BENGALURU - Vishvambhara News

పార్కుల జోలికి రావొద్దు.. లాల్‌బాగ్‌లో బెంగళూరువాసుల ఆందోళన
Bengaluru Park Protection: బెంగళూరులోని లాల్‌బాగ్‌లో ఆదివారం నగరంలోని పార్కులను పరిరక్షించాలంటూ భారీ నిరసన జరిగింది. 5 వేల మందికి పైగా బెంగళూరువాసులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నగరంలోని పార్కులను ఇతర అవసరాలకు వినియోగించకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ ‘పార్కుల జోలికి రావొద్దు’ అంటూ నినాదాలు చేశారు.

కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వ పార్కు భూముల్లో 5 శాతం వరకు ప్రజా మౌలిక వసతుల కోసం ఉపయోగించుకునే అవకాశం కల్పించడంపై నిరసనకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపాదిత హెబ్బాళ్‌–సిల్క్‌బోర్డ్‌ టన్నెల్‌ రోడ్డుకు పార్కు భూములను ఉపయోగించే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పార్కులు, పచ్చని ప్రాంతాలు నగరానికి ఎంతో అవసరమని, వాటిని ఇతర నిర్మాణాల కోసం వినియోగించకూడదని బెంగళూరువాసులు కోరుతున్నారు.

ఈ నిరసనలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యతో పాటు పర్యావరణవేత్తలు, నగరంలోని వివిధ ప్రాంతాల నివాసితులు పాల్గొన్నారు. పార్కు భూములను మౌలిక వసతుల కోసం వినియోగించేందుకు వీలు కల్పించే చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. నగర అభివృద్ధి అవసరమే అయినప్పటికీ.. అందుకోసం బెంగళూరులోని పార్కులు, పచ్చదనాన్ని కోల్పోయే పరిస్థితి రాకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని కోరారు.

బెంగళూరులో నడిరోడ్డుపై యువతుల కొట్లాట.. వీడియో వైరల్
Bengaluru Cubbon Park: బెంగళూరులోని కబ్బన్ పార్క్‌లో ఇద్దరు యువతుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఆదివారం సెలవు రోజు కావడంతో కబ్బన్ పార్క్‌కు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ఈ సమయంలో పార్క్‌లోని రోడ్డుపై ఇద్దరు యువతులు ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో పరిస్థితి అదుపు తప్పి ఇద్దరూ పరస్పరం భౌతికంగా దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉన్న సందర్శకులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కొద్దిసేపు ఇద్దరు యువతుల మధ్య కొట్లాట కొనసాగడంతో చుట్టుపక్కల ఉన్నవారు ఈ ఘటనను ఆసక్తిగా గమనించారు.

ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్‌ ఫోన్‌లో వీడియోగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోలో ఇద్దరు యువతులు పరస్పరం గొడవ పడుతున్న దృశ్యాలు కనిపించడంతో నెటిజన్లు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఇద్దరు యువతులు ఎందుకు గొడవకు దిగారు? అసలు వివాదానికి కారణం ఏమిటి? అనే విషయాలు మాత్రం ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు లేదా సంబంధిత అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బెంగళూరులో మూడేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి.. తీవ్ర గాయాలు
Bengaluru Street Dogs Attack: బెంగళూరులో మూడేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బెంగళూరులోని చిక్కజాల సమీపంలోని సదహళ్లి ప్రాంతంలో అంగన్‌వాడీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న మూడేళ్ల బాలుడిపై ఐదు వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. బాలుడు ఒంటరిగా వెళ్తుండగా కుక్కలు అతడిని చుట్టుముట్టి కిందపడేసి పలుమార్లు కరిచినట్లు స్థానికులు తెలిపారు.

కుక్కలు బాలుడిపై దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కుక్కల దాడితో బాలుడు భయంతో కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు, స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న వారు కుక్కలను తరిమికొట్టి చిన్నారిని వాటి నుంచి రక్షించారు. దీంతో బాలుడికి మరింత ప్రమాదం తప్పింది. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. బాలల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీధికుక్కల బెడదను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా అంగన్‌వాడీలు, పాఠశాలలు, నివాస ప్రాంతాల సమీపంలో వీధికుక్కల సంచారం పెరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నారిపై జరిగిన ఈ దాడితో స్థానిక తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది.

నా ఓటు ఎలా పోయింది.. SIR ప్రక్రియలో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు డిలీట్
Prakash Raj: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో బెంగళూరులో తన ఓటు తొలగించారని నటుడు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. తన ఓటు తొలగింపుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బెంగళూరులోనే పుట్టి, ఇక్కడే ఓటు హక్కు కలిగి ఉన్న తన పేరు ఓటర్ల జాబితా నుంచి ఎలా తొలగించారని ప్రశ్నించారు. గతంలో ఇదే ప్రాంతం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయాన్ని కూడా ప్రకాష్ రాజ్ గుర్తుచేశారు.

SIR ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాల పునఃపరిశీలన జరుగుతున్న సమయంలో తన పేరు తొలగించడంపై ప్రకాష్ రాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓటు హక్కు కోసం తాను మళ్లీ ఏ ప్రక్రియ పూర్తి చేయాలి, కొత్తగా ఓటర్ కార్డు పొందేందుకు ఎన్నికల అధికారులు ఎలాంటి డాక్యుమెంట్లు అడుగుతారో తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

తనకు ఓటు హక్కు ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేకపోవడంపై ప్రకాష్ రాజ్ ప్రశ్నలు లేవనెత్తారు. SIR ప్రక్రియలో ఓటర్ల వివరాల పరిశీలన, ధ్రువీకరణ జరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులో ఓటర్ల జాబితాపై చర్చ కొనసాగుతోంది. కర్ణాటకలో SIR ప్రక్రియ సందర్భంగా ఓటర్ల వివరాలను మ్యాపింగ్ చేసి, అందుబాటులో లేని లేదా సరిపోలని వివరాలను పరిశీలిస్తున్నట్లు ఎన్నికల అధికారులు గతంలో వెల్లడించారు. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన ఓటు తొలగింపుకు కారణం ఏమిటో ఎన్నికల అధికారులు స్పష్టత ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.

విశాఖ వాసులకు పండగే.. రాత్రి పడుకుంటే ఉదయానికి బెంగళూరులోనే
Vande Bharat Sleeper: విశాఖపట్నం-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCOR) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ రైలును ప్రారంభించే అంశంపై సంబంధిత జోన్లు, డివిజన్ల నుంచి ఫీజిబిలిటీ నివేదికలను కోరినట్లు సమాచారం. ప్రయాణికుల రద్దీ, ట్రాక్ లభ్యత, నిర్వహణ సౌకర్యాలు, సమయ పట్టిక వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ప్రతిపాదన ప్రకారం, ఈ రైలును మంగళవారం మినహా వారంలో ఆరు రోజుల పాటు నడిపేలా ప్రాథమిక షెడ్యూల్‌ను రూపొందించారు.

ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం, విశాఖపట్నం నుంచి రాత్రి 8:15 గంటలకు బయలుదేరే ఈ వందే భారత్ స్లీపర్ రైలు మరుసటి రోజు ఉదయం 10 గంటలకు బెంగళూరుకు చేరుకునేలా సమయాలను సిద్ధం చేశారు. తిరుగు ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్‌పైనా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఇతర రైల్వే జోన్లు, డివిజన్లకు పంపించి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

ఈ రైలుకు రెండు మార్గాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొదటి మార్గం నెల్లూరు–తిరుపతి మీదుగా ఉండగా, రెండో మార్గం గుంటూరు–ధర్మవరం మీదుగా ప్రతిపాదించారు. ప్రయాణికుల డిమాండ్, ట్రాఫిక్, ఆపరేషనల్ సౌలభ్యం ఆధారంగా తుది మార్గాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ రైలు ప్రారంభమైతే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు బెంగళూరుతో మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన రైలు అనుసంధానం లభించనుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, వైద్య సేవల కోసం ప్రయాణించే వారికి ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఇది కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉంది. సంబంధిత జోన్లు, డివిజన్ల నుంచి ఫీజిబిలిటీ నివేదికలు వచ్చిన అనంతరం రైల్వే బోర్డు పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. బోర్డు ఆమోదం లభించిన తర్వాతే విశాఖ–బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుంది. దీంతో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుందా లేదా అనే అంశంపై ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది.

సిలికాన్ సిటీ కాదు.. ట్రాఫిక్ సిటీ!
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ట్రాఫిక్ కష్టాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కర్ణాటక రాజధాని బెంగళూరు, ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరాల జాబితాలో రెండో స్థానానికి చేరింది. నెదర్లాండ్స్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ సంస్థ 'టామ్‌టామ్' విడుదల చేసిన 2025 ట్రాఫిక్ సూచీలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మెక్సికో సిటీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవగా.. భారత ఐటీ హబ్ అయిన బెంగళూరు రెండో స్థానంలో నిలిచి వాహనదారుల అవస్థలను కళ్లకు కట్టింది.

టామ్‌టామ్ విడుదల చేసిన ట్రాఫిక్ సూచీ-2025 ప్రకారం.. బెంగళూరు నగరంలో కేవలం 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సగటున 36 నిమిషాల 9 సెకన్ల సమయం పడుతోంది. 2024తో పోలిస్తే ఈ సమయం మరో 2 నిమిషాలు పెరగడం గమనార్హం. రద్దీ వేళల్లో నగరంలో వాహనాల సగటు వేగం గంటకు కేవలం 13.9 కిలోమీటర్లకు పడిపోయింది. అంటే వాహనం కంటే వేగంగా మనిషి నడవగలడనే విమర్శలు వినిపిస్తున్నాయి.  2025, మే 17న బెంగళూరులో ట్రాఫిక్ రికార్డు స్థాయికి చేరింది. ఆ రోజు సాయంత్రం 6 గంటల సమయంలో 15 నిమిషాల ప్రయాణంలో వాహనదారులు కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే కదలగలిగారు. సగటున ఒక బెంగళూరు వాసి ఏడాదికి 168 గంటల సమయాన్ని (అంటే సుమారు ఏడు రోజుల పాటు) కేవలం ట్రాఫిక్ జామ్‌లలోనే కోల్పోతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

భారత్ లోని ఇతర నగరాల పరిస్థితి
ప్రపంచంలోని టాప్-5 రద్దీ నగరాల్లో బెంగళూరుతో పాటు మహారాష్ట్రలోని పుణె (5వ స్థానం) కూడా చోటు దక్కించుకుంది. ముంబయి (18వ స్థానం), దిల్లీ (23వ స్థానం), కోల్‌కతా (29వ స్థానం),  జైపుర్‌ (30వ స్థానం)చెన్నై (32వ స్థానం). హైదరాబాద్ (47వ స్థానం)ల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 500 నగరాల్లో సేకరించిన 3.65 ట్రిలియన్ కిలోమీటర్ల డేటా ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. పెరుగుతున్న వాహనాల సంఖ్య, రోడ్ల విస్తరణ లేకపోవడం, మౌలిక సదుపాయాల పనుల జాప్యం కారణంగానే భారత్‌లోని మెట్రో నగరాలు ఈ జాబితాలో ముందు వరుసలో నిలుస్తున్నాయి.

రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెయిల్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో హేమకు ఊరట లభించింది. బెంగళూరు స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పన అగ్రహార జైల్లో ఉంది. బెయిల్ లభించిన నేపథ్యంలో ఆమె జైలు నుంచి బయటికి రానుంది.

బెంగళూరు పోలీసులు మరికొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలను ఈ పార్టీకి తరలించే ప్రయత్నం చేసినట్లు ధ్రువీకరించారు. దీంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా పంపించారు. తొలిసారి జారీ చేసిన నోటీసులకు అనారోగ్య కారణాలతో హేమ విచారణకు హాజరు కాలేదు. దీంతో రెండోసారి కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అప్పుడు బుర్ఖా ధరించి విచారణకు హాజరైంది హేమ. ఆ తర్వాత కోర్టు ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా హేమ సభ్యత్వాన్ని రద్దు చేసింది. తాజాగా హేమకు బెయిల్ మంజూరు కావడంతో హేమకు కాస్త ఊరట లభించినట్లైంది. ఇవాళ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హేమ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. హేమ నుంచి ఎలాంటి మాదకద్రవ్యాలు లభించలేదని, చాలా రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించామని హేమ తరఫు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు. దీంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది.

హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్ట్
ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప అరెస్టయ్యారు. ఓ యువకుడి హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకునన్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం మైసూరులో దర్శన్తో పాటు మరో పది మందిని అరెస్టు చేశారు పోలీసులు. హత్య కేసులో విచారణ నిమిత్తం వారిని బెంగళూరుకు తరలించినట్లు కన్నడ మీడియా ప్రచారం చేస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. చిత్రదుర్గలోని లక్ష్మీ వెంకటేశ్వర బరంగయ్‌లో నివాసముంటున్న రేణుకా స్వామి జూన్ 1న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. జూన్ 8న ఆ యువకుడు హత్యకు గురయ్యాడు. జూన్ 9వ కామాక్షిపాళ్యం సమీపంలోని ఓ అపార్ట్మెంట్ పక్కన ఉన్న కాలువలో మృతదేహం కనిపించింది. కుక్కలు శవాన్ని పీక్కుతింటుండగా అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారాన్ని అందించాడు.

మృతుడు రేణుకా స్వామిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  ఈ కేసు విచారణలో భాగంగా ఇద్దరు నిందితులు నటుడు దర్శన్ పేరు చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మంగళవారం ఉదయం మైసూర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో దర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా మృతుడు రేణా స్వామి చిత్రదుర్గ దర్శన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెలుస్తోంది.  దర్శన్ భార్యకు రేణుకా స్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా, దర్శన్ కన్నడలో అనేక సినిమాల్లో నటించాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన మహేష్‌బాబు ‘పోకిరి’ సినిమాను కన్నడలో రీమేక్ చేశాడు.

BREAKING: రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెంగళూరు పోలీసుల నోటీసులు..!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 27వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో విచారించాలని పోలీసులు నిర్ణయించారు. మరోవైపు రేవ్ పార్టీ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నా కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకడంతో సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్స్ రాకెట్ కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రేవ్ పార్టీలో డ్రగ్స్, గంజాయి పట్టుబడటంతో పార్టీలో పాల్గొన్నవారి బ్లడ్‌ శాంపిల్స్‌ను పోలీసులు సేకరించారు.

దాదాపు 103 మంది వద్ద నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించగా.. వారిలో 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలగా వారి 59 మంది పురుషులు, 27మంది యువతులు, మహిళలు ఉన్నారు. అందులో నటి హేమ ఉండటం గమనార్హం. తాను రేవ్ పార్టీలో లేనని బుకాయిస్తూ తొలుత హేమ ఓ వీడియోను విడుదల చేయగా బెంగళూరు పోలీసులు ఆమె ఫొటోను విడుదల చేసి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

బెంగళూరు రేవ్ పార్టీలో నేను లేను.. నటి హేమ క్లారిటీ..!
బెంగళూరులో ఆదివారం రాత్రి ఓ రేవ్ పార్టీ జరిగినట్లు, అందులో పలువురు టాలీవుడ్ నటీనటులు ఉన్నట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. కన్నడ పోలీసులు బెంగుళూరులో ఓ రేవ్ పార్టీని భగ్నం చేశారు. ప్రస్తుతం ఆ రేవ్ పార్టీ జరిగిన ప్రదేశాన్ని పాలీసులు, నార్కోటిక్ అధికారులు పరిశీలిస్తున్నారు.ఇప్పటికే ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురిని కన్నడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

ఈ పార్టీకి దాదాపు 100మందికి పైగా హాజరైనట్లు సమాచారం. ఆ పార్టీలో వివిధ రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో టాలీవుడ్ నటీనటులు ఉన్నారని, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఉందని వార్తలు వచ్చాయి. దీంతో నటి హేమ ఈ వార్తలను ఖండిస్తూ ఇవాళ(సోమవారం) ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

హేమ మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడికీ వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నా. నా ఫామ్ హౌజ్‌లోనే ఎంజాయ్ చేస్తున్నా. నాకు బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదు. ఇందులోకి నన్ను అనవసరంగా లాగుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. అలాంటి వార్తలను నమ్మకండి. అవన్నీ ఫేక్ న్యూస్’ అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.