GudumbaInitiative - Vishvambhara News

మండల వ్యాప్తంగా గుట్టుగా గుడుంబా తయారీ
విశ్వంభర చింతపల్లి జులై 26 : - చింతపల్లి మండల వ్యాప్తంగా పల్లెల్లో, మారుమూల తండాల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్నా నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంది. గుడుంబా తయారీ దారులు గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారు. మద్యం ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు నాటుసారా వైపు మల్లుతున్నారు. గుడుంబాను నిరోధించాల్సిన సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు మూలాలపై దృష్టిపెట్టకుండా అడపాదడపా దాడులు చేస్తూ అమ్మకందారులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో గుడుంబా తయారు చేసేవాళ్లకు గత ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ పలు పథకాలను అమలు చేసింది. అయినప్పటికీ కొందరు గుడుంబా కాయడమే వృత్తిగా పెట్టుకుని పల్లెల్లో, తండాల్లో జోరుగా దందాను సాగిస్తున్నారు. గుడుంబా కేవలం పల్లెలు, తండాలకే పరిమితం కాకుండా ఇప్పుడు పట్టణాలకు సైతం పాకింది. గతంలో ఎక్సైజ్, పోలీస్ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు చేసి గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.

జోరుగా నాటుసారా తయారీ

చింతపల్లి మండలంలో నాటుసారా తయారీ జోరందుకుంది. మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తక్కువ ధరల్లో లభించే గుడుంబా వైపు మరులుతున్నారు. దీంతో పల్లెలతో పాటు పట్టణాల్లోనూ సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని వివిధ ప్రాంతాల్లో సారా విచ్చలవిడిగా తయారవుతోంది. గుట్టుచప్పుడు కాకుండా ప్లాస్టిక్‌ కవర్లలో నింపి రవాణా చేస్తున్నారు. రోటిగడ్డ తండా, జర్పుల తండా, పల్లె తండా, కోర్ర మాన్ సింగ్ తండా, బోటిమీది తండా, ఎర్రమట్టి తాండ, చౌళ్ళ తండా, బోత్య తండా, దేవుల తండా, పాలెం తండా, ప్రశాంతపూరి తండాలలో మారుమూల గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో గుడుంబా తయారీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ద్విచక్రవాహనాలపై ఇతర గ్రామాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు సారా తయారీనే వృత్తిగా మలుచుకొని పెద్దఎత్తున తయారుచేసి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో గుడుంబా తయారీ పెద్దఎత్తున సాగేది. అప్పట్లో గత ప్రభుత్వం తయారీకి అడ్డుకట్ట వేయడానికి బెల్లం తయారీని నిషేధించింది. దీంతో పాటు సారా తయారీకి అలవాటు పడిన కుటుంబాలకు వివిధ ఉపాధి అవకాశాలు కల్పించారు. అనంతరం వారు సారా తయారీ మానుకునేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో తిరిగి సారా గుప్పు మంటోంది. కొందరు తమ కోసం ఇప్పపువ్వుతో మేలి రకం సారా తయారు చేసుకుని తాగుతుండగా మరికొందరు ఇప్పపువ్వుతో పాటు బెల్లం, కుళ్లిన అరటిపండ్లు, ఇతర మత్తు పదార్థాలతో గుడుంబా తయారు చేసి దందా సాగిస్తున్నారు.

మందుబాబులు నాటుసారా వైపు

మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన కొందరు మత్తు కోసం సారాకు అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం తాగాలంటే వందల రూపాయలు వెచించాల్సి వస్తోంది. క్వాటర్‌ మద్యం కోనాలన్నా రూ.200 లకు పైగానే ఖర్చవుతోంది. ఇలాంటి సమయంలో తక్కువ ధరల్లో దొరుకుతున్న గుడుంబా తాగేందుకు మందుబాబులు నాటుసారా వైపు చూస్తున్నారు. మండలంలోని మాల్ వెంకటేశ్వర నగర్, కుర్మేడు, చింతపల్లి కూడళ్లలో పేదలు, కూలీలు నివసించే పలు కాలనీల్లో గుడుంబా, సారాను కొందరు ఇనుప వస్తువులు తయారు చేసే వ్యక్తులు ఎక్కువగా తాగుతున్నట్లు తెలుస్తోంది.  గుడుంబా అమ్మకాలు గుట్టు చప్పుడు కాకుండా చాప కింద నీరులా పారుతుంది. రోజువారి కూలీ పనులు చేసుకుని బతికేవారు చాలా మంది సారా, గుడుంబా తాగుతున్నట్లు సమాచారం.

గుడుంబాపై ఎక్సైజ్ శాఖ నిఘా కరువు

మండలంలోని నిషేధిత గుడుంబాపై ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక నిఘా పెట్టలేకపోతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా నాటుసారా తయారు చేసే మూలాలపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో విచ్చలవిడిగా నాటుసారా తయారవుతుందనే వాదన వినిపిస్తోంది. సారా అమ్మకాలు ఆగాలంటే తయారీ మూలాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గుట్టుగా తయారీ చేస్తూ వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో గుడుంబాను పెద్ద ఎత్తున తయారు చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాకాలం సీజన్‌ కావడంతో పంట చేన్ల వద్ద గుట్టుగా తయారు చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఎక్సైజ్‌ అధికారులు తండాలపై దాడులు నిర్వహించి సారా అమ్మకాలపై వెతుకుతున్నారు. మూలాలను వెతకకుండా ఎక్కడో ఒకచోట దాడులు నిర్వహిస్తున్నారు. సారా ఎక్కడ తయారు చేస్తున్నారో గుర్తించి పక్కా వ్యూహంతో దాడులు చేస్తే అసలు నిందితులు దొరికే అవకాశం ఉంది.