mumbai - Vishvambhara News

రూ.30 లక్షలకే కోటి ఫేక్ నోట్లు.. కారులో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
Fake Currency: ముంబై విరార్‌లో భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని తరలిస్తున్న ముఠాను వసాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు రూ.30 లక్షలకు రూ.1 కోటి విలువైన నకిలీ నోట్లను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబై–అహ్మదాబాద్ హైవేపై కారులో నకిలీ నోట్లను తరలిస్తున్న సమయంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కారులో రూ.500 ముఖ విలువ కలిగిన 20,000 నకిలీ నోట్లు బయటపడ్డాయి. వీటి మొత్తం విలువ రూ.1 కోటిగా అధికారులు వెల్లడించారు. నకిలీ నోట్లను భారీ మొత్తంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి కోపర్‌గావ్‌కు చెందిన ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు.

నకిలీ కరెన్సీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరికి సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నారు? ఈ నెట్‌వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అరెస్టైన నిందితుడిని విచారిస్తూ నకిలీ నోట్ల సరఫరా వ్యవస్థకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. భారీ మొత్తంలో నకిలీ నోట్లు పట్టుబడటం ముంబైలో కలకలం రేపింది. నకిలీ కరెన్సీ చలామణికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. అరెస్టైన వ్యక్తి నుంచి లభించిన సమాచారంతో నెట్‌వర్క్‌లోని ఇతర సభ్యులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
బంగారం కొనాలనుకునే మహిళలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఇవాళ(మంగళవారం) తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 600 తగ్గి రూ.68,300గా ఉంది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 తగ్గి రూ.74,510కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.2000 తగ్గి రూ.99,000 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.68,450గా ఉంది. 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ.74,660 ఉండగా ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.68,300గా ఉంది. 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 74,510గా కొనసాగుతోంది. చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,600 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.74,840 ఉంది.