raveparty - Vishvambhara News

రేవ్‌పార్టీ: నా విషయంలో నిరుత్సాహపడ్డారేమో: నవదీప్‌
ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లినట్లు రూమర్స్ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని నటుడు నవదీప్ అన్నాడు. 'ఏంటన్నా.. ఈసారి నువ్వు ఫేక్ న్యూస్‌లో కనిపించడంలేదు' అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపాడు. తన కొత్త సినిమా 'లవ్ మౌళి' ప్రచారంలో భాగంగా పాల్గొన్న ప్రెస్‌మీట్‌లో రేవ్ పార్టీ గురించి ప్రశ్నకు నవదీప్ స్పందించాడు.

అదేవిధంగా కొవిడ్ టైమ్‌లో ప్రేక్షకులకు 'ఓటీటీ' బాగా దగ్గరైందని నవదీప్ తెలిపాడు. ఇంట్లో కూర్చొనే అన్ని భాషల చిత్రాలను చూస్తున్నారని అన్నాడు. విజువల్ ఫీస్ట్ అనిపించే అగ్ర హీరోల సినిమాలు చూసేందుకు తప్ప థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదన్నాడు. థియేటర్లలో విడుదలైన రెండు, మూడు వారాలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తాయని ఆడియన్స్ భావిస్తున్నారని చెప్పుకొచ్చాడు. అయితే, తన చిత్రం విషయానికొస్తే.. దాని నిర్మాణం ఎలా జరిగిందన్న దానిపై ఓ సినిమా తీయొచ్చని తెలిపాడు. చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని పేర్కొన్నాడు.

మరోవైపు ‘చిత్ర పరిశ్రమకు సంబంధించి ఏదైనా అంశం సంచలనంగా మారితే.. మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు’ అంటూ ఓ విలేకరి ప్రశ్నించగా.. మంచే జరిగిందని, ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ చెప్పాడు. రేవ్ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపాడు. ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని వివరించాడు.

రేవ్ పార్టీ కేసులో సంచలన నిజాలు.. హేమపై పోలీసుల సీరియస్..!
బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఈ పార్టీలో 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 30 మంది యువతులు, 71 మంది పురుషులు ఉన్నారు. ఇప్పటికే బెంగళూరు పోలీస్‌ స్టేషన్‌కు మెడికల్‌ టీమ్స్ వెళ్లి అందరి దగ్గర బ్లడ్‌ శ్యాంపుల్స్ సేకరిస్తున్నాయి.

ఈ కేసులో నిర్వాహకుడు వాసుతో పాటు నలుగురు అరెస్టయ్యారు. నటి హేమ ప్రస్తుతం బెంగళూరు పీఎస్‌లోనే ఉన్నారు.  అయితే ఉదయం హేమ తాను రేవు పార్టీలో లేనని హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ ఓ వీడియో రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె బెంగళూరులోనే ఉండి ఆ వీడియో షూట్ చేసిందని పోలీసులు ఫొటోలు విడుదల చేశారు. హేమ ప్రజలను తప్పుదోవ పట్టించిందని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ విషయంపై పోలీసులు మరో కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ పార్టీలో నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన శ్రీకాంత్.. రేవ్ పార్టీలో పాల్గొనలేదని తనది అలాంటి సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లోనే తన ఇంట్లో ఉన్నానని తెలిపారు.

Flash: రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. హేమ ఫొటో లీక్..!
బెంగళూరులో ఆదివారం రాత్రి రేవ్‌ పార్టీకి సంబంధించి ఉదయం నుంచి టాలీవుడ్ నటి హేమ పాల్గొన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో హేమ ఓ వీడియోను విడుదల చేస్తూ బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని తెలిపింది. అనవసరంగా తన పేరును లాగొద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసు కీలక మలుపు తిరిగింది.

హేమ వీడియో బైట్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే బెంగళూరు పోలీసులు హేమను తాము అరెస్ట్ చేశామని ఒక ఫోటో రిలీజ్ చేశారు. హేమ ఏదైతే వీడియో బైట్ రిలీజ్ చేసిందో ఆ వీడియో బైట్‌లో ఉన్న డ్రెస్ పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో కూడా ఉండడం గమనార్హం. అయితే హేమ నిజంగానే బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉందా? లేక పోలీసులు అదుపులోకి తీసుకుని పూచికత్తు మీద విడిచి పెట్టారా? అనేది తెలియాల్సివుంది. అలా జరిగినా తనకు ఆ పార్టీతో సంబంధం లేదని ఎందుకు చెబుతోంది? అనే అంశాల చుట్టూ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉండగా, ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామాహౌస్‌లో హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించినట్లు సమాచారం. పోలీసులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి మద్యంతో పాటు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో దాదాపు 100 మందికిపైగా పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో ఎండీఎంఏ, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 20మందికి పైగా యువతులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది కానీ.. ఆయన నిన్న హైదరాబాదులోనే ఉన్నట్లు సమాచారం.