viral video - Vishvambhara News

అయ్యో పాపం.. నిజమైన అమ్మ అనుకుని పరుగు తీసిన దూడ! గుండెల్ని పిండేసే వీడియో
Viral Video: రోడ్డుపై చోటుచేసుకున్న ఓ హృదయాన్ని కదిలించే దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు వెనుక భాగంలో ఆవు చిత్రాన్ని చూసిన చిన్న దూడ.. అది తన తల్లేనని భావించింది. తల్లి ప్రేమ కోసం, ఆకలి తీర్చుకునేందుకు ఆ అమాయక దూడ కదులుతున్న ట్రక్కు వెంట పరుగెత్తింది. ఆ చిత్రంలో ఆవు ఎంతో సహజంగా కనిపించడంతో దూడ దాన్ని నిజమైన ఆవుగా భావించినట్లు కనిపించింది.

ట్రక్కు ముందుకు వెళ్తున్నా దూడ మాత్రం దాని వెంట పరుగులు తీస్తూనే ఉంది. ముఖ్యంగా చిత్రంలో కనిపిస్తున్న పొదుగు భాగాన్ని చూసి పాలు తాగేందుకు పదేపదే ఎగురుతూ ప్రయత్నించింది. వాహనం వేగంగా కదులుతున్నా పట్టించుకోకుండా కేవలం ఆకలి, తల్లి కోసం ఉన్న ఆరాటంతో దూడ చేసిన ప్రయత్నం చూపరులను కదిలించింది. అది ప్రాణం లేని చిత్రం మాత్రమేనన్న విషయం తెలియని ఆ చిన్న జీవి తల్లి కోసం పడిన తపనను చూసి అక్కడున్న వారు చలించిపోయారు.

ఈ హృదయాన్ని కదిలించే దృశ్యాలను కొందరు ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు దూడ అమాయకత్వంపై భావోద్వేగ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. తల్లి పట్ల మూగజీవాలకు ఉండే అనుబంధం ఎంత బలంగా ఉంటుందో ఈ ఘటన మరోసారి చూపించిందని కామెంట్లు చేస్తున్నారు. నిజమైన తల్లిని పోలిన చిత్రాన్ని చూసి దాని వెంట పరుగెత్తిన ఆ చిన్న దూడ దృశ్యం ప్రతి ఒక్కరి మనసును తాకుతోంది.

బావిలో సముద్ర అలలు!.. గుజరాత్‌లో వింత ఘటన కలకలం
Gujarat Well Waves: గుజరాత్‌లో ఓ బావిలో నీరు సముద్ర అలల్లా ఎగసిపడుతున్న అరుదైన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోని విర్పర్దా గ్రామంలో రైతు ప్రాంజీవన్ భాయ్‌కు చెందిన పొలంలోని బావిలో ఈ అసాధారణ కదలికలు కనిపించడంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. బావిలో నీరు నిరంతరం అలల మాదిరిగా కదులుతుండటంతో ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

స్థానికుల సమాచారం.. మంగళవారం కొంతసేపు ఈ కదలికలు తగ్గినప్పటికీ, బుధవారం మళ్లీ అదే స్థాయిలో నీటిలో అలలు కనిపించాయి. భూమిలోని రాతి పొరల మధ్య చిక్కుకున్న వాయువుల ఒత్తిడి కారణంగానే ఈ తరహా కదలికలు ఏర్పడి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత కోసం భూగర్భ శాస్త్ర నిపుణులతో సమగ్ర పరిశీలన చేపట్టారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. బావిలో కనిపిస్తున్న అలల వెనుక గల అసలు కారణాలను శాస్త్రీయంగా పరిశీలిస్తున్నామని, నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

బావిలో సముద్ర అలలను తలపించే ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ప్రకృతి సృష్టించిన ఈ వింత దృశ్యం స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

రోగి ప్రాణాల కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన వైద్య బృందం
Japan Earthquake: వైద్య వృత్తి ఎంత గొప్పదో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన ఘటన జపాన్‌లో వెలుగుచూసింది. జపాన్‌లోని కుమమొటో ప్రాంతంలో సంభవించిన 7.1 తీవ్రత భూకంపం సమయంలో ఆస్పత్రిలో జరిగిన దృశ్యాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోగి ప్రాణాలను కాపాడిన వైద్యులు, నర్సుల సేవాభావానికి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలుపుతున్నారు.

భూకంపం కారణంగా ఆస్పత్రి భవనం ఒక్కసారిగా బలంగా ఊగిపోవడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో ఓ రోగికి శస్త్రచికిత్స కొనసాగుతోంది. ప్రాణభయంతో బయటకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ.. అక్కడి వైద్యులు, నర్సులు మాత్రం తమ బాధ్యతను వదిలిపెట్టలేదు. ఆపరేషన్ టేబుల్‌పై ఉన్న రోగి చుట్టూ రక్షణగా నిలబడి, ఎలాంటి తొందరపాటు లేకుండా శస్త్రచికిత్సను కొనసాగించారు.

భూకంపం ప్రకంపనల మధ్య కూడా వైద్య బృందం అసాధారణ ధైర్యం, ఏకాగ్రతతో వ్యవహరించింది. వారి సమయస్ఫూర్తి, సేవాభావం కారణంగా శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికాగా, రోగి ప్రాణాలు సురక్షితంగా నిలిచాయి. ఈ ఘటన ఆస్పత్రిలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డుకాగా, ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు వైద్య బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమ ప్రాణాల కంటే రోగి ప్రాణానికే ప్రాధాన్యం ఇచ్చిన వైద్యుల అంకితభావం నిజంగా ఆదర్శప్రాయమని కొనియాడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ విధి నిర్వహణకు కట్టుబడి నిలిచిన ఆ వైద్యులు, నర్సులు వైద్య వృత్తి గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వియత్నాంలో భారతీయ పర్యాటకుడి నిర్వాకం.. క్యాబ్ ఛార్జీ చెల్లించకుండా పరార్
Vietnam Indian Tourist: మనోళ్లు మారరు.. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తమ బుద్ధులను వదులుకోరని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి అక్కడ మన దేశ పరువును బజారున పడేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా వియత్నాంలో ఓ భారతీయ పర్యాటకుడు చేసిన పనికి భారతీయుల పట్ల ఉన్న గౌరవం కాస్తా గంగలో కలిసిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి!

ఉచిత ప్రయాణం.. భారతీయుడి చేతివాటం

సంఘటన వివరాల్లోకి వెళ్తే.. గౌరవ్ అగర్వాల్ అనే పర్యాటకుడు వియత్నాంలో ఒక క్యాబ్‌ను బుక్ చేసుకున్నాడు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత మీటర్ ఛార్జీ చెల్లించాల్సి రాగా.. నా దగ్గర రూపాయి లేదంటూ ఏమీ తెలియనట్లు జారుకున్నాడు. సదరు డ్రైవర్ "డబ్బులు ఇవ్వండి సార్" అని ఎంత వేడుకున్నా.. గౌరవ్ కనీసం కరుణించకుండా, సమాధానం కూడా చెప్పకుండా అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో నిరాశకు గురైన డ్రైవర్, ఆ భారతీయుడి ఘనకార్యాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో కాస్తా రచ్చగా మారింది.

ఒక విదేశీయుడి ఉపాధిని దెబ్బతీయడమే కాకుండా.. భారతీయులందరి ఇమేజ్‌ను చెడగొట్టాడని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో నెటిజన్లలో భిన్నమైన అభిప్రాయాలు, తీవ్ర వివాదం రేగుతోంది. మన దేశంలో అలవాటైన ఉచితాల అలవాట్లను, తెలివితేటలను విదేశాల్లో కూడా ఉపయోగిస్తున్నారా? ఒకరిద్దరు చేసే ఇలాంటి దిగజారుడు పనుల వల్ల రేపు విదేశాల్లో భారతీయులకు రుణాలు, క్యాబ్‌లు, రూమ్‌లు ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుందని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు.

మరికొందరు మాత్రం "ఎక్కడైనా మంచి, చెడు మనుషులు ఉంటారు. ఒక్క గౌరవ్ అగర్వాల్ చేసిన చిల్లర పనికి మొత్తం 140 కోట్ల మంది భారతీయులను నిందించడం సరికాదని వాదిస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఉచితాలు అనుభవించడం, రూల్స్ అతిక్రమించడం, ఛార్జీలు ఎగ్గొట్టడం లాంటి పనులు మన దేశ సంస్కృతిని కాదని, దిగజారుడుతనానికి నిదర్శనమని పర్యాటక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా విదేశాలకు వెళ్లే భారతీయులు బాధ్యతగా ప్రవర్తించకపోతే.. ప్రపంచ పటంలో భారత పర్యాటకుల ఇమేజ్ తీవ్రంగా దెబ్బతినడం ఖాయం!

క్లాస్‌లో టీచర్ నిద్ర.. మొబైళ్లతో బిజీ అయిన విద్యార్థులు.. ఎక్క‌డంటే?
Teacher Sleeping Viral Video: ఒకప్పుడు పాఠశాల అంటే ఒక పవిత్రమైన గుడి.. గురువు అంటే ప్రత్యక్ష దైవం! ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి అడుగుపెడితే క్రమశిక్షణ, శ్రద్ధ, నేర్చుకోవాలనే తపన కనిపించేవి. ఏ విద్యార్థి అయినా పాఠం వినకుండా నిద్రపోతే గురువు మందలించి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దేవారు. కానీ కాలం మారింది.. విలువలు తలకిందులయ్యాయి! నేడు కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపం విద్యా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇందుకు ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా ఉమర్దా బ్లాక్ పరిధిలోని సిక్రోరీ కాంపోజిట్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన ఉదాహరణగా నిలిచింది.

వైరల్ అవుతున్న వీడియో..

ఓ ఉపాధ్యాయుడు తరగతి గదిలో బల్లపై తలవాల్చి నిద్రపోతుండగా, ఎదురుగా కూర్చున్న విద్యార్థులు ఎలాంటి పాఠాలు లేకుండా మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ కనిపించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, పర్యవేక్షణ, ఉపాధ్యాయుల బాధ్యతలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. వీడియో వెలుగులోకి రావడంతో స్థానిక విద్యాశాఖ అధికారులు ఘటనపై దృష్టి సారించారు. వైరల్ వీడియోలోని అంశాలపై విచారణ చేపట్టి, వాస్తవాలు నిర్ధారించిన తర్వాత బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది.

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ఎదుట యువతి రీల్స్.. వైరల్ వీడియో
Vijayawada Kanaka Durga Temple: విజయవాడలోని ప్రసిద్ధ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం గాలిగోపురం ఎదుట ఓ యువతి రీల్స్ చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం సమీపంలో యువతి వీడియోలు చిత్రీకరించి వాటిని సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లలో చర్చ మొదలైంది. ఆలయం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో రీల్స్, వీడియో షూటింగ్ చేయడం క‌రెక్టేనా అనే అంశంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి చర్యలు నివారించాలని సూచిస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందిస్తారా? ఆలయ ప్రాంగణంలో వీడియో చిత్రీకరణకు సంబంధించి ఉన్న నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తారా? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. అయితే ఈ ఘటనపై ఆలయ అధికారులు లేదా పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

సారా తాగితే చిరుత ఎలా ఉంటుందో చూశారా?
Leopard Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. అడవి నుంచి బయటకు వచ్చిన ఓ చిరుత నేరుగా అక్రమ సారా బట్టీ వద్దకు వెళ్లిందని, అక్కడ ఉన్న మద్యం తాగిందనే ప్రచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా గర్జిస్తూ అందరినీ పరుగులు పెట్టించే చిరుత, అక్కడ మాత్రం ఎంతో ప్రశాంతంగా కూర్చోవడంతో నెటిజన్లు తమదైన స్టైల్లో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

"మనుషులు 90 ఎంఎల్ వేస్తేనే సింహాన్ని కూడా ఆపగల ధైర్యం వచ్చేస్తుంది... అలాంటిది పులి సారా తాగితే ఇంకెలా ఉంటుందో!", "జంగిల్ బార్‌కు తొలి కస్టమర్ ఇదేనా?", "వేటకు వెళ్లాల్సింది పోయి... మత్తులో రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయిందేమో!", "ఈరోజు వేట క్యాన్సిల్... చిల్ డే!" అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

అయితే గ్రామస్తులు మాత్రం సరదా చేయకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. చిరుతను రెచ్చగొట్టకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది చిరుతను సురక్షితంగా అదుపులోకి తీసుకుని తిరిగి అడవిలోకి పంపించారు.

ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. 300 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన కారు..!!
ఇటీవల సోషల్ మీడియాకు యువతకు వ్యసనంగా మారింది. దీంతో లైకులకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ చేసేందుకు కొత్త దారులను వెతుకుతున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్‌ చేసేందుకైనా వెనుకాడటం లేదు. ఈ క్రమంలో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువతి ఇన్‌స్టా గ్రామ్ రీల్ కోసం డ్రైవింగ్ రాకున్నా కారు నడిపేందుకు సిద్ధమై ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.

మహారాష్ట్రాలోని ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో ఉన్న దత్ ధామ్ టెంపుల్ కొండపై ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్వేతా సుర్వసే(23) అనే యువతి డ్రైవింగ్ రాకున్నా రీల్స్ కోసం కారు నడిపేందుకు సిద్ధమైంది. అది గ్రౌండ్‌లో.. లేక రోడ్డుపై అయితే బాగానే ఉండేది. కానీ ఆ యువతి ఏకంగా కొండపై కారు స్టీరింగ్ పట్టింది. తనతో పాటు ఉన్న స్నేహితుడు శివరాజ్ ములే వీడియో తీస్తుండగా సదరు యువతి కారు స్టార్ట్ చేసింది.

వీడియో రికార్డు అవుతుండగానే ఆ యువతి రివర్స్ గేర్ వేసి కారును వెనక్కి పోనిచ్చింది. ఈ క్రమంలో బ్రేక్ వేయడానికి బదులుగా యాక్సిలరేటర్‌ను నొక్కింది. ఇంకేముంది.. సుమారు 300 అడుగుల ఎత్తు ఉన్న ఆ కొండపై నుంచి కారు కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో శ్వేతా సుర్వసే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

रील्स बनविताना सावधानी बाळगा. रीलच्या नादात कार रिव्हर्स घेताना ब्रेक ऐवजी पाय एक्स्लेटरवर पडल्याने कार थेट दरीत कोसळून तरुणीचा मृत्यू! छत्रपती संभाजीनगर जवळील शुलीभंजन येथील घटना. #Reels #Chhtrapati_Sambhajinagar pic.twitter.com/rkzbFY6kL4

— Nandkishor Patil (@Nandupatil67) June 17, 2024

షాకింగ్.. ఐస్‌క్రీమ్ బాక్స్‌లో జెర్రి
స్ట్రీట్ ఫుడ్‌తో పాటు ఆన్‌లైన్‌లో ఏం కొందామన్నా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బిర్యానీలు, శీతలపానీయాల విషయంలో ఆ జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది.  ఈ మధ్య వైరల్ అవుతున్న వీడియోలే ఇందుకు కారణం. ఇటీవల ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన ఓ డాక్టర్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. అందులో ఏకంగా మనిషి వేలు కనిపించడంతో ఆ మహిళా డాక్టర్ కంగుతిన్నది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా అలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అమూల్ ఐస్ క్రీమ్ బాక్స్‌లో జెర్రి ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది. యూపీలోని నోయిడాకు చెందిన దీప అనే మహిళ ఆన్‌లైన్‌లో బ్లింకిట్ ద్వారా అమూల్ ఐస్‌క్రీమ్ బాక్స్‌ ఆర్డర్ పెట్టింది.

అయితే కొద్దిసేపటికి డెలివరీ బాయ్ ఐస్‌క్రీమ్ బాక్స్‌ను డెలివరీ చేశాడు. చల్లచల్లని ఐస్‌క్రీమ్‌ రుచిచూద్దామని బాక్స్ ఓపెన్ చేశారు. ఊహించని విధంగా అందులో జెర్రి ప్రత్యక్షమవడంతో ఆ మహిళ షాక్ అయింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు కొంతమంది తెలంగాణ ప్రభుత్వం అమూల్ ఐస్‌క్రీమ్ విక్రయాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని కోరుతున్నారు.

అమూల్ ఐస్‌క్రీమ్ బాక్స్‌లో జెర్రీ

ఉత్తరప్రదేశ్‌ - నోయిడాలో దీప అనే మహిళ తాను ఆన్‌లైన్‌లో బ్లింకిట్ ద్వారా ఆర్డర్ చేసిన అమూల్ ఐస్‌క్రీమ్ బాక్స్‌ ప్యాక్‌ను తెరిచినప్పుడు జెర్రీ వచ్చిందని తెలిపింది. pic.twitter.com/l1CBiiugqJ

— Telugu Scribe (@TeluguScribe) June 16, 2024

జగన్‌ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం పరిపాలనపై దృష్టి కేంద్రీకరిస్తూనే వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదని.. చచ్చేవరకూ కొట్టాలని టీడీపీ నేతలతో ఆయన సంభాషించడం చర్చనీయాంశమైంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ‘‘వైఎస్ జగన్‌కు అపారమైన జన, కుల బలం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్‌గా ఉండే వారు..  చెప్పింది కరెక్ట్‌గా రిసీవ్ చేసుకోండి..’’ అంటూ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదిలా ఉండగా నాగబాబు కూడా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ‘‘వైసీపీ కోరల్లో విషం మిగిలే ఉంది.. కూటమిపై విషప్రచారం చేసేవాళ్లను వదలం.. బీ కేర్‌ఫుల్..’’ అంటూ నాగబాబు హెచ్చరించారు.

జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు

అతనికి అపారమైన జన, కుల బలం ఉంది

తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్ గా ఉండే వారు ఉన్నారు అంటూ తెలుగు దేశం పార్టీలో చర్చ pic.twitter.com/Hf8Qpsky0K

— ఈశ్వర రెడ్డి (@eswarspeaks) June 14, 2024

పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్న నారా లోకేశ్
ఏపీలో బుధవారం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా పవన్ కల్యాణ్, నారా లోకేశ్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. సభా కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కాళ్లు పట్టుకున్నారు నారా లోకేశ్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పవన్ కల్యాణ్ వద్దని వారిస్తున్నా నారా లోకేశ్ వినిపించుకోలేదు. సోదరసమానులైన వ్యక్తి ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పులేదంటూ ఆయన పాదాలను తాకారు. ఇది చూసిన జనసేన, టీడీపీ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అంతేకాదు ఈ వీడియోకు మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి మరీ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత నారా లోకేశ్‌పై మరింత అభిమానం పెరిగిందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం గొప్ప విషయమని అభినందిస్తున్నారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కిన నారా లోకేష్

VC - @SURENDRAPILLEL1 pic.twitter.com/qYYFwtiq46

— Telugu Scribe (@TeluguScribe) June 13, 2024

సీఎం రేవంత్‌రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసూన ఆగ్రహం
సీఎం రేవంత్‌రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లోగో మార్పును ఆమె తప్పుబట్టారు. రేవంత్ చిత్రకారుడు అనుకున్నానే కానీ చరిత్రను వక్రీకరించే చాతుర్యమున్న నాయకుడని అనుకోలేదని ఎద్దేవా చేశారు. చరిత్రను మార్చివేసి రాబోయే తరాలకి విషం నింపబోతున్నారా? అని ప్రశ్నించారు. కాకతీయులు ఢిల్లీ రాజులను ఎదిరించి దేశంలోనే రాజకీయ చరిత్రను మార్చిన గొప్పవ్యక్తులని గుర్తు చేశారు.

అలాంటి చరిత్ర కలిగిన వ్యక్తి, శిల్ప కళ కలిగిన వ్యక్తులు కాకతీయులను ప్రసూన చెప్పుకొచ్చారు. రైతుల సంక్షేమానికి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. కాకతీయ కళా తోరణాన్ని తీసివేయడంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. సమ్మక్క, సారక్కలను చంపింది కాకతీయులు అని ములుగు సామ్రాజ్యం గురించి మాట్లాడేలా చేస్తున్నారని మండిపడ్డారు.

కమ్మ వారు లేకపోతే ములుగు ఉందా? అని ప్రశ్నించారు. గణపతి దేవుడు కమ్మ వ్యక్తి అని, యాదవ కులస్తూరాలిని పెళ్ళాడి రెండు కులాల మధ్య బంధం పెంచారని చరిత్రకు వన్నె తెచ్చరాని తెలిపారు. అలాంటి కాకతీయ చరిత్రను వక్రీకరిస్తారా? అని మండిపడ్డారు. ఈ మార్పు వెనుక చంద్రబాబు కడిగిన ముత్యం సీతక్క ఉన్నారని అర్థమవుతోందన్నారు. కాకతీయులు క్రూరులని రేవంత్ రెడ్డితో మాట్లాడించడం సమంజసం కాదన్నారు. ములుగులో ఒక కమ్మ అభ్యర్థిగా తాను నిలబడతానని దమ్ముంటే సీతక్క తనపై గెలుపొందగలరా? అంటూ బహిరంగ సవాల్ చేశారు.

రేవంత్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ లోగో మార్పు వివాదంలో రేవంత్ రెడ్డిని తప్పుపట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన

గణపతి దేవుడు కమ్మ వ్యక్తి, యాదవ కులస్తూరాలిని పెళ్ళాడి రెండు కులాల మధ్య బంధం పెంచారు.

సీతక్క గారు మీరు చంద్రబాబు… pic.twitter.com/oFc3gtzc4F

— Telugu Scribe (@TeluguScribe) June 2, 2024