Farmers Protest - Vishvambhara News

పది రోజులుగా కరెంట్ క‌ట్.. హాంపాపురంలో కరెంట్ కోసం అర్ధరాత్రి రోడ్డెక్కిన రైతులు
Anantapur News: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హాంపాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి రైతులు ఆందోళనకు దిగారు. పొలాలకు నీరు పెట్టుకోవాల్సిన సమయంలో వ్యవసాయ విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు నీరు అందించేందుకు విద్యుత్ కోసం అర్ధరాత్రి సబ్‌స్టేషన్ గేట్ల వద్దకు వచ్చి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.

గత పది రోజులుగా వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతోందని రైతులు ఆరోపించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కరెంట్ కోసం ఎదురుచూస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి పంటలు సాగు చేస్తుంటే.. బోర్లు పనిచేయక నీరు అందక పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కీలకమైన పంట దశలో విద్యుత్ సమస్యల కారణంగా నష్టపోయామని, ఇప్పుడు కూడా అధికారులు స్పందించకపోతే మరోసారి తీవ్ర నష్టం తప్పదని అన్నారు.

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఉద్యాన పంటలకు ప్రాణాధారమైన విద్యుత్‌ను సక్రమంగా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రైతులు పేర్కొన్నారు. రైతు పంటకు నీరు కావాలి.. నీటికి కరెంట్ కావాలని, కరెంట్ కోసం రైతు అర్ధరాత్రి సబ్‌స్టేషన్‌కు రావాల్సి వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలని, పంటలు ఎండిపోయిన తర్వాత పరిహారం కోసం పరుగులు పెట్టించే పరిస్థితి కాకుండా పంట ఎండిపోకముందే విద్యుత్ అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రైతుల సమస్యలపై కేటీఆర్ పోరుబాట.. మిర్యాలగూడలో మహాధర్నా
KTR Miryalaguda: సాగర్ ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు మిర్యాలగూడలో రైతుల మహాధర్నా నిర్వహించనున్నారు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు.. వెంటనే ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టనున్నారు. రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ మహాధర్నాకు పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. సాగర్ ప్రాజెక్టులో తగినంత నీరు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నీటి విడుదల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని రైతులకు సాగునీరు అందించాలని కోరుతోంది. రైతుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ మహాధర్నాతో మిర్యాలగూడలో రాజకీయ వేడి పెరిగే అవకాశం ఉంది. సాగునీటి సమస్యకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌కు వ్యతిరేకంగా పంజాబ్–హర్యానా సరిహద్దులో రైతుల నిరసన
India-US Trade Deal: భారత్–అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే దేశీయ వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్–హర్యానా సరిహద్దులో పెద్ద ఎత్తున రైతులు నిరసన చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రేడ్ డీల్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి అధికంగా వచ్చే అవకాశం ఉందని, దీంతో దేశీయ రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర దొరకక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇలాంటి ఒప్పందాలు రైతులపై మరింత ఆర్థిక భారం మోపే అవకాశముందని పేర్కొన్నారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా తీసుకునే నిర్ణయాలు వ్యవసాయ రంగానికి మేలు చేయవని అన్నారు.

నిరసనలో పాల్గొన్న పలువురు రైతులు, గతంలో ఏ ప్రధానమంత్రి కూడా రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి అమెరికాతో ఇలాంటి వాణిజ్య ఒప్పందాలు చేయలేదని ఆరోపించారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుందని విమర్శించారు. రైతుల జీవనోపాధిపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే ముందు రైతు సంఘాలతో సంప్రదింపులు జరపాల్సిందని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని రక్షించే విధానాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

పంజాబ్, హర్యానా రాష్ట్రాలు దేశంలో వ్యవసాయానికి ప్రధాన కేంద్రాలుగా గుర్తింపు పొందాయి. గోధుమ, వరి వంటి ప్రధాన పంటలను అధికంగా పండించే ఈ రాష్ట్రాల రైతులు, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు పెరిగితే దేశీయ మార్కెట్‌లో పోటీ తీవ్రంగా పెరిగి తమ ఆదాయంపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందంలోని నిబంధనలను పునఃసమీక్షించాలని, అవసరమైతే పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నిరసన ప్రదర్శన సందర్భంగా భారీ సంఖ్యలో రైతులు పంజాబ్–హర్యానా సరిహద్దుకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ, ట్రేడ్ డీల్‌పై స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాజకీయ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఈ ఒప్పందం వాణిజ్య అవకాశాలను పెంచుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండగా, మరోవైపు రైతు సంఘాలు మాత్రం ఇది దేశీయ వ్యవసాయ రంగానికి నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇథనాల్ పరిశ్రమ కు పర్మిషన్ ఇచ్చిందే కేసిఆర్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
విశ్వంభర, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేయడమే కాకుండా.. రైతులు వ్యతిరేకించే ప్రాజెక్టులు చెపట్టి.. ఇప్పుడు నానా యాగీ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో  మాట్లాడుతూ నిర్మల్ జిల్లా దిలవర్ పూర్ ఇథనాల్ కంపనీ కి అనుమతి 7 జులై 2023 లో టీఆర్ఎస్ హాయంలో వచ్చిందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ డైరెక్టర్ గా ఉన్న కంపనీ కి కేసిఆర్ అనుమతి ఇచ్చాడని తెలిపారు. డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్ మెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇథనల్ కంపెనీ అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వం, ఇప్పుడు అక్కడికి వెళ్లి మీరే ఆందోళన చేస్తు బట్ట కాల్చి మీద వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతులను ముంచింది మీరే.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రైతులను రెచ్చగొడుతున్నాడన్నారని అన్నారు . ఇథనాల్ కంపెనీ కి ఎలా అనుమతులు ఇచ్చారని దిలవర్ పూర్ రైతులు బిఆర్ఎస్ నేతలను ప్రశ్నించాలని పేర్కొన్నారు. బిఆర్ఎస్ నేతలకు దమ్ముంటే దిలవర్ పూర్ రండి చర్చిద్దామని సవాల్ విసిరారు.

నిర్మల్ ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలని అన్నారు.  బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అక్కడ ఏం చేస్తున్నట్లు  తెలపాలన్నారు. రైతు వ్యతిరేకి ప్రభుత్వం బీజేపీ కి ఓటు వేసింది మీరు కాదా అని బిఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు . కంపనీ పెట్టింది టీఆర్ఎస్ నాయకుడు, వాటికీ అన్ని రకాల పర్మిషన్ ఇచ్చింది కేటీఆర్, కేసిఆర్ లు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పై అబండాలు వేస్తున్నారు అని అన్నారు.ఇలాంటి దగుల్ల్బాజీ పనులు టీఆర్ఎస్ నేతలు మానుకోవాలన్నారు. అన్ని పర్మిషన్ లు ఇచ్చి ఇప్పుడు రైతులను రెచ్చగొడుతున్న కేటీఆర్ కి సిగ్గు ఉండాలన్నారు. ఇథనల్ కంపెని పక్క కేటీఆర్ ప్రాజెక్టు అని అన్నారు . రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. ఇథనల్ కంపనీ విషయంలో పూర్వ పరాలు పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటాం అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు .

దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని రైతుల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం..!
సన్నవడ్లతో పాటు దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చిన రైతులు వాహనాల రాకపోకను అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను నట్టేట ముంచుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో అన్ని రకాల ధాన్యానికి, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ సన్న ధాన్యానికే ఇస్తామంటూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సన్న రకం ధాన్యం మార్కెట్‌కు రాదని, అది ఎక్కువగా మిల్లులలోనే అమ్ముడుపోతుందని తెలిపారు. ఎక్కువ శాతం రైతులు దొడ్డు వడ్లను పండిస్తుంటారని తెలిపారు.

కేసీఆర్ రైతులను నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడంటూ గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం నీళ్లు ఇవ్వడంలేదని వాపోయారు. కరెంట్ సైతం సరిగా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రైతుబంధు పంట చివరలో ఇచ్చి చేతులు దులుపేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో తమ పంటలు ఎండిపోవడంతో ఉన్న కొద్ది పంటలను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరించారు.