delhi - Vishvambhara News

దేశ రాజధానిలో బాంబు కలకలం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపుతున్నాయి. గతంలో అనేకసార్లు పాఠశాలలకు వచ్చిన బెదిరింపులు నకిలీవని తేలినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అధికారులు ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్డులోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిన వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను అత్యవసరంగా ఇళ్లకు పంపించాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్, స్థానిక పోలీసులు, బాంబు డిస్పోజల్ యూనిట్లు రంగంలోకి దిగి పాఠశాల ప్రాంగణాలను క్షుణ్ణంగా గాలించాయి. క్లాస్ రూమ్‌ల నుండి ఆటస్థలాల వరకు అణువణువూ తనిఖీలు చేపట్టడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

ఉగ్ర ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాలు
మరోవైపు నిఘా వర్గాలు అందజేసిన తాజా సమాచారం భద్రతా దళాలను మరింత అప్రమత్తం చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఢిల్లీలో దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా చారిత్రక కట్టడమైన ఎర్రకోట, అత్యంత రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతం, పరిసరాల్లోని ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతూ, వ్యూహాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.

దర్యాప్తు ముమ్మరం చేసిన భద్రతా ఏజెన్సీలు
ఈ బెదిరింపు ఈ-మెయిల్స్ మూలాలను కనుగొనేందుకు సైబర్ క్రైమ్ విభాగాన్ని రంగంలోకి దించారు. ఈ మెయిల్స్ ఎక్కడి నుండి పంపబడ్డాయి, దీని వెనుక ఏవైనా ఉగ్రవాద సంస్థల హస్తం ఉందా లేక ఎవరైనా ఆకతాయిలు కావాలని చేస్తున్నారా అనే కోణంలో విచారణ సాగుతోంది. పాఠశాలల పరిసరాల్లో భద్రతను పటిష్టం చేయడంతో పాటు, మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. రాజధానిలో భద్రతా పరిస్థితులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఏఐ ఆవిష్కరణలకు తెలంగాణ వేదిక: మంత్రి శ్రీధర్ బాబు
విశ్వంభర, నేషనల్ బ్యూరో: కృత్రిమ మేధ (ఏఐ) ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం ఒక ప్రధాన వేదికగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు ఐటీ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్‌లో పాల్గొన్న మంత్రి.. అమెరికా, ఇండియా వాణిజ్య మండలి ప్రతినిధులతో ప్రత్యేక చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. 'అమెరికా టెక్‌ దిగ్గజాలతో కలిసి పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం. మా ప్రభుత్వ స్థిరమైన విధానాల వల్ల ఏఐ పరిశోధనలకు రాష్ట్రం వేదికగా మారింది. ప్రజాసేవల్లోనూ ఏఐ ద్వారా సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నాం' అని శ్రీధర్‌బాబు వివరించారు. రాష్ట్రంలోని స్థిరమైన విధానాలు, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం వల్ల ఐటీ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ ఉత్తమ అవకాశాలను కల్పిస్తోందని మంత్రి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ఏఐ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌పై రాహుల్ గాంధీ, ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులతో కలిసి న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్, దాని వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌పై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ ప్రాధాన్యతలు, కీలక వాగ్దానాల అమలుపై జాతీయ నాయకత్వానికి ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించారు.

సామాజిక న్యాయానికి ప్రాధాన్యత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర తాజా పరిణామాలపై చర్చించింది. సమావేశంలో విధానపరమైన నిర్ణయాలు, నిర్మాణాత్మక సంస్కరణలు, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల గురించి అధిష్ఠానానికి వివరించారు. సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులతో కలిసి న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్, దాని వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌పై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ ప్రాధాన్యతలు, కీలక వాగ్దానాల అమలుపై జాతీయ నాయకత్వానికి ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించారు.

సామాజిక న్యాయానికి ప్రాధాన్యత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర తాజా పరిణామాలపై చర్చించింది. సమావేశంలో విధానపరమైన నిర్ణయాలు, నిర్మాణాత్మక సంస్కరణలు, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల గురించి అధిష్ఠానానికి వివరించారు. సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు
డిసెంబర్ 2023లో ‘ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం’ కొలువుదీరినప్పటి నుంచి చేపట్టిన విప్లవాత్మక చర్యలను ముఖ్యమంత్రి నాయకత్వానికి వివరించారు. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత సాధికారత కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి లభిస్తున్న విశేష ప్రజా మద్దతును ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధిష్ఠానానికి తెలియజేశారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన మార్గదర్శకత్వం, తెలంగాణ సమగ్ర, సమాన అవకాశాల అభివృద్ధి దిశగా ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

డిసెంబర్ 2023లో ‘ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం’ కొలువుదీరినప్పటి నుంచి చేపట్టిన విప్లవాత్మక చర్యలను ముఖ్యమంత్రి నాయకత్వానికి వివరించారు. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత సాధికారత కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి లభిస్తున్న విశేష ప్రజా మద్దతును ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధిష్ఠానానికి తెలియజేశారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన మార్గదర్శకత్వం, తెలంగాణ సమగ్ర, సమాన అవకాశాల అభివృద్ధి దిశగా ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఖనిజ రంగంలో సంస్కరణల ఎక్స్‌ప్రెస్
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశీయ ఖనిజ అన్వేషణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశంలోని అన్వేషించని ఖనిజ నిక్షేపాలను వెలికితీసేందుకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు రెండో విడత అన్వేషణ లైసెన్స్ బ్లాకుల వేలాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఐ, ఎస్‌బీసీఏపీఎస్, ఎంఎస్‌టీసీ, ఎన్ఎంఈటీ వంటి వివిధ విభాగాల ప్రతినిధులు వేలం ప్రక్రియ, ఈ-వేలం పద్ధతులు, మరియు అన్వేషణ ఖర్చులలో రాయితీలు  పొందే పథకాలపై వివరణాత్మక ప్రజెంటేషన్లు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఖనిజ రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగం కూడా అన్వేషణ ప్రక్రియలో భారీగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. "కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో చేపడుతున్నవి సాధారణ సంస్కరణలు కావు.. ఇదొక సంస్కరణల ఎక్స్‌ప్రెస్" అని ఆయన వ్యాఖ్యానించారు. గనుల రంగంలో పారదర్శకత, పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా పరివర్తనాత్మక మార్పులు తెస్తున్నట్లు వెల్లడించారు.

ఏఐ, ఎంఎల్ సాంకేతికతతో ‘నెక్స్ట్-జనరేషన్’ పోర్టల్
ఖనిజ అన్వేషణలో డేటా విశ్లేషణను సులభతరం చేసేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన నెక్స్ట్-జనరేషన్ పోర్టల్‌నుమంత్రి ప్రారంభించారు.ఇది ఏఐ, ఎంఎల్ ఆధారిత సాధనాలతో డేటా సేకరణ, విశ్లేషణను ఏకీకృతం చేస్తుంది. నేషనల్ జియోసైన్స్ డేటా రిపోజిటరీతో అనుసంధానమైన ఈ పోర్టల్, అన్వేషణలో పారదర్శకతను, సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.

11 ఖనిజ బ్లాకులకు వేలం
గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. మొదటి విడతకు వచ్చిన అద్భుతమైన స్పందనతో ఇప్పుడు రెండో విడతను చేపట్టినట్లు తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న 11 కీలక, భూ పొరల లోతుల్లో ఉన్న ఖనిజ బ్లాకులను ఈ విడతలో చేర్చినట్లు తెలిపారు. ఎంఎండీఆర్ సవరణ చట్టం-2023 ద్వారా ప్రవేశపెట్టిన 'అన్వేషణ లైసెన్స్' విధానం వ్యాపార నిర్వహణను సులభతరం చేసిందని, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సమాన అవకాశాలు కల్పిస్తోందని వివరించారు.

మూడో తరగతి నుంచే ఏఐ బోధన: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశంలోని విద్యారంగంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషించనుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా, భారతదేశంలోని 30 కోట్ల మంది విద్యార్థులకు ఏఐ సాంకేతికతను చేరువ చేస్తామని ఆయన ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన 'ఏఐ కాంక్లేవ్-2026' సదస్సులో ఈ మేరకు కీలక నిర్ణయాలను వెల్లడించారు. కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని కేవలం ఉన్నత విద్యకే పరిమితం చేయకుండా, మూడో తరగతి నుంచే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి అధునాతన పరిశోధనలు చేసే స్థాయి విద్యార్థుల వరకు అందరికీ ఏఐ పరిజ్ఞానం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏఐ సాంకేతికత గణనీయమైన అభివృద్ధి సాధించిందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. కేవలం యంత్రంలా పనిచేయడమే కాకుండా, మనుషుల భావోద్వేగాలను కూడా అర్థం చేసుకునే స్థాయిలో ఏఐ అభివృద్ధి చెందడం గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు.

ఎడ్‌టెక్‌ స్టార్టప్‌లతో రౌండ్ టేబుల్ భేటీ
ఏఐ కాంక్లేవ్‌కు ముందు, ఢిల్లీలో మంత్రి అధ్యక్షతన 'ఎడ్‌టెక్‌ ఏఐ రౌండ్ టేబుల్' సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యారంగంలో ఏఐని ఉపయోగిస్తున్న 10 వినూత్న భారతీయ ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ల వ్యవస్థాపకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై, వారి ఆవిష్కరణలను పరిశీలించారు. దేశంలో మేధో సామర్థ్యానికి లోటు లేదని, యువత నూతన ఆవిష్కరణలకు సాంకేతిక సంస్థలు పూర్తిగా సహకరిస్తున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

2029 వరకు తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబజీగా సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతూనే, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, అశ్వినీ వైష్ణవ్‌లతో సమావేశమైన రేవంత్ రెడ్డి.. అనంతరం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో పాటు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

2029 వరకు నాదే పగ్గాలు.. నేనే రాజు.. నేనే మంత్రి
రాష్ట్రంలో వచ్చే పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయని అన్నారు. తెలంగాణలో నేనే రాజు, నేనే మంత్రి అని, తనకు పోటీ ఎవరూ లేరని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పదిన్నరేళ్ల పాటు పగ్గాలు తన చేతిలోనే ఉంటాయని పేర్కొంటూ, ప్రత్యర్థులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

ఫోన్ ట్యాపింగ్ - కేసీఆర్ జైలు ప్రస్తావన
ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరిందని, దర్యాప్తు ఆధారంగానే చర్యలు ఉంటాయని రేవంత్ తెలిపారు. తాము ఫోన్లు ట్యాప్ చేయడం లేదని, ట్యాప్ చేసిన సంభాషణలు వింటే ఆయుష్షు తగ్గుతుందని సెటైర్ వేశారు. కక్ష సాధింపు లేదని, కేసీఆర్‌ను జైల్లో వేయాలనుకుంటే నిబంధనల ప్రకారమే వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

కాళేశ్వరం - కేటీఆర్‌పై ఈడీ ఎక్కడ?
కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనం బాధ్యతను నిపుణుల కమిటీకి అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఖండించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ, కేటీఆర్‌ను ఎందుకు విచారించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ-రేసు అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే అన్ని డాక్యుమెంట్లను సభలో పెడతామని ఆయన హెచ్చరించారు.

ప్రధాని మోదీకి ఎన్డీఏ ఎంపీల ఘన సన్మానం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో నిర్వహించిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌పై అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు కలిసి ఘనంగా సత్కరించారు. అమెరికాతో కుదుర్చుకున్న చారిత్రక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిస్తుందని ఎంపీలు కొనియాడారు. ఈ విజయంతో పాటు కేంద్ర బడ్జెట్‌లో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను ప్రశంసిస్తూ ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదే వేదికపై బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కూడా ఎన్డీఏ నేతలు సాదరంగా సన్మానించారు.

ప్రజల్లోకి బడ్జెట్ ఫలాలు
అనంతరం ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. బడ్జెట్ ద్వారా కలిగే ప్రయోజనాలను సామాన్య ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాల అమలును క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పిలుపునిచ్చారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. దేశాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికీ చేరవేయాల్సిన బాధ్యత ఎంపీలదేనని గుర్తు చేశారు.

విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టండి
పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని ఘాటుగా స్పందించారు. విపక్షాలు చేసే నిరాధార ఆరోపణలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. సభలో వాస్తవాలను ధీటుగా వినిపిస్తూ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ లక్ష్యం కేవలం పాలన మాత్రమే కాదు, ప్రతి పౌరుడికీ అభివృద్ధి ఫలాలను అందించాలని... ఈ ప్రస్థానంలో ఎంపీలు వారధులుగా నిలవాలని పిలుపునిచ్చారు.

25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం: విజయసాయిరెడ్డి
విశ్వంభర, ఏపీ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిజాలను బయటపెట్టారు. పార్టీలో తన ప్రాధాన్యత, జగన్‌తో ఉన్న సంబంధాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.లిక్కర్ స్కామ్ గురించి తనకేమీ తెలియదని ఈడీ అధికారులకు స్పష్టంగా చెప్పానని అన్నారు. వైసీపీలో నంబర్ 2 స్థానంలో ఉన్న మీకు ఈ విషయం తెలియకపోవడమేంటని వారు ప్రశ్నించారు. దానికి సమాధానంగా.. స్వయంగా జగన్ గారే తనను నంబర్ 2 అని చెప్పారని వారికి వివరించాను. కానీ, వాస్తవానికి కేసుల విషయంలోనే తాను నంబర్ 2 అని వ్యాఖ్యానించారు. లాభాల విషయానికి వస్తే వంద స్థానాల తర్వాత కూడా తాను ఉండనని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తోందని ఆయన ఆరోపించారు. తాను రాజకీయాల నుండి తప్పుకోలేదని స్పష్టం చేస్తూ.. ఈ నెల 25 తర్వాత తన అసలు రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని విజయసాయిరెడ్డి సంకేతాలిచ్చారు.

జగన్ మనసులో 'వెన్నుపోటు' భయం!
2018 వరకు జగన్ మనసులో తనకు ప్రత్యేక స్థానం ఉండేదని, కానీ అధికారంలోకి వచ్చాక ఒక 'కోటరీ' తనను పక్కన పెట్టిందని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లు, తాను కూడా జగన్‌ను వెన్నుపోటు పొడుస్తాననే భయాన్ని ఆయనలో కల్పించారని..  అందుకే తనను సైడ్ చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. మీడియా, వైసీపీ సోషల్ మీడియా మాత్రమే తనను నంబర్ 2గా చూపిస్తున్నాయని.. అంతర్గతంగా పరిస్థితి వేరని వివరించారు.

కూటమి విడిపోతేనే జగన్‌కు ఛాన్స్
రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ.. ప్రస్తుత కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) బలంగా ఉన్నంత కాలం జగన్ అధికారంలోకి రావడం అసాధ్యమని విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు. కూటమి విడిపోతేనే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. జగన్ కూడా 20 ఏళ్లు ఉంటామనుకున్నారు.. ఇప్పుడు చంద్రబాబు కూడా 25 ఏళ్లు ఉంటానని భావిస్తున్నారు. కానీ ఏదీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు.

రిపబ్లిక్ డే టార్గెట్‌గా ఉగ్ర కుట్ర
విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారీ కుట్రకు తెరలేపింది. జనవరి 26న దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో భీకర దాడులు చేసేందుకు ‘26-26’ అనే కోడ్ నేమ్‌తో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ దాడుల వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు పక్కా సమాచారం అందింది. గణతంత్ర దినోత్సవం రోజున (జనవరి 26) విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా '26-26' పేరును నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  జమ్మూ కశ్మీర్, దిల్లీ, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని రద్దీ ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు. నిందితులు సోషల్ మీడియా వేదికగా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ, యువకులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

అప్రమత్తమైన భద్రతా బలగాలు
ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ నిఘాను ముమ్మరం చేసింది. పలువురు అనుమానిత ఉగ్రవాదుల ఫొటోలతో దిల్లీ పోలీసులు వాంటెడ్ నోటీసులు జారీ చేశారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్ల వద్ద బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానిత వస్తువులు కనిపిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.

రిపబ్లిక్ డే వేళ ఉగ్ర ముప్పు.. నిఘా వర్గాల హెచ్చరికలు
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. జనవరి 26న ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాలే లక్ష్యంగా ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ నివేదిక వెల్లడించింది. ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలు, బంగ్లాదేశ్‌కు చెందిన భారత్ వ్యతిరేక శక్తులు ఈ కుట్రకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందింది. దేశ అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు ఉగ్ర హ్యాండ్లర్లు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. నేరుగా రంగంలోకి దిగకుండా, స్థానిక గ్యాంగ్‌స్టర్లను పావులుగా వాడుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

హరియాణా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ ఉగ్ర నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తున్నట్లు సమాచారం. స్థానిక యువతను, నేరగాళ్లను రాడికల్ శక్తులుగా మార్చి దాడులకు పురమాయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ సరిహద్దులతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, కీలక ప్రభుత్వ కార్యాలయాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. పరేడ్ జరిగే పరిసర ప్రాంతాల్లో డ్రోన్లపై నిషేధం విధించడంతో పాటు సీసీ టీవీ నిఘాను ముమ్మరం చేశారు.

అప్రమత్తంగా ఉండాలని సూచన
అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు ప్రశాంతంగా జరిగేలా త్రివిధ దళాలు, పారామిలటరీ దళాలు, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు.

మహిళా శక్తి కార్యక్రమం అమలులో మన జిల్లా ఆదర్శంగా నిలవాలి
విశ్వంభర భూపాలపల్లి జూలై 24 : - మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికాభివృద్ది ని సాధించి పారిశ్రామిక వేత్తలు గా ఎదగాలని   భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళాశక్తి కార్యక్రమంపై మండల, జిల్లా మహిళా సమాఖ్యల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు, డిపిఎం లు, ఏపియంలు, సిసిలు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో  అవగాహన సమీక్షా సదస్సు నిర్వహించారు.
మహిళా సమాఖ్యల ద్వారా 13 అంశాలలో వ్యాపారులు నిర్వహణకు అవకాశం ఉన్నదని,   మహిళా శక్తి యూనిట్లు ఎంపికపై  మహిళా సమాఖ్య  సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.మహిళా శక్తి కార్యక్రమంపై  మహిళలకు అవగాహన కల్పించడానికి ఈ అవగాహన సదస్సు  ఏర్పాటు చేశామని అన్నారు.  జిల్లాలో 11 మండల, ఒక జిల్లా సమాఖ్యలున్నాయని తెలిపారు. 364 గ్రామ సమాఖ్యలు, 8050 మహిళా స్వయం సహాయక సంఘాల్లో 84645 మంది సభ్యులున్నారని తెలిపారు.  వీటిలో 66 దివ్యాన్గుల సంఘాలున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం 255.82 కోట్లు బ్యాంక్ లింకేజీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 61.06 కోట్లు లాక్ష్యాన్ని సాధించినట్లు ఆయన తెలిపారు.   రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళల  జీవనోపాధిని మెరుగుపరచడానికి  మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో అత్యంత పటిష్టమైన వ్యవస్థ మహిళా సంఘాలేనని ఆర్థిక సాధికారత,  సంపద సృష్టికి మహిళా సంఘాలు  కేంద్రాలుగా మారడం ద్వారా అర్థికాభివృద్ధి సాధనకు అవకాశం కలుగుతుందని తెలిపారు. 13  యూనిట్లు ఏర్పాటు లక్యం కాగా  4561 మందిని ఎంపిక చేయాల్సి ఉన్నట్లు తెలిపారు.
స్వయం సహాయ సంఘాల ద్వారా పలు రకాల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు ద్వారా వ్యాపారాలను ప్రోత్సహించి  మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించడం, మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాలను బలోపేతం చేయడం మహిళా శక్తి ప్రధాన  లక్ష్యమని అన్నారు. సూక్ష్మ తరహా పరిశ్రమలను గుర్తించి,  సంఘాలను ప్రోత్సహించడం, ఆయా సంఘాలలో మహిళలు తమ నైపుణ్యాలకు తగ్గ వ్యాపారులు ఎంచుకుని,  అవసరమైన నైపుణ్యాన్ని అందించడం ద్వారా వ్యాపారాభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహకారం కోసం బ్యాంక్ లింకేజీల ద్వారా రుణాలు అందుచేయనున్నట్లు తెలిపారు.  ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పనకు అవసరమైన ప్రణాళికలు, సహకారం అందివ్వడం మహిళాశక్తి పథక లక్ష్యమని అన్నారు.
మహిళా శక్తి పథకంలో జిల్లాలో  మైక్రో ఎంటర్ప్రైజెస్,  పర్మనెంట్ స్టిచింగ్ సెంటర్లు, పాడి గేదెల పెంపకం, మొబైల్ ఫిష్ అవుట్ లెట్, పాల డైరీల ఏర్పాటు,  మీ సేవా కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కష్టం హైయరింగ్ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్  తదితర 13 రకాల జీవనోపాదులు కల్పన జరుగుతుందని సూచించారు. మహిళా సంఘాలు  బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి పథకం అద్భుతమైన  కార్యక్రమమని, ఈ పథకాన్ని జిల్లాలో దిగ్విజయంగా అమలు చేసి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మన జిల్లాను ఆదర్శంగా తయారు చేయాలని  సూచించారు. మహిళా సంఘాలు ద్వారా
జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులు, అంగన్వాడీ చిన్నారులకు  ఏకరూప దుస్తులు కుట్టించే కార్యక్రమాన్ని చేపట్టామని, అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన పనులు అప్పగించామని తెలిపారు.  యూనిఫామ్స్ కుట్టే పనులు పూర్తి అయ్యాయని తదుపరి మాల్స్,   ఏజెన్సీల నుండి దుస్తుల ఆర్డర్లు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్డీఓ కు సూచించారు.  నాణ్యత పాటించడం వల్ల వ్యాపారం వృద్ది చెందుతుందని, తద్వారా మీరే ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని ఆయన తెలిపారు. మన జిల్లాలో ప్రసిద్ధి చెందిన కాళేశ్వరం, కొడవ టన్చ దేవాలయాలు,  పాండవుల గుట్ట వంటి పర్యాటక ప్రాంతాలు న్నాయని అలాంటి  తదితర జన సంచారం ఉండే  ప్రాంతాలలో క్యాంటీన్లు  ఏర్పాటు చేయాలన్నారు. ఆహార పదార్థాలు తయారులో నాణ్యత పాటించాలని అన్నారు.
ఇష్టపడి పనిచేస్తే చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుందని, తద్వారా  ఆర్థికాభివృద్ధి సాధన జరుగుతుందని తెలిపారు.  ఎంచుకున్న  వ్యాపార రంగాలపై గ్రామ, మండల, జిల్లా సమాఖ్య సమావేశాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.  మహిళా శక్తి పథకానికి ఆసక్తి, అనుభవం, చేయాలన్న సంకల్పం ఉన్న లబ్ధిదారులను ఎంపిక ఆగష్టు 1వ తేదీ వరకు ఎంపిక చేయాలని   కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో విజయ పాల సేకరణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తృణ ధాన్యాల తయారును కూడా ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని డిఆర్డీఓ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,  డిఆర్డిఓ నరేష్, అదనపు డిఆర్డిఓ గోవింద రావు, డిపిఎంలు, ఏపీఎంలు,  సిసిలు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బండారు మంజుల, కార్యదర్శి స్వరూప, మండల గ్రామ సమాఖ్యల  అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన ఇటలీ పర్యటన.. ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ
ఇటలీలో జీ7 దేశాల అవుట్ రీచ్ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇటలీ పర్యటనను ముగించుకుని తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. జీ7 సదస్సులో వివిధ దేశాధినేతలతో సమావేశమైన మోడీ వారితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తనకు ఇటలీలో ఘనమైన ఆతిథ్యం లభించిందని వెల్లడించారు.

దీన్నిబట్టి మోడీ ఇటలీ పర్యటన విజయవంతమైనట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తదితరులతో మోడీ అనేక విషయాలపై చర్చించారు. దేశంలో ఎన్డీయే కూటమి మూడో పర్యాయం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రధాని మోడీ చేపట్టిన మొదటి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.

జీ7 సదస్సులో ప్రధాని మోడీ ప్రత్యేక అతిథిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీని ప్రపంచ దేశాల నేతలు అభినందనలు తెలిపారు. ఇటలీ పర్యటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. జీ7 సదస్సు కేంద్రబిందువుగా సాగిన ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా జరిగిందని చెప్పారు. భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించే దిశగా నేతలందరూ ప్రతిన బూనారని తెలిపారు. ఘనమైన ఆతిథ్యం అందించిన ఇటలీ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.