cybercrime - Vishvambhara News

సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్‌లతో మోసం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్‌లతో జరిగే మోసాలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా కీలక వివరాలు వెల్లడించారు. ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లలో వెతకడం మనకు అలవాటు.. అయితే, ఈ అలవాటే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోందని తెలిపారు. సెర్చ్ ఇంజిన్లలో టాప్‌లో కనిపించే వెబ్‌సైట్లు లేదా 'స్పాన్సర్డ్' అని ఉన్న లింకులు అన్నీ సురక్షితమైనవి కావని గుర్తించాలన్నారు. కేవలం సెర్చ్ ఫలితాల్లో పైన కనిపించినంత మాత్రాన అది అసలైన వెబ్‌సైట్ అని గుడ్డిగా నమ్మితే నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఫిషింగ్ వెబ్‌సైట్లతో మోసం
సైబర్ ముఠాలు ఇప్పుడు అధునాతన 'సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్' పద్ధతులను, పెయిడ్ యాడ్స్‌ను ఆసరాగా చేసుకుంటున్నాయని సజ్జనార్ తెలిపారు. ప్రభుత్వ పోర్టల్స్, బ్యాంకులు, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లతో అచ్చం అసలైన వాటిని పోలి ఉండే 'ఫిషింగ్' వెబ్‌సైట్లను సృష్టిస్తున్నాయని తెలిపారు. వీటిని సెర్చ్ రిజల్ట్స్‌లో అగ్రస్థానంలో ఉండేలా జాగ్రత్త పడుతున్నాయని, వినియోగదారులు కస్టమర్ కేర్ నంబర్ల కోసం లేదా పేమెంట్ సర్వీసుల కోసం వెతికినప్పుడు, ఈ నకిలీ లింకులు పైన కనిపిస్తాయని తెలిపారు. అవి నిజమేనని నమ్మి క్లిక్ చేయగానే మోసం మొదలవుతుందని సూచించారు.

ఆర్థిక నష్టంతో పాటు ఐడెంటిటీ థెఫ్ట్ ప్రమాదం
ఈ నకిలీ వెబ్‌సైట్లలోకి వెళ్లిన వెంటనే మీ వ్యక్తిగత వివరాలు, లాగిన్ పాస్‌వర్డ్‌లు లేదా బ్యాంకింగ్ వివరాలను నమోదు చేయమని అడుగుతారని అన్నారు. ఒకసారి మీరు ఆ సమాచారాన్ని ఇస్తే, క్షణాల్లో మీ ఖాతా ఖాళీ అయిపోతుందని తెలిపారు. కేవలం ఆర్థిక నష్టమే కాకుండా, మీ పేరిట ఉన్న డాక్యుమెంట్లను దొంగిలించి 'ఐడెంటిటీ థెఫ్ట్'కు పాల్పడే అవకాశం కూడా ఉందని సీపీ హెచ్చరించారు.

రక్షణ మార్గాలు
వెబ్‌సైట్ అడ్రస్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. స్పెల్లింగ్ చిన్న తేడా ఉన్నా అది నకిలీదని గుర్తించాలి. సెర్చ్ ఇంజిన్లలో వెతకడం కంటే, అధికారిక వెబ్‌సైట్ చిరునామా తెలిస్తే నేరుగా అడ్రస్ బార్‌లో టైప్ చేయడం సురక్షితం.సెర్చ్ రిజల్ట్స్‌లో 'Sponsored' లేదా 'Ad' అని ఉంటే వాటిని క్లిక్ చేసేటప్పుడు రెట్టింపు అప్రమత్తత అవసరం. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయండి లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి.

సోషల్ మీడియా ట్రోలర్లపై అనసూయ ఫైర్..
విశ్వంభర, సినిమా బ్యూరో: ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అనుచిత దాడులపై చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ వేదికగా తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక వివరాలను పరిశీలించిన పోలీసులు, ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న సుమారు 42 మందిపై కేసులు నమోదు చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఒక ఇంటర్వ్యూతో మొదలైన విద్వేష ప్రచారం

గతేడాది డిసెంబర్ 23న ఒక మీడియా ఇంటర్వ్యూలో అనసూయ తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే, ఆ వ్యాఖ్యలను సాకుగా తీసుకుని సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు ఆమెపై ఒక వ్యవస్థీకృత క్యాంపెయిన్‌ తరహాలో దాడికి దిగారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, లైంగిక దూషణలు, బెదిరింపులు, అసభ్యకరమైన పోస్టులతో ఆమెను మానసిక వేదనకు గురిచేశారు. ఇది క్రమంగా ముదిరి క్రిమినల్ డిఫమేషన్, ఏఐ ఫోర్జరీ వంటి తీవ్రమైన నేరాలకు దారితీసిందని అనసూయ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.

రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు
అనసూయ సమర్పించిన పక్కా ఆధారాలు, సోషల్ మీడియా లింకులను పరిశీలించిన పోలీసులు ఈ కేసును అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. నిందితుల జాబితాలో సినీ రంగానికి చెందిన కరాటే కల్యాణి, శేఖర్ బాషా, విజయలక్ష్మి వంటి ప్రముఖులతో పాటు టీవీ యాంకర్లు రోహిత్, మనోజ్,  పలువురు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు ఉన్నారు. బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని వంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లను కూడా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. కేవలం వ్యక్తులే కాకుండా, తప్పుడు ప్రచారం చేసిన కొన్ని ఆన్‌లైన్ మీడియా పేజీలపై కూడా చర్యలకు ఉపక్రమించారు.

సాంకేతిక ఆధారాలతో విచారణ వేగవంతం
ఈ కేసులో ప్రధానంగా 'ఏఐ ఫోర్జరీ' (మార్ఫింగ్), లైంగిక వేధింపుల అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులు వాడిన ఐపీ అడ్రస్‌లు, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను సేకరిస్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను కించపరుస్తూ వ్యూస్ కోసం కంటెంట్ క్రియేట్ చేసే వారికి ఈ కేసు ఒక హెచ్చరికగా మారుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. త్వరలోనే నిందితులకు నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

దర్శకుడు తేజ కుమారుడికి రూ. 72 లక్షల టోకరా
విశ్వంభర తెలంగాణ బ్యూరో: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. స్టాక్ మార్కెట్, ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపిన ఒక జంట.. ఆయన నుంచి ఏకంగా రూ. 72 లక్షలు వసూలు చేసి మాయమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ దంపతులు అమితవ్ తేజను సంప్రదించి తమను ట్రేడింగ్ నిపుణులుగా పరిచయం చేసుకున్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలోనే ఊహించని లాభాలు గడించవచ్చని ఆయనను నమ్మబలికారు. వారి మాటలను విశ్వసించిన అమితవ్.. పలు దఫాలుగా మొత్తం రూ. 72 లక్షలను నిందితుల ఖాతాలకు బదిలీ చేశారు. డబ్బు తీసుకున్న తర్వాత నిందితుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అమితవ్ అనుమానం వ్యక్తం చేశారు. తన పెట్టుబడి గురించి, లాభాల గురించి నిలదీయగా వారు పొంతన లేని సమాధానాలు చెబుతూ కాలయాపన చేశారు. చివరకు ఫోన్ నంబర్లు మార్చేసి, ఆ దంపతులు పరారీ అవడంతో తాను మోసపోయానని గ్రహించిన అమితవ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపై ఐటీ యాక్ట్ సహా వివిధ సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. నిందితులు వాడిన బ్యాంక్ ఖాతాలు, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా ఈ దంపతులు ఇంకా ఎవరినైనా మోసం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 23 : - సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు(ఎం) ఎస్ఐ ఎస్ కృష్ణయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)  మండలంలోని కొరటీకల్ గ్రామంలో మంగళవారం రోజు  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఐ ఎస్ కృష్ణయ్య ఆధ్వర్యంలో  సైబర్‌నేరాలు, మూఢనమ్మకాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని చెప్పారు. సైబర్‌నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫీక్‌ నిబంధనలు పాటించాలన్నారు.యువత గంజాయి, డ్రగ్స్, మాదక ద్రావ్యాలకు దూరంగా వుండాలన్నారు. అలాగే సోషల్ మీడియా ప్రభావం చదువులకు అడ్డంకిగా మారిందని వీటికి దూరంగా వుండాలన్నారు. బాల్య వివాహాలు,మూఢనమ్మకాలు నేరమని తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా నేరమని తెలిపారు.ద్వీచక్ర వాహనదారుడు హెల్మెంట్‌ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్‌ పెట్టుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాసల్గొన్నారు

చండూరు లో సైబర్ మోసం...
చండూర్ , విశ్వంభర :- నల్గొండ జిల్లా , చండూర్ లో యూనియన్ బ్యాంక్ పేరుతో వీరమల్ల నాగరాజు అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా లింక్ పంపిన సైబర్ నేరగాళ్లు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ మెసేజ్ సారాంశం పంపించడంతో బ్యాంకు నుంచే వచ్చిందని లింక్ ఓపెన్ చేసిన బాధితుడు.లింక్ ద్వారా వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు ఇచ్చిన నాగరాజు..రెండు దఫాలుగా అకౌంట్ లో రూ లక్ష మాయం చేసిన సైబర్ మోసగాళ్ళు..పోలీసులకు పిర్యాదు చేసిన బాధితుడు నాగరాజు..అవగాహన లేకుండా బ్యాంకుల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని కొద్దిరోజులుగా హెచ్చరిస్తూనే ఉన్న పోలీసులు.అవగాహనా రాహిత్యం తో సైబర్ నేరగాళ్ల మాయలో పడుతున్న అమాయకులు..కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతామని పోలిసులు తెలిపారు

BREAKING: తెలంగాణ డీజీపీ పేరుతో వాట్సాప్‌లో బెదిరింపులు..!
సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఏకంగా పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల ఫొటోతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ డీజీపీ రవి గుప్తా పేరుతో వాట్సాప్‌లో బెదిరింపులకు పాల్పడటం కలకలం రేపింది. అమాయకులను మాదకద్రవ్యాల కేసులో ఇరికిస్తామని బెదిరించి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.

‘రూ.50వేలు ఇస్తే.. నిన్ను కేసు నుంచి తప్పిస్తాం’ అంటూ నమ్మిస్తున్నారు కేటుగాళ్లు. డీజీపీ ఫొటో వాట్సాప్ డీపీగా పెట్టి హైదరాబాద్‌లోని ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ చేశాడు అగంతకుడు. అతడి కూతురుకు సైతం ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం. ముందుగా వారిని మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఆ తర్వాత కేసు నుంచి తప్పించేందుకు రూ.50వేలు డిమాండ్ చేశారు.

అనుమానం వచ్చి ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దుండగుడు చేసిన వాట్సాప్ కాల్ +92 కోడ్‌తో ఉన్నట్లు గుర్తించారు. ఈ నెంబరు పాకిస్తాన్ కోడ్ అని సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.