Harish Rao - Vishvambhara News

సంగమేశ్వర్, బసవేశ్వర్ ప్రాజెక్టుల పనులు వెంటనే ప్రారంభించాలి: హరీశ్‌రావు
Harish Rao: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ.. రైతులకు నీరందించాల్సిన కాలువల్లో కలుపు మొక్కలు మొలిచే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేగంగా సాగిన ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యంతో అధ్వానంగా మారాయని ఆరోపించారు. నర్సాపూర్ రెడ్డిపల్లి వద్ద నిలిచిపోయిన కాలువ పనుల సమీపంలో తాను తీసుకున్న సెల్ఫీని ప్రస్తావిస్తూ.. అది ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని హరీశ్‌రావు విమర్శించారు.

ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల పట్ల ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగమేశ్వర్, బసవేశ్వర్ ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్, ఆందోల్ ప్రాంతాలకు నీటిని తరలించే కాళేశ్వరం కాలువ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణకు వెంటనే నిధులు విడుదల చేయాలని హరీశ్‌రావు కోరారు. ప్రాజెక్టులను మధ్యలోనే నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిధులు తక్షణమే విడుదల చేసి పనులు ప్రారంభించకపోతే రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

హరీశ్‌రావుకు రాఖీ కట్టిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌
Thanneeru Harish Rao: రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు పలువురు సోదరీమణులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ కూడా హరీశ్‌రావుకు రాఖీ కట్టి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టడంతో హరీశ్‌రావు వారితో ఆత్మీయంగా గడిపారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా తనకు రాఖీలు కట్టిన సోదరీమణులందరికీ హరీశ్‌రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రేమాభిమానాలతో ఇలాంటి పండుగలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులు చూపించిన ప్రేమ, ఆప్యాయత తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని హరీశ్‌రావు తెలిపారు. అన్నాచెల్లెళ్ల మధ్య బంధం ఎల్లప్పుడూ ఇలాగే ప్రేమానురాగాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. రక్షాబంధన్‌ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హరీశ్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ULC భూములపై రేవంత్‌ సర్కార్‌ తీరును తప్పుబట్టిన హరీశ్‌రావు
Harish Rao: 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ULC భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించారని, అయితే ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2008 కంటే ముందు ULCలో ఉన్న భూములంటూ వాటిని మళ్లీ నిషేధిత జాబితాలో చేర్చిందని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. ఇలా చేయడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు. భూముల విషయంలో బాధితులుగా ఉన్న వారిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కబ్జాదారులుగా పేర్కొంటోందని విమర్శించారు. ULC భూముల వ్యవహారంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై స్పష్టత ఇవ్వాలని, బాధితులకు న్యాయం చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు.. హరీశ్‌రావు ఘన నివాళి
Harish Rao: తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవం, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఘన నివాళులు అర్పించారు. బహుజన వర్గాల రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం పాపన్న గౌడ్ చేసిన కృషి నేటి తరాలకు కూడా స్ఫూర్తిదాయకమని హరీశ్‌రావు అన్నారు.

సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతులను ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని హరీశ్‌రావు గుర్తు చేశారు. పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బహుజన వర్గాల చరిత్ర, త్యాగాలు, పోరాటాలను గుర్తిస్తూ వారి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.

అదేవిధంగా వేలాది మంది దళిత, బహుజన పిల్లలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేసిందని హరీశ్‌రావు అన్నారు. రాజకీయ అధికారంలో వెనుకబడిన వర్గాలకు తగిన వాటా కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో బహుజన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతో పాటు వారి అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం పనిచేశామని హరీశ్‌రావు తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన పోరాటాలను స్మరించుకోవడంతో పాటు, సమాజంలో సమానత్వం కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని హరీశ్‌రావు అన్నారు.

నల్లబెల్లికి కేటీఆర్, హరీశ్‌రావు.. పెద్ది సుదర్శన్‌రెడ్డి సంతాప సభకు హాజరు
Peddi Sudarshan Reddy: దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి సంతాప సభలో పాల్గొనేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు నల్లబెల్లికి బయలుదేరారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతితో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో ఉన్న నేపథ్యంలో నిర్వహిస్తున్న సంతాప సభకు కేటీఆర్, హరీశ్‌రావు హాజరై దివంగత నేతకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేయనున్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డితో తమకున్న అనుబంధాన్ని, పార్టీకి ఆయన చేసిన సేవలను నాయకులు గుర్తుచేసుకునే అవకాశం ఉంది. కేటీఆర్, హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నల్లబెల్లికి తరలివస్తున్నారు.

బట్ట కాల్చి నాపై వేస్తే ఊరుకోను.. కాంగ్రెస్‌కు హరీష్ రావు వార్నింగ్
Harish Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తనపై చేసిన క్షుద్రపూజల ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విమర్శలకు హద్దులు ఉండాలని స్పష్టం చేశారు. రాజకీయ విభేదాల పేరుతో నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే సహించబోనని హెచ్చరించారు. "బట్ట కాల్చి నా మీద వేయాలని చూస్తే ఊరుకునేది లేదు. నాలుక ఉందని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఉండను" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, స్కాములను తాను బయటపెడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.

గతంలో మంత్రి కొండా సురేఖ కూడా ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేసి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు, పరువు నష్టం దావాలు వేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే సంబంధిత వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపించామని, అవసరమైతే న్యాయపరంగా చివరి వరకు పోరాడతానని వెల్లడించారు.

రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చని, కానీ వ్యక్తిగతంగా దూషించడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హరీష్ రావు అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ఇకపై ఏమాత్రం సహించబోనని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

దేవాదుల జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్ రావు
Harish Rao: దేవాదుల ఎత్తిపోతల పథకం, సాగునీటి విడుదల అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు దేవాదుల, సమ్మక్క బ్యారేజీల నుంచి 105 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ వైపు విడుదల చేశారని, అయితే తెలంగాణ అవసరాల కోసం దేవాదుల ద్వారా కేవలం 1.9 టీఎంసీల నీటినే ఎత్తారని ఆయన ఆరోపించారు. 12 టీఎంసీల వరకు నీటిని ఎత్తే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని విమర్శించారు.

ఇది కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదని, రైతుల పట్ల జరిగిన తీవ్ర నిర్లక్ష్యమని హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించాల్సిన సమయంలో మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల వేలాది ఎకరాల పంటలు ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాకు సమీపంలోని రామప్ప డ్యాం పరిస్థితిని కూడా హరీష్ రావు ప్రస్తావించారు. డ్యాంలో నీరు ఉన్నప్పటికీ గేట్లు మూసివేయడంతో దిగువ ప్రాంత రైతులకు సాగునీరు అందడం లేదని, దీంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని అన్నారు. రైతులకు ఎప్పుడు నీరు ఇవ్వాలో తెలిసే అవగాహన ప్రభుత్వానికి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.

దేవాదుల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ జిల్లాలో సుమారు 3.17 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పూర్తి చేసిందని హరీష్ రావు తెలిపారు. మోటార్లు సకాలంలో నడిస్తే వరంగల్ జిల్లాకు సాగునీటితో పాటు తాగునీరు కూడా అందుతుందని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం మోటార్లు ఎందుకు ప్రారంభించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

గత ఏడాది నిర్వహణ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో దేవాదుల మోటార్లు సుమారు 50 రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని, దాని వల్ల రైతులకు భారీ నష్టం జరిగిందని హరీష్ రావు ఆరోపించారు. రూ.800 కోట్లకు పైగా విలువైన పంటలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ అనుభవం ఉన్నప్పటికీ ఈ ఏడాది కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

ఆరు నెలల ముందే ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని హరీష్ రావు అన్నారు. నీటి నిర్వహణ, సాగునీటి ప్రణాళిక విషయంలో ప్రభుత్వం ముందుచూపు చూపలేదని విమర్శించారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.

ఎనిమిది రోజుల క్రితం కాంగ్రెస్ మంత్రులు దేవాదుల మోటార్లన్నీ ప్రారంభిస్తామని ప్రకటించారని, అయితే ఇప్పటికీ అన్ని మోటార్లు పనిచేయడం లేదని హరీష్ రావు అన్నారు. గతంలో ఏడు మోటార్లు నడిస్తే ప్రస్తుతం ఐదు మాత్రమే పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 10 మోటార్లు నడిపి 22 రిజర్వాయర్లను నింపి 38 టీఎంసీల నీటిని ఎత్తుతామని ప్రకటించారని, కానీ ఆ హామీలు అమలు కాలేదని ఆరోపించారు.

ప్రభుత్వ హామీలను నమ్మి రైతులు నారుమళ్లు పోసుకున్నారని, ఇప్పుడు వారికి సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీష్ రావు అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెంటనే దేవాదుల మోటార్లను పూర్తిస్థాయిలో ప్రారంభించి, సాగునీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Published By S. Asha Bhanu

బండి సంజయ్ కేంద్రమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టకరం : జగ్గారెడ్డి
విశ్వంభర,సంగారెడ్డి: కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో డ్యామ్ సేఫ్టీ అధికారులతో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుల సమావేశం ఏర్పాటు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు బయటపడతాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి పాలనపై పూర్తి అవగాహన లేకుండానే విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించినట్లుగా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని, రాజకీయ వ్యాఖ్యలు కాకుండా వాస్తవాలను ప్రజల ముందుంచాలని అన్నారు. పదేళ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ కలిసి పాలన సాగించాయని, ఆ సమయంలో ఇరు పార్టీలకు రాజకీయ సంబంధాలు ఉన్నాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల శాఖ బీజేపీ ఆధీనంలోనే ఉన్నందున కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తే అన్ని విషయాలు స్పష్టమవుతాయని అన్నారు.మాజీ మంత్రి హరీశ్‌రావు మాదిరిగానే బండి సంజయ్ కూడా వాస్తవాలను పక్కనపెట్టి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. హరీష్ కు పట్టిన రోగమే బండికి పట్టిందని విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి హోదాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై స్పందిస్తూ, ఆ అంశంపై పీసీసీకి అందజేయాల్సిన నివేదికను వాయిదా వేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు.తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై రెండు రోజుల పాటు వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించామని చెప్పారు. ఇన్‌చార్జి మంత్రి లక్ష్మణ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సి ఉన్నందున నివేదిక సమర్పణకు మరికొంత సమయం అవసరమైందన్నారు. ఈ నెల 18 లేదా 20వ తేదీలోపు పీసీసీకి పూర్తి నివేదిక అందజేస్తామని తెలిపారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ నాయకులందరూ సమన్వయంతో పనిచేసేలా నిర్ణయం తీసుకుంటామని, రానున్న ఎన్నికల్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు

హరీశ్ రావు అబద్ధాలతో సీఎం రేవంత్, ఉత్తమ్ ను బద్నామ్ చేస్తున్నారు: జగ్గారెడ్డి
విశ్వంభర,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ప్రాజెక్టు దెబ్బతినడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం సమంజసం కాదని అన్నారు.కట్టించింది మీరే, కూలిపోయింది మీ హయాంలోనే. దీనికి బాధ్యత మీదే" అని వ్యాఖ్యానించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం అంశంపై చర్చించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించాలని జగ్గారెడ్డి కోరారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు.హరీష్ రావు ప్రతిరోజూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని, అయితే తాను సాగునీటి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన లోపాలపై బాధ్యత వహించాల్సింది బీఆర్ఎస్ నాయకత్వమేనని పేర్కొన్నారు.హరీష్ రావును సాగునీటి శాఖ మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారో కేసీఆర్ ప్రజలకు వివరించాలని జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాల కారణంగానే ఆయనను మార్చారని ఆరోపించారు.
డ్యామ్ భద్రత విషయంలో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నీటి నిల్వలపై కేంద్ర సంస్థ హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల ప్రజల భద్రత కూడా ముఖ్యమని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వల నిర్వహణలో జరిగిన తప్పిదాల వల్లే మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిందని జగ్గారెడ్డి అన్నారు. దీనికి అప్పటి ప్రభుత్వం, సంబంధిత శాఖే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే అసెంబ్లీ చర్చకు కేసీఆర్, హరీష్ రావు హాజరై ప్రజల ముందే వాస్తవాలను వెల్లడించాలని సవాల్ విసిరారు.
హరీష్ రావు తన రాజకీయ స్థాయి గురించి మాట్లాడే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో సాధించిన ప్రస్థానాన్ని గుర్తు చేసుకోవాలని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ రాజకీయ జీవితంలో స్వయంకృషితో ఎదిగారని, బంధుత్వాల ఆధారంగా పదవులు పొందలేదని వ్యాఖ్యానించారు.
చివరగా, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి కారణమైన వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం మానుకుని ప్రజలకు సమాధానం చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సీఎం Vs ఒరిజినల్ కాంగ్రెస్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనుల టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్, బీజేపీల వైఖరిపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నైనీ బ్లాక్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి, ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఈ టెండర్లు సాగుతున్నాయని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు.

ఆరు గ్యారంటీలు గాలికొదిలేశారు..
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం పక్కన పెట్టిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు కేవలం కమీషన్లు, వాటాల కోసమే కొట్టుకుంటున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల టెండర్లు, గనుల కేటాయింపుల్లో వాటాల కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదిరిన అంతర్గత పోరు..
రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ముదిరిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. "రాష్ట్రంలో ఇప్పుడు అవుట్ సోర్సింగ్ సీఎంకు, అసలైన కాంగ్రెస్ వాదులకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది" అని ఆయన ఆరోపించారు. పాలనపై పట్టు కోల్పోయి, గ్రూపు రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. పారదర్శకత లేని టెండర్లను వెంటనే రద్దు చేయాలని, గనుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు తలమానికమైన సింగరేణిని కాపాడాలని అన్నారు.

సర్కారా.. సర్కస్ కంపెనీనా?
విశ్వంభర, బ్యూరో: తెలంగాణ సచివాలయంలో ప్రస్తుతం థియేటర్ల కంటే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉందనే అనుమానం ప్రజలకు కలుగుతోందని మండిపడ్డారు.  సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలియకుండానే టికెట్ల ధరల పెంపు ఫైళ్లు కదులుతున్నాయా ప్రశ్నించారు. "నా ప్రమేయం లేదు.. నా దగ్గరకు ఫైల్ రాలేదు" అని మంత్రి అనడం హాస్యాస్పదమన్నారు. క్యాబినెట్ మంత్రికి తెలియకుండా జీవోలు రావడం ప్రజా పాలననా? లేక పాపిష్టి పాలననా? అని నిలదీశారు. ఓడిపోయిన ఒక వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా మారి, సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, ఒక్కో సినిమాకు కోట్ల రూపాయిల కమీషన్ల దందా సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలకు, ఇప్పుడు జరుగుతున్న పనులకు పొంతన లేదని దుయ్యబట్టారు. తాను సీట్లో ఉన్నంత కాలం రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు అని మైకు పట్టుకుని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రాత్రికి రాత్రే మూడు సినిమాలకు రేట్లు ఎలా పెంచారు?" అని నిలదీశారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమన్నారు. ఐటీ మంత్రిని నేనే.. సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖతో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారని, టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కోమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని చెప్పినందుకు ఒక హీరోపై, పేరు మర్చిపోయినందుకు మరో హీరోపై కక్ష కడుతున్నారని, నచ్చిన వాళ్లకు మాత్రం రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తూ రాచమర్యాదలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో  సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడటం వల్లే తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి చేరిందని గుర్తు చేశారు. ఈ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ 'టికెట్ రేట్ల కమిషన్ల దందా'పై గవర్నర్ దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ చీకటి ఒప్పందాల వివరాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు.

KTR: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్‎కి బుద్ధి చెప్పడం ఖాయం: కేటీఆర్
రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత రెండేళ్లుగా పట్టణాలను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రెండు సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా పట్టణాలకు విడుదల చేయని ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పాలనలో పట్టణాల పరిపాలన పూర్తిగా దెబ్బతిందని, పారిశుద్ధ్యం నుంచి తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల వరకు ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించి, నిధులు కేటాయించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేవలం మళ్లీ శిలాఫలకాలు వేయడం తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీలేదన్నారు. రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మోడల్ మార్కెట్లు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు నిలిపివేయడంతో అవన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు.

ఒకవైపు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టుతూ, మరోవైపు పట్టణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని కేటీఆర్ అన్నారు. ఈ రెండేళ్లలో పట్టణాలకు ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందుంచి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు.

మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా కేటీఆర్ హైదరాబాద్‌లో నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పార్టీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న పురపాలక ఎన్నికల వ్యూహాలు, పార్టీ చేయాల్సిన ఏర్పాట్లు, ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రెండు జిల్లాల్లోని ప్రతి మున్సిపాలిటీలోని క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్ సమగ్రంగా సమీక్షించారు.

పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు, అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొని పార్టీ మంచి ఫలితాలు సాధించిందని గుర్తు చేసిన కేటీఆర్, అదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన విజయాలు సాధించాలని నేతలకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా పాల్గొని, కలిసికట్టుగా సమిష్టిగా పోరాడితే విజయం తప్పక సాధ్యమని అన్నారు. పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై హరీష్ రావు నేతలకు పలు సూచనలు చేశారు.

జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను నేతలు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, పార్టీకి అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని వారు నాయకత్వానికి తెలియజేశారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే సంకల్పంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయని సమావేశంలో స్పష్టం అయ్యింది.