాలు దెబ్బతింటున్నాయని, ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం బాధాకరమని విమర్శించారు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అండదండలతోనే ఈ పేకాట క్లబ్ కొనసాగుతోందని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఆలయానికి, విద్యాసంస్థకు సమీపంలో ఈ తరహా కార్యకలాపాలు జరగడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యువత, విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతోందని అన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో సంబంధిత ప్రాంగణంలో వెంటనే తనిఖీలు నిర్వహించి, అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని, పేకాట క్లబ్‌ను మూసివేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను గడ్డం శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ ఆరోపణలపై పోలీసుల విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన బీఆర్ఎస్ అగ్రనేతలు
Telangana Politics: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు కలిసి ఆస్పత్రికి వెళ్లి వైద్యులను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు అందిస్తున్న చికిత్సపై ఆరా తీసిన నేతలు, పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన వారు, ఈ క్లిష్ట సమయంలో పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రార్థిస్తున్నారని పేర్కొన్న బీఆర్ఎస్ నేతలు, ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు తిరిగి రావాలని ఆకాంక్షించారు.

"సీఎంలా ప్రవర్తించండి".. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు, లీగల్ నోటీసుల హెచ్చరిక
KTR vs Revanth Reddy: పేపర్ లీక్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్ర ఉందన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. పేపర్ లీక్ వంటి దురదృష్టకర ఘటనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం సీఎం పదవికే అవమానకరమని విమర్శించారు. గ్లోబరీనాతో బీఆర్ఎస్‌కు, తన కుటుంబానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై త్వరలో లీగల్ నోటీసులు పంపిస్తానని, క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తనపై వచ్చే ప్రతి ఆరోపణకు తాను స్పందించకపోవడం వాటిని అంగీకరించినట్లు కాదని, బురదలో కుస్తీ పట్టడం ఇష్టం లేకనే మౌనంగా ఉంటానని కేటీఆర్ పేర్కొన్నారు.

రైతులకు ఆధునిక సాంకేతికత చేరువ కావాలి: హరీష్ రావు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మైదానంలో కొనసాగుతున్న రైతుబడి అగ్రిషోను బీఆర్ఎస్ నేత హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలోని స్టాళ్లను తిలకించి, రైతుల కోసం ఏర్పాటు చేసిన వినూత్న సాంకేతికతను పరిశీలించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. రైతులకు అగ్రిషో ఎన్నో రకాలుగా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రదర్శనలు ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తే సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, రైతులకు మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న యూరియా కొరతను నివారించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

అసెంబ్లీలో రైతుల పక్షాన పోరాటం
రైతులకు అవసరమైన ఆధునిక వ్యవసాయ పరికరాలను భారీ సబ్సిడీపై అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సాగు పనిముట్లకు రాయితీలు కల్పించే అంశంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పక్షాన గట్టిగా చర్చిస్తానని భరోసా ఇచ్చారు. సాంకేతికతను సామాన్య రైతుకు అందుబాటులోకి తెచ్చినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 20న ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక వ్యవసాయ ప్రదర్శన 22వ తేదీ వరకు కొనసాగనుంది. దేశ, విదేశాలకు చెందిన సుమారు 500కు పైగా కంపెనీలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి.

అత్యాధునిక సాంకేతికతకు వేదిక
ఈ ప్రదర్శనలో ముఖ్యంగా నూతన యంత్రాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల వంటివి రైతులకు ప్రదర్శనకు ఉంచారు. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకలో వ్యవసాయ రంగ నిపుణులతో ప్రత్యేక సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. సందర్శకులు www.rbagrishow.com వెబ్ సైట్ ద్వారా ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని, నేరుగా వచ్చే వారికి కూడా ప్రవేశం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.

బాండ్ పేపర్ల హామీలు ఏమైపోయాయి?: హరీశ్ రావు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయినా, ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన వాగ్దానాలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బాండ్ పేపర్లు రాసిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. నేటికి 800 రోజులు గడిచినా ఒక్క హామీకి కూడా దిక్కులేదని విమర్శించారు. ఇవాళ సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీశ్ రావు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాయ మాటలతో ప్రజలను వంచిస్తోందని మండిపడ్డారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనైనా వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ రూపొందించాలని, అంకెల గారడీ మానేసి ప్రజలకిచ్చిన హామీలకు స్పష్టమైన నిధులు కేటాయించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

అమలు కాని అభయహస్తం
గెలిచిన నెల రోజులకే వృద్ధులు, బీడీ, చేనేత, గీత కార్మికులకు రూ.4000 పెన్షన్ ఇస్తామని చెప్పి 27 నెలలవుతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదని హరీశ్ రావు దుయ్యబట్టారు. ఈ బడ్జెట్‌లోనైనా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క దీనికి నిధులు పెడతారా లేదా అని ప్రశ్నించారు. అదే విధంగా, మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇస్తామని ఆశచూపి మహిళల ఓట్లు దండుకున్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను కూడా ఈ ప్రభుత్వం ఎగ్గొట్టిందని, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలన్నీ కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

డిక్లరేషన్ల పేరిట మోసం
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, బీసీ, రైతు డిక్లరేషన్లన్నీ పచ్చి అబద్ధాలని హరీశ్ రావు విమర్శించారు. ఎస్సీ సబ్ ప్లాన్, 18 శాతం రిజర్వేషన్ల హామీ దళితులను మోసం చేయడానికేనని, కామారెడ్డిలో సిద్ధరామయ్యను సాక్షిగా పెట్టి ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలు ఎక్కడని ఆయన ప్రశ్నించారు. బీసీలకు రూ.20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు మొండిచేయి చూపారని మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ ద్వారా చెప్పించిన రూ.15,000 రైతుబంధు, పంటల బీమా, బోనస్ వంటి హామీలు నీటి మూటలయ్యాయని, అన్నదాతలను ప్రభుత్వం నిలువునా దగా చేసిందని ఆరోపించారు. గత అసెంబ్లీలో బల్లలు చరిచి చెప్పిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు ఎక్కడికి పోయాయని నిలదీస్తూ, కనీసం ఈ బడ్జెట్‌లోనైనా బాధితులందరికీ న్యాయం చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

క్యాతనపల్లిలో హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ పీఠం కోసం సాగుతున్న పోరు కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. బుధవారం ఉదయం నుంచే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటిని పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ఆయన్ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగి, ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. సుమన్‌ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకోవడంతో క్యాతనపల్లి పురవీధులు నిరసనలతో హోరెత్తాయి.

బందుతో స్తంభించిన పట్టణం.. మహిళా కౌన్సిలర్ల ఆవేదన
మంగళవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ సాగుతుండగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ గొడవలకు బీజం వేశాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికను అడ్డుకున్నారని, కాంగ్రెస్ కౌన్సిలర్లు తమపై దౌర్జన్యం చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారని బీఆర్ఎస్, సీపీఐ మహిళా కౌన్సిలర్లు ఆరోపించారు. బుధవారం మీడియా ముందు వారు కన్నీటి పర్యంతమై తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు బుధవారం క్యాతనపల్లి పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడటంతో పట్టణమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం మంటలు రేగుతున్నాయి.

మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. రాజకీయ యుద్ధం
మున్సిపల్ పీఠంపై పట్టు సాధించే క్రమంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పంతం పట్టింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోందని బాల్క సుమన్ ఆరోపిస్తుండగా, నిబంధనల ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ కౌన్సిలర్ల ప్రవర్తనపై మహిళా కౌన్సిలర్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, తాజా అరెస్టులు, బంద్ పిలుపుల నేపథ్యంలో క్యాతనపల్లిలో అదనపు బలగాలను మోహరించారు. ఎన్నికల అధికారి తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉంటుందోనని అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అధికార బలంతో అరాచక పాలన.. బాల్క సుమన్ అరెస్టుపై హరీశ్ రావు విమర్శలు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ గూండాగిరి రాజ్యమేలుతోందని, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల ఉత్కంఠ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించకుండా కిడ్నాప్‌లు, అక్రమ అరెస్టులతో చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవాలని చూడటం దుర్మార్గమని విమర్శించారు. క్యాతనపల్లిలో ప్రజలు స్పష్టంగా బీఆర్ఎస్‌కు పట్టం కట్టారని, కానీ ఆ తీర్పును తుంగలో తొక్కేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని హరీశ్ రావు మండిపడ్డారు.

పదవుల కబ్జా కాంగ్రెస్ నైజం
భూములను కబ్జా చేసినట్లే మున్సిపల్ పదవులను కూడా కబ్జా చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడం, వారిని ప్రలోభపెట్టడం వంటి చర్యల ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని ఆరోపించారు. బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడం ద్వారా ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తున్నారని, ఇలాంటి అణచివేత ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి తొత్తుగా మారడం శోచనీయమని, ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.

ఐక్య పోరాటానికి పిలుపు
అరెస్ట్ చేసిన బాల్క సుమన్‌ను తక్షణమే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అడ్డదారుల్లో పదవుల కోసం ప్రయత్నించడం మానుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అణచివేత వైఖరిపై బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కానీ కాంగ్రెస్ మాత్రం దౌర్జన్యాలతో అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తోందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ పరిణామాలపై తాము చట్టపరంగా, రాజకీయంగా పోరాటం చేస్తామని హరీశ్ రావు తేల్చి చెప్పారు.

బందిపోట్లలా దళిత నేత అరెస్టా?: కేటీఆర్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఒక దళిత నాయకుడైన బాల్క సుమన్‌ను ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అకస్మాత్తుగా బందిపోట్ల మాదిరిగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆయన ధ్వజమెత్తారు. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ అడ్డదారుల్లో వెళ్తోంది. ఇది ప్రభుత్వ అసమర్థతకు, పిరికిపందతనానికి నిదర్శనం అని కేటీఆర్ మండిపడ్డారు. అరెస్ట్ చేసిన బాల్క సుమన్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మంత్రి వివేక్ డైరెక్షన్‌లో ఎన్నికల ప్రక్రియ
క్యాతనపల్లిలో జరుగుతున్న ఎన్నిక కేవలం నామమాత్రంగానే ఉందని, తెరవెనుక మంత్రి వివేక్ వెంకటస్వామి నేరుగా అధికారులపై ఒత్తిడి తెస్తూ ఎన్నికల ప్రక్రియను శాసిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి కళ్లసైగలకు అనుగుణంగా రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు నడుచుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు కాంగ్రెస్ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారాయని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ, దానిని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులకు హెచ్చరిక.. ప్రతిఫలం తప్పదు
పోలీసు యంత్రాంగం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 'ప్రైవేట్ సైన్యం'లా మారిపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బాల్క సుమన్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలను వేధించడం మానుకోవాలని ఆయన సూచించారు. "ఇప్పుడు అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ, అక్రమాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారి గుర్తుంచుకోవాలి.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భవిష్యత్తులో మీరు చేసిన ప్రతి తప్పుకు తగిన ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అని ఆయన గట్టిగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.