chennai - Vishvambhara News

అభివృద్ధి పనుల పరిశీలనకు రెడ్ కార్పెట్.. విజయ్ పర్యటనపై చర్చ
Tamil Nadu News: టీవీకే (TVK) అధినేత విజయ్ చెన్నైలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్లిన సందర్భంగా చేసిన ఏర్పాట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన పర్యటన కోసం అధికారులు రెడ్ కార్పెట్లు, గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేయడంతో ఆ దృశ్యాలు సినిమా షూటింగ్‌ను తలపించేలా ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ పర్యటనకు సంబంధించిన వీడియోలను టీవీకే వర్గాలు సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో ప్రచారం చేస్తున్నాయి. అయితే ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించాల్సిన పర్యటనలను ప్రచార ఆర్భాటాలుగా మార్చడం సరైన పద్ధతి కాదంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, విజయ్ అభిమానులు మాత్రం అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించడం మంచి పరిణామమని, పర్యటనలో చేసిన ఏర్పాట్లను అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలకు దారితీసింది.

చెన్నైలో దివంగత ఎన్టీఆర్ నివాసానికి పూర్వవైభవం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానంలో ఎన్నో మధుర స్మృతులకు వేదికైన చెన్నైలోని ఆయన నివాసం మళ్లీ కళకళలాడబోతోంది. త్యాగరాయనగర్‌ బజుల్లా రోడ్డులోని ఆ చారిత్రక ఇంటిని పునరుద్ధరించి, అభిమానుల సందర్శనార్థం సిద్ధం చేస్తున్నారు. 1953లో ఎన్టీఆర్ తన సతీమణి బసవతారకం పేరిట సుమారు వెయ్యి గజాల విస్తీర్ణంలో ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ ఇల్లు ఆయనకు ఎంతో కలిసి వచ్చిందని సినీ వర్గాలు చెబుతుంటాయి.

ఈ ఇంటికి ఎదురుగానే దర్శకరత్న దాసరి నారాయణరావు నివాసం ఉండేది. రాత్రిళ్లు అక్కడ కథా చర్చలు జరిగేవి. ఎన్టీఆర్ తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి పనులు మొదలుపెట్టేవారు. అటు దాసరి ఇంట్లో అర్ధరాత్రి దాకా, ఇటు ఎన్టీఆర్ ఇంట్లో తెల్లవారుజాము నుంచి లైట్లు వెలుగుతూనే ఉండేవి. దీంతో ఆ వీధిలో దొంగతనాల భయం ఉండేది కాదని, ఏ ఇంటికీ వాచ్‌మన్ అవసరం పడేది కాదని అప్పట్లో సరదాగా చెప్పుకునేవారు.

తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడంతో ఆ ఇల్లు క్రమంగా కళావిహీనంగా మారింది. సుమారు 30 మందికి పైగా వారసులు ఉండటంతో ఆ ఇంటిని పునరుద్ధరించే ప్రయత్నాలు ఇన్నాళ్లూ కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఆ నివాసాన్ని నందమూరి కుటుంబానికి ఆప్తులైన చదలవాడ బ్రదర్స్ (తిరుపతిరావు, శ్రీనివాసరావు) కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ జ్ఞాపకార్థం ఆ ఇంటిని తీర్చిదిద్దుతున్నట్లు వారు ప్రకటించారు.

ఇంటి అసలు రూపం దెబ్బతినకుండా కేవలం మరమ్మతులు మాత్రమే చేస్తున్నారు. ఇంటి ముందు ఉన్న ఫ్లైఓవర్ పైనుంచి వెళ్లేవారికి సైతం కనిపించేలా.. 'శ్రీకృష్ణపాండవీయం' చిత్రంలోని సుయోధనుడి గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారంపై ఏర్పాటు చేస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత అభిమానులు లోపలికి వెళ్లి ఆ ఇంటిని చూసి ఆనందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Crows Death: ఉన్నట్టుండి నేలరాలి చనిపోతున్న కాకులు..!!
చెన్నై నగరంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక వింత పరిణామం ప్రజలను కలవరపెడుతోంది. గాల్లో స్వేచ్ఛగా ఎగురుతున్న కాకులు ఒక్కసారిగా కింద పడిపోతూ, ఎగరలేని స్థితిలో గంటల తరబడి లేదా ఒక రోజు పాటు నేలపైనే ఉండిపోయి చివరకు మృతి చెందుతున్న ఘటనలు వరుసగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా అడయార్ ప్రాంతంలోని ఇందిరానగర్ పార్క్ పరిసరాల్లో ఈ సంఘటనలు ఎక్కువగా కనిపించడం ఆందోళనకు దారి తీస్తోంది.

అక్కడి ప్రాంతవాసుల కథనం ప్రకారం.. సాధారణంగా చురుకుగా ఉండే కాకులు ఒక్కసారిగా శక్తిని కోల్పోయినట్లుగా కిందపడిపోతున్నాయి. అవి వెంటనే చనిపోవడం లేదు. కానీ కదలలేని స్థితిలో ఉండి, ఒకటి లేదా రెండు రోజుల్లో మృతి చెందుతున్నాయి. దీంతో ఇది ఏదైనా కొత్త వైరస్ ప్రభావమా అనే అనుమానాలు స్థానికుల్లో మొదలయ్యాయి. పార్క్‌లో వాకింగ్ చేసే వారు, పిల్లలు ఆడుకునే వారు ఈ దృశ్యాలు చూసి భయాందోళనకు గురవుతున్నారు.

ఈ ఘటనలపై చెన్నై గ్రేటర్ కార్పొరేషన్ (జీసీసీ) వెంటనే స్పందించింది. మృతిచెందిన కాకులను సేకరించి పరీక్షల కోసం తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీకి పంపించింది. జోన్ మెడికల్ అధికారి డాక్టర్ షీలా మాట్లాడుతూ, విషాహారం, కలుషిత నీరు లేదా విద్యుత్ షాక్ వంటి కారణాల వల్ల ఈ మరణాలు జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు.

అయితే జీసీసీ వెటర్నరీ అధికారి జె. కమల్ హుస్సైన్ మరో కోణాన్ని వెల్లడించారు. “అడయార్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. ఒకేచోట కాకుండా అనేక ప్రాంతాల్లో మరణాలు జరుగుతున్నట్లయితే, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చన్న అనుమానాన్ని కొట్టిపారేయలేం” అని తెలిపారు. వెటర్నరీ యూనివర్సిటీ నుంచి పరీక్షల నివేదికలు రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా, అడయార్, వేలచ్చేరి, నీలాంకరై వంటి ప్రాంతాల నుంచి కూడా కాకుల మృతి వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి తన ఇంటి వద్ద ఒక కాకి మత్తుగా ఉన్నట్టుగా కనిపించిందని తెలిపారు. అది సరిగ్గా కదలలేకపోయిందని, చివరకు రెండు రోజుల తర్వాత చనిపోయిందని ఆయన చెప్పారు. ఇలాంటి అనుభవాలు మరికొందరు కూడా చెబుతున్నారు.

వెటర్నరీ యూనివర్సిటీ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటివరకు చేసిన ప్రాథమిక పోస్ట్‌మార్టం పరీక్షల్లో స్పష్టమైన కారణం తేలలేదు. ప్రస్తుతం ఆరు నమూనాలపై లోతైన విశ్లేషణ జరుగుతోంది. ముఖ్యంగా ఆర్గానోఫాస్ఫరస్ రసాయనాలు, ఎలుకల విషం వంటి పదార్థాల ఉనికితో పాటు, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా అనే కోణంలోనూ పరీక్షలు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. తుది నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం ఏంటన్నది స్పష్టమవుతుందని తెలిపారు.

ఇదే సమయంలో నిపుణులు ప్రజలకు కీలక హెచ్చరికలు చేస్తున్నారు. కిందపడిపోయిన లేదా అస్వస్థంగా ఉన్న కాకులను చేతులతో తాకవద్దని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ అది వైరల్ ఇన్ఫెక్షన్ అయితే, ఇతర పక్షులకు లేదా అరుదైన సందర్భాల్లో మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. పార్కులు, నివాస ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

మొత్తానికి, చెన్నైలో కాకుల వరుస మరణాలు ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అసలు కారణం ఏమిటన్నది తేలే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వెటర్నరీ యూనివర్సిటీ నివేదికతో ఈ మిస్టరీకి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అందరూ ఆశిస్తున్నారు.

ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు
ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానాన్ని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఇవి ఫేక్ బాంబు బెదిరింపుగా భద్రత సిబ్బంది నిర్ధారించారు. చెన్నై నుంచి ముంబైకి శనివారం ఉదయం బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.

చెన్నై నుంచి ముంబై వచ్చిన ఈ విమానంలో మొత్తం 172 మంది ప్రయాణికులు ఉన్నారు.  మరోవైపు ఆ విమానం‌లో బాంబు లేకపోవడంతో చెన్నై‌కు ఆ విమాన సర్వీస్‌ను ఏర్పాటు చేశారు. అందులోభాగంగా విమానాన్ని ఎయిర్ పోర్ట్‌ టెర్మినల్ వద్దకు తీసుకువచ్చారు.  ఇక ఈ వారంలో ఇండిగో విమానానికి ఇది రెండో బాంబు బెదిరింపు అని ఆ సంస్థ గుర్తు చేసింది. గత నెల మే 28వ తేదీ ఢిల్లీ నుంచి వారణాసి బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నాగపూర్, జైపూర్, గోవా ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
బంగారం కొనాలనుకునే మహిళలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఇవాళ(మంగళవారం) తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 600 తగ్గి రూ.68,300గా ఉంది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 తగ్గి రూ.74,510కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.2000 తగ్గి రూ.99,000 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.68,450గా ఉంది. 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ.74,660 ఉండగా ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.68,300గా ఉంది. 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 74,510గా కొనసాగుతోంది. చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,600 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.74,840 ఉంది.