Rahul Gandhi - Vishvambhara News

అమెరికాకు దేశాన్ని అమ్మేశారు
విశ్వంభర, నేషనల బ్యూరో: బడ్జెట్‌పై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం దేశానికే సిగ్గుచేటని, భారత్ తన చమురు అవసరాలను ఎక్కడి నుంచి తీర్చుకోవాలో కూడా ఇప్పుడు అమెరికా నిర్ణయించే స్థాయికి పరిస్థితి దిగజారిందని ఆయన మండిపడ్డారు. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా దేశ సార్వభౌమత్వాన్ని ఇలా వేరే దేశం చేతుల్లో పెట్టలేదని, ఇంధన రంగాన్ని అమెరికా ఒక ఆయుధంగా మార్చుకుని భారత్‌ను శాసిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సూపర్ పవర్ యుగం ముగిసినా, ప్రభుత్వం ఇంకా లొంగుబాటు ధోరణితోనే వ్యవహరిస్తోందని విమర్శించారు.

డేటా భద్రత విషయంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. భారతీయుల దగ్గర ఉన్న అపారమైన డేటాపై అమెరికా, చైనాలు కన్నేశాయని, మన ప్రజల ఆలోచనలను, ప్రతిభను పట్టుకోవడానికి అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని హెచ్చరించారు. దేశీయ వస్త్ర పరిశ్రమ పరిస్థితి దయనీయంగా మారిందని, బంగ్లాదేశ్ ఉత్పత్తులపై సున్నా సుంకం ఉండటంతో మన పరిశ్రమలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అటు ట్రంప్ సుంకాలను పెంచుతుంటే, ఇటు మన ప్రభుత్వం మాత్రం అమెరికన్ ఎగుమతులను ప్రోత్సహిస్తూ మన ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తోందని విమర్శించారు.

ముఖ్యంగా వ్యవసాయ రంగానికి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులు స్తంభించిపోయారని, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి పంటల మార్కెట్లను అమెరికాకు ధారాదత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికన్ పొలాల యాంత్రీకరణకు మార్గం సుగమం చేస్తూ భారతీయ రైతుల పొట్ట కొట్టారని మండిపడ్డారు. "మీరు భారతదేశాన్ని అమ్మేశారు, భారత మాతను అమ్మడానికి మీకు సిగ్గుగా లేదా?" అంటూ ప్రధానిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అత్యవసర రంగాలకు కేటాయింపులు లేని ఈ బడ్జెట్ కేవలం విదేశీ శక్తులకు ఊడిగం చేసేలా ఉందని ఆయన దుయ్యబట్టారు.

విపక్ష ఎంపీల అరెస్టు ప్రజాస్వామ్యానికి మచ్చ..
విశ్వంభర,హైదరాబాద్: దేశ రాజధానిలో ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేయడాన్ని తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్మాస్ ఖాన్ తీవ్రంగా ఖండించారు.దేశంలో జరుగుతున్న ఓట్ల తొలగింపు కర్ణాటకలో 1 లక్ష ఓట్లు, బీహార్‌లో 58 లక్షల ఓట్లు — పై వివరణ కోరిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు విపక్ష ఎంపీలను అరెస్టు చేయడం, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

"ఓటు ప్రజల శక్తి. దానిని దొంగిలించడం అంటే ప్రజాస్వామ్యాన్ని చంపడం" అని అల్మాస్ ఖాన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధ బాధ్యతను వదిలి, కేంద్ర ఒత్తిడికి తలొగ్గి నిశ్శబ్దంగా వ్యవహరించడం అనుమానాస్పదమని అన్నారు. ఎన్నికల సంఘం వెంటనే వివరణ ఇవ్వాలని, పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజల ఓటు హక్కు రక్షణలో నిష్పక్షపాతంగా ఉండాలని డిమాండ్ చేశారు.
ఓట్ల దొంగతనానికి నిరసనగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చారని గుర్తుచేశారు.
"మీ ఓటు మీ భవిష్యత్తు. దాన్ని కాపాడాలంటే మీ గొంతు వినిపించాలి" అని అల్మాస్ ఖాన్ పిలుపునిచ్చారు.

కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం
కరీంనగర్ , విశ్వంభర :- కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి , భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ నీ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.అలాగే జులై 11 న బండి సంజయ్ పుట్టినరోజు సందర్బంగా ముందుస్తు శుభాకాంక్షలు తెలియజేసారు .ఈ కార్యక్రమంలో గుంగళ్ళ మాధవి మల్లేష్ , అర్షపల్లి శారద , తొంకోజు సాయి కుమార్ , కృష్ణ , రుద్రపల్లి మహేందర్ , రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు

వయనాడ్ ప్రజలకు రాహుల్ ప్రేమలేఖ
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్ బరేలీ, కేరళలోని వయనాడ్ స్థానాల నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రెండింటిలో ఒక సీటు వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన వయనాడ్‌ను వదులుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో  వయనాడ్ ప్రజలకు రాహుల్ భావోద్వేగంతో ఓ లేఖ రాశారు.

‘‘ప్రియమైన వయనాడ్ సోదర సోదరీ మణులారా.. మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా. ఐదేళ్ల కిందట నేను మిమ్మల్ని కలిశాను. మీ మద్దతు కోరేందుకు తొలిసారి వచ్చాను. అయినా నాపై ప్రేమ, ఆప్యాయతతో హత్తుకున్నారు. నేను వేధింపులను ఎదుర్కొంటున్న సమయంలో ఎదురైన పరిస్థితుల్లో మీరుచూపిన ప్రేమే నన్ను కాపాడాయి. నాకు ఆశ్రయం కల్పించి ఒక కుటుంబసభ్యుడిలా చూసుకున్నారు. వేలాదిమంది ఎదుట తన ప్రసంగాలను అనువాదం చేసేందుకు ధైర్యసాహసాలు ప్రదర్శించిన ధీరవనితల విశ్వాసాన్ని ఎలా మర్చిపోగలను. మీకందరికీ మాటిస్తున్నా దేశంలో విద్వేషం, హింసపై పోరాటం కొనసాగిస్తా. మీకు ప్రతినిధిగా నా సోదరి ప్రియాంకాగాంధీ వస్తోంది. ఇక నాకు ధైర్యంగా ఉంది. వయనాడ్‌ ప్రజలంతా తన కుటుంబసభ్యులని ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటాను. ధన్యవాదాలు..’’ అంటూ రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు.

వయనాడ్ ఎంపీ సీటును వదులుకున్న రాహుల్ గాంధీ
అందరూ అనుకున్నట్టే జరిగింది. రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ సీటును వదులుకున్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్ బరేలీ, వయనాడ్ రెండు చోట్లా పోటీ చేసి గెలిచారు. దాంతో ఏదో ఒక సీటును ఆయన వదులుకోవాల్సి ఉంది. ఇన్ని రోజులు దీనిపై ఆయన ఆలోచించారు.

కాగా అందరూ అనుకున్నట్టే తన కుటుంబానికి కంచుకోట అయిన రాయ్ బరేలీ నుంచి ఆయన ఎంపీగా కొనసాగబోతున్నారు. వయనాడ్ ఎంపీ సీటును వదులుకుంటున్నట్టు ఆయన మల్లిఖార్జున ఖర్గేకు తెలియజేశారు. ఇక ఈ సీటు నుంచి ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందని తెలిపారు. వయనాడ్ నియోజకవర్గం కేరళలో ఉంది.

కాగా 2019 ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీని.. వయనాడ్ ప్రజలు గెలిపించి లోక్ సభకు పంపించారు. అందుకే ఆ నియోజకవర్గం నుంచి మరోసారి తన కుటుంబ సభ్యులే ఉండాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కమ్యూనిస్టుల కంచుకోటలో మరోసారి గాంధీ కుటుంబం గెలుస్తుందా లేదా అనేది చూడాలి.

ఎలాన్ మస్క్ వర్సెస్ బీజేపీ.. ఈవీఎంలపై రచ్చ..
ఇప్పుడు దేశంలో ఎలాన్ మస్క్ వర్సెస్ బీజేపీ రగడ సాగుతోంది. అది కూడా ఈవీఎంల మీద. ఎందుకంటే మొన్న ఎలన్ మస్క్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఇండియాలో ఈవీఎంలను రద్దు చేయాలంటూ ఆయన పోస్టు పెట్టారు. ఎందుకంటే వాటిని మనుషులు లేదంటే ఏఐ హ్యాక్ చేసే ప్రమాదం ఉందని.. కాబట్టి వాటిని ఎన్నికల్లో వాడకపోవడం బెటర్ అంటూ తెలిపారు.

అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంటోంది. తాజాగా మస్క్ పోస్టు మీద కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. అసలు సురక్షితమైన డిజిటల్ హార్డ్‌వేర్‌ను తయారు చేయలేరన్నారు.

అసలు ఇండియాలో వాడే ఈవీఎంలకు కస్టమ్-డిజైన్ చేయబడినవి. సురక్షితమైనవి, ఏదైనా నెట్‌వర్క్ లేదా మీడియా నుంచి వేరుచేయబడి ఉంటాయి. పైగా వీటికి ఎలాంటి కనెక్టివిటీ లేదు. బ్లూటూత్, వైఫై, ఇంటర్ నెట్ లాంటివి లేవు. కాబట్టి వాటిని హ్యాక్ చేయడం అసాధ్యం. అంతే కాకుండా అవి రీప్రోగ్రామ్ చేయలేని ఫ్యాక్టరీ-ప్రోగ్రామ్ చేసిన కంట్రోలర్‌లు. కాబట్టి వాటి గురంచి మస్క్ పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బెటర్ అంటూ ఆయన విమర్శించారు.

ఇక ఇదే విషయంపై రాహుల్ గాంధీ మరోలా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంలు హ్యాకింగ్​కి గురవుతున్నాయని విపక్షాలు ఎన్నో ఏళ్లుగా ఆరోపిస్తున్నాయి. ఇక ఇప్పుడు.. ఎలాన్​ మస్క్​ సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ దాన్ని ఈ దేశంలో విమర్శించడానికి వీల్లేదు. కానీ మన దేశంలో ఎన్నికల పారదర్శకతపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. వ్యవస్థలు జవాబుదారీ తనంగా లేకపోతే మాత్రం.. కచ్చితంగా ప్రజాస్వామ్యం మోసానికి గురవుతున్నట్టే అని రాహుల్ మస్క్ కు మద్దతుగా మాట్లాడారు.

కాంగ్రెస్ వీరాభిమాని.. చెప్పులు లేకుండా 3000 కిలోమీటర్లు పాదయాత్ర
ఒంటి నిండా కాంగ్రెస్ కండువాలు.. చేతిలో కాంగ్రెస్ జెండా.. కాళ్లకు కనీసం చెప్పులు లేవు.. సుమారు 3వేల కిలోమీటర్లు చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్నాడు. అతడే సదాశివాలేఖర్. ఆయన కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. అయితే, సదాశివాలేఖర్ ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత జగ్గారెడ్డికి ఎదురుపడ్డాడు. ఆ వ్యక్తిని జగ్గారెడ్డి ఆరాతీయగా తన స్వస్థలం మహారాష్ట్రలోని షిర్డీ అని తెలిపాడు. తాను మణిపూర్ నుంచి బాంబే వరకు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నానని తెలిపాడు. అది విన్న జగ్గారెడ్డి ఆశ్చర్యానికి లోనయ్యారు.

పూర్తి వివరాలు అడగగా తాను సాదాసీదా రైతునని, కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానినని చెప్పుకొచ్చాడు. ఇంత శ్రమ పడటం ఎందుకు అని జగ్గారెడ్డి అడగగా.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ఇలాగే ఆయన వెంట తిరగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే వ్యవసాయానికి మేలు జరుగుతుందని, రైతులకు మంచి రోజులు వస్తాయని సదాశివాలేఖర్ తెలిపాడు. రైతులకు ఇప్పటి వరకు మేలు చేసింది కాంగ్రెస్సేనని, రాహుల్ గాంధీ ప్రధాని అయితే రైతులతో పాటు అన్ని వర్గాలకు అండగా ఉంటారని జగ్గారెడ్డితో అన్నాడు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి ఆయనను అభినందించారు.

పరువు నష్టం దావా కేసు.. రాహుల్ గాంధీకి ఊరట
గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్‌పై బీజేపీ పరువు నష్టం దావా వేసింది. అయితే, తాజాగా ఈ కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన బెంగళూరు స్పెషల్‌ కోర్టు  బెయిల్‌ మంజూరు చేసింది. 2019-2023 బీజేపీ పాలనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని, ప్రతీ పనిలోనూ 40శాతం కమీషన్ తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

రాహుల్‌ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న కర్ణాటక బీజేపీనేతలు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య, రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ నేతలు అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కేశవ్‌ ప్రసాద్‌ ఆ పార్టీ తరఫున పరువు నష్టం దావా వేశారు. 40 శాతం కమీషన్‌ ప్రభుత్వం’గా అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇప్పించారని దుయ్యబట్టారు.

అదేవిధంగా వివిధ రకాల ఉద్యోగాలకు బీజేపీ ‘రేటు కార్డులు’ పెట్టిందంటూ హస్తం పార్టీ పోస్టర్లు అతికించి తమ పార్టీ పరువుకు భంగం కలిగించిందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇక ఈ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు గత వారం బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రాహుల్ ఈ కేసులో సహ నిందితుడు కాగా ఆయన విచారణకు హాజరయ్యారు. వాదోపవాదనలు విన్న కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణను జులై 30కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 9వ తేదీన నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆ తేదీలో మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 9వ తేదీన ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం ఉండటంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 12వ తేదీన చేయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుగానే రెండు తేదీల్లో పండితులు మంచి ముహూర్తాలు చూశారు. అందుకే ప్రమాణ స్వీకారంలో మార్పు చేసుకోవడానికి ఏ ఇబ్బందీ రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ప్రమాణస్వీకారం చేసే ప్రాంతంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించినట్లు తెలుస్తోంది. బోయపాటి చంద్రబాబుతో పాటు, బాలయ్యకు అత్యంత సన్నిహితడనే విషయం తెలిసిందే.

తెలంగాణతో సోనియాది పేగుబంధం: రేవంత్ రెడ్డి
తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలలను నిజం చేసిన సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఎందుకు ఆహ్వానించారని కొందరు ప్రశ్నిస్తున్నారని రేవంత్ అన్నారు. కానీ తల్లిని పిలవడానికి ఎవరి అనుమతి లేదని రేవంత్ చెప్పుకొచ్చారు. ‘ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతోంది.. ప్రపంచ పటంలోనే హైదరాబాద్‌ను ప్రత్యేకంగా నిలపబోతున్నాం’ అని రేవంత్ రెడ్డి అన్నారు. సర్వ

అదేవిధంగా 70 రోజుల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు, 11,062 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆరు గ్యారంటీలకు 1.28కోట్ల దరఖాస్తులు వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో డూప్లికేట్ అప్లికేషన్లు మినహాయించగా 1.9కోట్ల దరఖాస్తులు మిగిలినట్లు చెప్పారు. వాటిని కంప్యూటరీకరించి ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందుబాటులోకి తేవాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ప్రారంభమైన ఐదో దశ పోలింగ్.. రాహుల్ భవితవ్యం తేలేది నేడే!
దేశంలో ఐదో విడత పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 49 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒడిశాలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తున్నారు.  ఈ విడతలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు పోటీ పడుతున్నారు. రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ, లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్, ముంబయి నార్త్ నుంచి పీయూష్ గోయల్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ  అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలపైనే ప్రధానంగా అందరి దృష్టి.

ఈ దశలో మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లోని జరుగుతున్న స్థానాలు కీలకంగా మారాయి. మహరాష్ట్రాలో 13 స్థానాలకు పోటీ జరుగుతోంది. ఈ 13 స్థానాల్లోనూ శివసేన రెండు వర్గాల మధ్య పోరు ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ లో ఈ దశలో 14 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 13 స్థానాలకు తన ఖాతాలో వేసుకుంది. ఒక్క రాయబరేలిలో మాత్రం సోనియా గెలిచారు. అయితే, ఈ సారి ఆ పరిస్థితి ఉండదని కాంగ్రెస్ భావిస్తోంది.

ఈ దశలో జరుగుతున్న 49 స్థానాలకు గాను గత ఎన్నికల్లో బీజేపీ 32 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కానీ.. ఈసారి ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఐదోదశలోనే ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒడిశా అసెంబ్లీకి నాలుగు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మే 13న పోలింగ్ మొదటి దశ పూర్తి అయింది. ఇవాళ రెండో దశలో భాగంగా 35 స్థానాలకు పోలింగ్ జరగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేడీ, బీజేపీ నేతల మధ్య ఇటీవల మాటల యుద్ధం నడిచింది.

సిటీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. ఎక్కడో తెలుసా…?
విశ్వంభర, వెబ్ డెస్క్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. అధిక మెజార్టీ సాధించి కేంద్రంలో అధికారం చేపట్టడానికి కాంగ్రెస్ నేతలు ఓటర్లతో మమేకమవుంతున్నారు. ఈ క్రమంలో నిన్న సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభ అనంతరం అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి దిల్ సుఖ్​ నగర్ లో బస్సులో ప్రయాణించారు. అంతే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పాలన గురించి, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందిపరిచిన అంశాలను రాహుల్​ ప్రయాణికులకు వివరించారు.