minister ponguleti srinivas reddy - Vishvambhara News

జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
విశ్వంభర,హైద‌రాబాద్ : అర్హులైన  జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్ధ‌లాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిజాయితీ, చిత్త‌శుద్దితో ఉంద‌ని  రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్బాల‌లో ఇచ్చిన  హామీల మేర‌కు అంద‌రి అభిప్రాయాల‌ను సేక‌రించి వ‌చ్చేనెల 2వ తేదీనాటికి ఒక కొలిక్కి తీసుకువస్తామ‌ని వెల్ల‌డించారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ హౌసింగ్‌, జ‌ర్న‌లిస్ట్స్ హౌసింగ్‌,  డెక్క‌న్ జ‌ర్న‌లిస్ట్స్ , తెలంగాణ  హౌసింగ్ సొసైటీల‌తో  మంత్రి స‌మావేశం నిర్వ‌హించారు.హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న జ‌ర్న‌లిస్టు హౌసింగ్ సొసైటీలు ఎప్పుడు ఏర్పాట‌య్యాయి, అందులో స‌భ్యుల సంఖ్య, స‌భ్య‌త్వానికి అర్హ‌త‌లు, ఇత‌ర అన్ని అంశాల‌పై మంత్రి సొసైటీ  స‌భ్యులను అడిగి తెలుసుకున్నారు. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ మిన‌హా మిగిలిన మూడు సొసైటీల‌లో సుమారు 2,424 మంది  అర్హులైన జ‌ర్న‌లిస్టులు ఉన్న‌ట్లు ప్రాధ‌మికంగా గుర్తించారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. జ‌ర్న‌లిస్టులు అంద‌రూ ఒకేతాటిపై ఉంటే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం సులువు అవుతుంద‌ని, అన్ని సొసైటీలు క‌లిపి ఒకే వేదిక‌పైకి వ‌చ్చి జేఏసీ  ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. జ‌ర్నలిస్టు సంఘాల‌లో స‌భ్యులు కాని అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌కు కూడా ఇళ్ళ స్ధ‌లాలు ఇస్తామ‌ని చెబుతూ ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు, అనుమానాల‌కు తావు లేకుండా ఇళ్ల స్ధ‌లాల మంజూరు జ‌రిగేలా అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు. గ‌తంలో జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్ధలాలు ఇచ్చిన ఘ‌న‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వాల‌దేన‌ని, ఇప్పుడు కూడా ప్రజా ప్ర‌భుత్వం వ‌చ్చాక  18 ఏళ్లుగా ప‌రిష్కారం కాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్ హౌసింగ్ సొసైటీ  ఇళ్ల స‌మ‌స్య‌ను కొలిక్కి తీసుకువ‌చ్చి  ర‌వీంద్ర భార‌తిలో  జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌తో స‌మావేశాన్ని ఏర్పాటు చేసి భూమి  అప్ప‌గించిన‌ప్ప‌టికీ న్యాయ‌వివాదాల కార‌ణంగా స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. జ‌ర్న‌లిస్ట్‌ల సంక్షేమానికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ద‌శాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్ధ‌లాల సమ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకొని జూన్ 2వ తేదీ నాటికి కొలిక్కి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారు సానుకూల దృక్ప‌ధంతో ఉన్నార‌ని ఫ్యూచ‌ర్ సిటీలో ఎమ్మెల్యేలు, బ్యూరో క్రాట్స్‌తో పాటే హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేస్తున్న‌ జ‌ర్న‌లిస్టుల‌కు కూడా ఇళ్ల స్ధ‌లాలు ఇవ్వ‌డానికి సిద్దంగా ఉన్నార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి  జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వారికి సూచ‌న ప్రాయంగా వెల్ల‌డించి సొసైటీలో ఒక తీర్మానం చేసి ప్ర‌భుత్వానికి అంద‌జేయాల‌ని సూచించారు.  18 సంవ‌త్స‌రాల క్రిత‌మే ఇంటి స్ధ‌లాల కోసం ప్ర‌తిస‌భ్యుడు రెండు ల‌క్ష‌ల రూపాయిల చొప్పున చెల్లించార‌ని  దీనిని దృష్టిలో పెట్టుకొని ఇళ్ల స్దలాల కేటాయింపులో త‌మ సొసైటీకి ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా స‌భ్యులు మంత్రిని కోరారు. సమావేశంలో మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్ కె. శ్రీ‌నివాస‌రెడ్డి, సమాచార పౌర‌సంబంధాల శాఖ ప్ర‌త్యేక క‌మీష‌న‌ర్ జి. ముకుంద రెడ్డి, సిపీఆర్‌వో మ‌ల్సూర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో మరో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం..
విశ్వంభర,హైదరాబాద్‌: తెలంగాణ లో మంత్రులు అడ్లూరి, పొన్నం వివాదం మరువక ముందే..మళ్లీ ఇద్దరు మంత్రుల మధ్య లొల్లి మొదలైంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓ మంత్రిపై సీఎం రేవంత్‌ రెడ్డికి, అలాగే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల‌లో మంత్రి పొంగులేటి మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని అలాగే , మేడారం ప‌నుల వ్య‌వ‌హారాల్లో ఆయ‌న సొంత కంపెనీల‌కు ఇచ్చుకున్న టెండ‌ర్ల వ్య‌వ‌హారాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళి ఫిర్యాదు చేసారు. ఇదే అంశం పై ఖర్గే తో ఫోన్ లో మాట్లాడిన కొండా ముర‌ళీధ‌ర్‌రావు, ప్ర‌స్తుతం జిల్లాలో జ‌రుగుతున్న అంశాల‌ను స‌మ‌గ్రంగా వివరించారు .

అలాగే కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షి న‌ట‌రాజ‌న్ ల‌కు కూడా మేడారం ప‌నుల వ్య‌వ‌హ‌రాలు, వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల్లో పొంగులేటి పెడుతున్న ఇబ్బందుల‌ను  కొండా దంప‌తులు నివేదించిన్నట్టు సమాచారం . త‌మ జిల్లాలో, త‌న శాఖ‌లో ఆయ‌న పెత్త‌నం ఏంట‌ని అధిష్టానంకు పిర్యాదు చేసారు. ఇద్దరు సీనియర్ మంత్రుల మధ్య తలెత్తిన ఈ వివాదంపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందోనని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

త్వరలో కొత్త రేషన్ కార్డులు.. పొంగులేటి కీలక ప్రకటన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలు, బడుగు బలహీనవర్గాలు, మహిళలు, రైతులను దృష్టిలో పెట్టుకొని పాలన సాగిస్తోంది. సంక్షేమ పథకాలు కూడా ఈ వర్గాలకు లబ్ది చేసేలా అమలు చేస్తున్నారు. ఇప్పటికే రుణమాఫీపై ఓ క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్.. నిన్నే పంట భీమాపై కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.

ఆయన సొంత నియోజకవర్గం పాలేరులో ప్రజల వద్దకే మంత్రి పొంగులేటి కార్యక్రమం నిర్వహించారు. నియంతృత్వ పాలన నుంచి మార్పు కావాలనే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని ఆయన అన్నారు. సొంతింటి కలను నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఆయన హామీ ఇచ్చారు. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. అంతేకాదు.. త్వరలోనే అర్హులు అందరికీ కొత్త రేషన్ కార్డులు, పెంచిన పెన్షన్లు అందిస్తామని భరోసా అన్నారు. పొంగులేటి ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

బీఆర్ఎస్ హయాంలో గత కొన్నేళ్లుగా కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయలేదు. దీంతో.. పొంగులేటి ప్రకటన పట్టాలెక్కితే వేల కుటుంబాలకు లబ్ధి జరిగే అవకాశం ఉంది. సొంతగా రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వ పథకాల అమలుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రేషన్ కార్డులతో పాటు.. గ్రామాల్లో స్కూల్లు, రోడ్లు, కమ్యూనిటీ హల్ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తామని పొంగులేటి చెప్పారు. ఎన్నికల కోడ్ పూర్తి అవ్వగానే ప్రకటనలు అన్ని పట్టాలెక్కుతాయని అన్నారు. సమస్యలు తెలసుకొని మరీ పరిష్కరిస్తామని అన్నారు.