Tirumala - Vishvambhara News

ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసు.. నిందితుడి ఫోటోలు వైరల్
Tirumala Hanuman Idol Theft: తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, పొట్నూరు యశ్వంత్ అనే వ్యక్తి విగ్రహాన్ని చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని టి. నగరపాలెం గ్రామానికి చెందినవాడని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, నిందితుడు నారా లోకేష్, గంటా శ్రీనివాసరావు సహా పలువురు టీడీపీ నేతలతో కలిసి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

కల్తీ నెయ్యి కేసులో 'సిట్' తుది ఛార్జిషీట్
విశ్వంభర, ఏపీ బ్యూరో: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసులో విచారణ ముగిసింది. సుమారు 15 నెలల పాటు, 12 రాష్ట్రాల్లో విస్తృతంగా సాగిన దర్యాప్తు అనంతరం సీబీఐ నేతృత్వంలోని సిట్ అధికారులు శుక్రవారం నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్‌ను సమర్పించారు. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న 24 మందిని నిందితులుగా పేర్కొనగా, మరో 12 మంది పాత్రపై విచారణ కొనసాగుతోందని కోర్టుకు వెల్లడించారు.

ఉత్తరాఖండ్‌కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్‌లను ఈ భారీ స్కామ్‌లో ప్రధాన సూత్రధారులుగా సిట్ నిర్ధారించింది. ఈ డెయిరీ కనీసం ఒక్క చుక్క పాలు కూడా సేకరించకుండానే, కెమికల్స్, పాల్ ఆయిల్‌ను మిక్స్ చేసి 'సింథటిక్ నెయ్యి'ని తయారు చేసిందని దర్యాప్తులో తేలింది. గతంలో బ్లాక్ లిస్ట్‌లో ఉన్నప్పటికీ, ఇతర డెయిరీల పేర్లను అడ్డం పెట్టుకుని టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఉన్నత స్థాయి బృందం ఈ విచారణను చేపట్టింది. కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మాత్రమే కాకుండా.. ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తులకు ఈ కల్తీ నెయ్యి నెట్‌వర్క్‌తో సంబంధం ఉందని సిట్ తేల్చింది.

కాలినడకన తిరుమల కొండ ఎక్కిన మెగా హీరో
మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ తిరుమల కొండకు కాలనడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నాడు. ఎన్నికల్లో తన బాబాయి పవన్ కల్యాణ్ గెలిస్తే కాలినడకన తిరుమల వస్తానని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మొక్కుకున్నాడు. ఆ మొక్కును తీర్చుకోవడానికి సాయిధరమ్‌తేజ్ కాలినడకన తిరుమలకు వెళ్లాడు. ఎన్డీయేలో భాగం అయిన జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లకు గాను 21 విజయం సాధించిన విషయం తెలిసిందే.

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్ర ఎంతో ఉందనే చెప్పాలి. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసినా పవన్ కల్యాణ్ ఎంతో ఓర్పుతో వ్యవహించారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కూడదు అనే ఉద్దేశంతో ఈసారి టీడీపీ, బీజేపీతో కలిసి పోటీచేశారు. పవన్‌కు తోడుగా పిఠాపురంలో ఆయన గెలుపునకు మెగా ఫ్యామిలీ అండగా నిలిచింది. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ పిఠాపురంలో ప్రచారం కూడా చేశారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలిపారు. ఫలితంగా పవన్ అద్భుత విజయం సాధించడంతో సాయి ధరమ్ తేజ్ తిరుమలకు కాలినడకన వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ గెలవడంతో కాలినడకన తిరుమలకు వెళ్లిన హీరో సాయి ధరమ్ తేజ్

పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న అల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్.. కోరిక తీరడంతో అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి వెళ్ళాడు. pic.twitter.com/TLSC2aeZkc

— Telugu Scribe (@TeluguScribe) June 15, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జీఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. చంద్రబాబు శ్రీవారిని దర్శించుకోవడానికి తగు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.

కాగా, తిరుమల నుంచి చంద్రబాబు విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అమరావతికి చేరుకుంటారు. సాయంత్రం ఆయన బాధ్యతల స్వీకరణ ఉంటుంది. ఇవాళ(గురువారం) సాయంత్రం 4.41 గంటలకు సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ చాంబర్‌లో చంద్రబాబు బాధ్యతలను స్వీకరిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, వృద్ధాప్య పింఛన్ల పెంపుపై మూడో సంతకం చేయనున్నట్లు సమాచారం.

అందుకే తిరుమల వెళ్లడం ప్రారంభించా: జాన్వీ కపూర్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ, శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ తరచూ తిరుమల వెళ్తుంటుంది. తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామివారిని దర్శించుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. తిరుమలకు తరచూ వెళ్లడానికి గల కారణాన్ని వివరించింది. తనతల్లి మరణించిన తర్వాత చాలా అలవాట్లను మార్చుకున్నట్లు జాన్వీ తెలిపింది.

‘అమ్మ కంటే నేనే ఎక్కువగా విశ్వసిస్తున్నా.. అమ్మ ఎప్పుడూ తిరుమల దేవుడి పేరును తలచుకుంటూ ఉండేది. షూటింగ్ గ్యాప్‌లో నారాయణ, నారాయణ అనుకుంటుండేది. ప్రతి ఏడాది పుట్టినరోజున స్వామివారిని దర్శించుకునేది. ఆమె చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి నేను ఆ గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అమ్మ లేకుండా మొదటిసారి తిరుమల వెళ్లినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యా. అక్కడికి వెళ్లిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే తరచు వెళ్తుంటాను’ అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.

తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో శ్రీవారి దర్శనానికి సుమారు 30 నుంచి40 గంటల సమయం పడుతోంది.. క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తోందని టీటీడీ పేర్కొంది.

అయితే, సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆది వారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇందుకుగాను, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపింది. ఈ మార్పును గమనించి భక్తులు టీటీడీకి సహకరించాల్సిందిగా కోరింది.

తిరుమలలో ఈసారి రెండు చిరుతలు.. భయం గుప్పిట్లో శ్రీవారి భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అయితే ఈసారి ఏకంగా రెండు చిరుతలు కనిపించి భక్తులను భయాందోళనకు గురిచేశాయి. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు రెండు చిరుత పులులు ఎదురయ్యాయి. భక్తులకు సమీప దూరంలోనే చెట్ల పొదల్లో కనిపించాయి. దీంతో.. భయంతో భక్తులు అరుపులు, కేకలు వేశారు. వెంటనే రెండు చిరుతలు అడవిలోకి పారిపోయాయి. అయితే మళ్లీ వస్తాయేమోనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారాన్ని టీటీడీ అధికారులకు అందించారు. దీంతో.. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

చిరుతలను బంధించేందుకు చర్యలు ప్రారంభించారు. అయితే.. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా మెట్లపై నడవొద్దని తెలిపారు. గుంపులు వెళ్లాలని అన్నారు. భక్తులు తమతో వచ్చే వృద్ధులు, చిన్న పిల్లలను తమ వెంటే పెట్టుకోవాలని అన్నారు. భయపడాల్సిన అవసరం లేదని.. త్వరలోనే చిరుతలను పట్టుకుంటామని అన్నారు. ఇప్పటికే బోనులు ఏర్పాటు చేశామని చెప్పారు. చిరుతలు చిక్కే వరకు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

టీటీడీ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. భక్తులకు చిరుత పులుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే చాలా సార్లు తిరుమలలో హల్ చల్ చేశాయి. గతంలో భక్తులపై దాడి చేసి గాయపడ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. చిరుత దాడి చేసిన తర్వాత టీటీడీ భక్తులకు చేతికర్రలు కూడా అందిస్తోంది. అయినా.. తరచూ చిరుతల సంచారం భక్తులను కలవపెడుతున్నాయి. ఐదు రోజుల క్రితమే తిరుమల ఘాట్ రోడ్డులో ఓ భక్తుడి కారుకు చిరుత అడ్డొచ్చింది. ఆ దృశ్యాలు సీసీ పుటేజీ‌లో కనిపించాయి.